అగ్ని మహా పురాణము

Table of Contents

52 - అథ చతుష్టష్టి యోగిన్యాదిలక్షణమ్.

హయగ్రీవుడు చెప్పెను :  ఇపుడు అరువది నాలుగు యోగినులను గూర్చి చెప్పెదను. వీరి స్థానము క్రమముగ తూర్పు నుండి ఈశాన్య పర్యంతము ఉండును.  యోగినుల పేర్లు అక్షోభ్య, రూక్ష్మకర్ణి, రాక్షసి, కృపణ, క్షయ, పింగాక్షి, అక్షయ, జేమ, ఇల, నీలాలయ, లోల, అలక, బలాకేళి, లాలస, విమల, హుతాశ , విశాలాక్షీ, హుంకార, బడబాముఖి, మహాక్రూర, క్రోధన, భయంకరి, మహానన, సర్వజ్ఞ, తరల, తార, ఋగ్వేద, హయానన, సొర, రుద్రసంగ్రాహి, శబర, తాలజంఘిక, రక్తాక్షి, సుప్రసిద్ధ, విద్యుజ్జిహ్వ, కరంకిణి, మేఘనాద, ప్రచండ, ఉగ్ర, కొలకర్ణి, వరప్రడ, చంద్ర, చంద్రావలి, ప్రపంచ, ప్రలయాంతిక , శిశువ క్ర, పిశాచి, పిశితాశ ,లోలుప, ధమని, తపసి, రాగిణి, వికృతానన, వాయువేగ, బృహృత్కు, వికృత, విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, జయంతిక, బిడాలి, రేవతి, పూతన, విజయాంతీక. ఈ యోగినులకు ఎనిమిది లేదా నాలుగు చేతులుండును. ఇచ్చానుసారముగ ఆయుధములను ధరించు చుందురు, ఉపాసకులకు సంపూర్ణ సిద్దులను ప్రసాదింతురు. భైరవునకు పండ్రెండు చేతులుండును. దంతములు ఎత్తుగా ఉండును. శిరస్సు పై జటా-చంద్రులుండును. ఒక వైపున నున్న ఐదు చేతులతో ఖడ్గ - అంకుశ - కుఠార - బాణ - జగదభయప్రదాన ముద్రలును రెండవ ప్రక్కనున్న ఐదుచేతులతో ధనుష్ - త్రిశూల - ఖట్వాంగ (మంచము కోడు) పాశ కార్ధ వర ముద్రలను ధరించి, యుండును. మిగిలిన రెండు చేతులలో గజ చర్మ యుండును. గజ చర్మమే వస్త్రము. సరా లంకారములచే అలంకృతుడై యుండును. మాతృకల మధ్య ప్రేతము పై కూర్చుండును. భైరవుని ప్రతిమ ఈ రూపమున నిర్మించి పూజించవలెను. భైరవునకు ఒక ముఖముండ వచ్చును. లేదా ఐదు ముఖములుండవచ్చును.

తూర్పుదిక్కు నుండి ఆగ్నేయము వరకు, విలోమ క్రమమున, అన్ని దిక్కులందును భైరవుని స్థాపించి క్రమముగ పూజింపవలెను. బీజమంత్రమును ఎనిమిది దీర్ఘస్వరములలో ఒక్కొక్క దానిచేత విడగొట్టి, అనుస్వార యుక్తము చేసి, ఆయా దిక్కునందున్న భైరవునితో కలిపి అన్నింటికి చివర “నమః' చేర్చవలెను. ఉదా. “ఓం హ్రాం భైర వాయనమః - ప్రాచ్యామ్, ఓం హ్రీం భైరవాయనమః - ఐశాన్యామ్ ఓం హ్రూం భైరవాయనమః – ఉదీచ్యామ్; ఓం హ్రీం భైరవాయ నమః - వాయవ్యే; ఓం హైం భైరవాయ నమః - ప్రతీచ్యామ్, ఓం హోం భైరవాయనమః . నైరృత్యామ్ ఓం హౌం భైరవాయ నమః ఆవాచ్యామ్; ఓం మహః భైరవాయనమః - ఆగ్నే య్యామ్” ఈ విధముగ మం తోచ్చారణ చేయుచు ఆయా ధిక్కులలో భైరవ పూజ చేయవలెను. వీటిలో ఆరు బీజమంత్రములతో షడంగన్యాసము చేసి ఆ ఆంగ ముని పూజ చేయవలెను. ధ్యానము ఈ విధముగ చేయవలెను. “భైరవుడు ఆగ్నేయ దళమునందు విరాజిల్లుచు, బంగారు నాలుక తోడను, నాద బిందు, చంద్రులతోడను, మాతృకాధిపత్యంగముతోడను ప్రకాశించుచున్నాడు. అట్టి భైరవునకు నమస్కారము). వీరభద్రుడు వృషభారూఢుడు, మాతృకామండల మధ్యమున నుండును. నాలుగు హ సములు. గౌరికి రెండు హస్తములు మూడు నేత్రములు. ఒక హస్తము నందు శూలము, రెండవ దానిలో దర్పణము ఉండును. లలితా దేవి కమలము పై కూర్చుండును. నాలుగు భుజములలో త్రిశూలము, కమండలువు, కుండి, వరదాన ముద్ర ధరించి యుండును. స్కందుని అనుసరించి యుండు. మాతృకా గణము చేతులలో దర్పణము. శలాక ఉండును. చండికకు పది భుజములుండును. - కుడి చేతులలో బాణ - ఖడ్గ - శూల - చక్ర, శక్తులను ధరించి యుండును. వామ హస్తములలో నాగ పాశ - చర్మ - అంకుశ - కుఠార - ధనుస్సులను ధరించును. సింహాధిరూఢయైన ఆ దేవి ఎదుట శూలముచే చంపబడిన మహిషాసురుని శవము పడి యుండును.

అగ్ని మహా పురాణమునందు చతుః షష్టి యోగిన్యాది లక్షణమను ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.