అగ్ని మహా పురాణము

Table of Contents

233 - అథ యాత్రామండల చింతాదిః

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను : ఇపుడు రాజ ధర్మానుసారము ఆందరి యాత్రను గూర్చి చెప్పెదను. శుక్రుడు అస్తంగతుడై నపుడును, నీచస్థావములో నున్న పుడును, వికలాంగుడై నపుడును, శత్రురాశిలో నున్న పుడును, ప్రతికూల స్థానమునందున్నపుడును, యాత్రచేయకూడదు. బుధుడు ప్రతికూల స్థానమునందున్నపుడును, దిక్కు అధిపతి గూడ ప్రతికూల స్థానమునందున్న పుడును యాత్ర చేయగూడదు. వైధృతి - వ్యతీపాత - నాగ - శకుని - చతుష్పాద - కింస్తుఘ్న యోగము లందును, విపత్ - మృత్యు-ప్రత్యరి - జన్మతార లందుచు, గండ యోగమునందును, రిక్త తిథులందును యాత్ర చేయగూడదు.

ఉత్తర - పూర్వదిక్కులును, పశ్చిమ – దక్షిణ దిక్కులును ఒక్కటేనని చెప్పబడినది. వాయవ్యము నుండి ఆగ్నేయము వరకును ఉండు పరిధి దండమును దాటి యాత్ర చేయగూడదు. భాను - సోమ - శనివారములందు యాత్ర చేయగూడదు. కృత్తిక మొదలు ఏడు నక్షత్ర సమూహములు తూర్పునందును మమ మొదలు ఏడు నక్షత్రములు దక్షిణము నందును, అనూరాధ మొదలగు ఏ నక్షత్రములు పశ్చిమమునందును ఉండును. ధనిష్టాదులగు ఏడు నక్షత్రములు ఉత్తరము నందుండును. పైన చెప్పిన నక్షత్రములు ఆయా దిక్కులకు ద్వారములు. ఆయా దిక్కులకు ఆద్వారము లన్నియు ఉత్తమములు. ఇపుడు ఛాయామానమును గూర్చి చెప్పెదను.

రవి వరమున ఇరువది, సోమవారమున పదునారు, మంగళవారమున పదు నేను, బుధవారమున పదమూడు, శుక్రవారమున పండ్రెండు, శనివారమున పదకొండు అంగుళముల ఛాయామానము చెప్పబడినది. ఇవి అన్ని కర్మలకును విహితములు. జన్మ లగ్నమునందును ఎదుట ఇంద్రధనుస్సు ఆవిర్భవించినపుడును యాత్రచేయగూడదు. శుభశకునాదులు కనబడిన పిమ్మట శ్రీమహావిష్ణువును స్మరించుచు యాత్ర చేయవలెను.

పరశురామా! ఇపుడు మండల విచారమును గూర్చి చెప్పెదను. సర్వవిధముల రాజును రక్షించవలేను. రాజు, మంత్రి, దుర్గము, కోశము, దండము, మిత్రులు, జనపదము- ఇవి రాజ్యము యొక్క సప్తాంగములు. ఈ సప్తాంగ రాజ్యమునకు విఘాతము కలిగించు వారిని సంహరించవలేను. రాజు తన మండలములనన్నింటిని వృద్ధిపొందించుకొనవలెను. అన్నింటికంటే తన మండలము మొదటిది. ఆ మండలమునకు సామంతరాజులే శత్రువులు. 'విజిగీషు' వగు రాజునకు తన మండలమునకు ఎడటి సీను (సరిహద్దు) యందున్న సామంతుడు శత్రువు. ఆ శత్రువు రాజ్యముతో ఎవనికి సరిహద్ద ఉన్నదో ఆతడు ఆశత్రువునకు శత్రువగుటచే విజిగీషువు నకు మిత్రుడు. ఈ విధమున విజిగీషుని మండలమునకు ఎదుట శత్రువు, మిత్రుడు, అమిత్రుడు, మిత్రమిత్రుడు, అరిమిత్రమిత్రుడు అని అయిదుగురు ఉందురు. ఇపుడు వెనుక నున్న వారినిగూర్చి వినుము. వెనుక నున్న వారిలో మొదటివాడు "పార్ష్ణిగ్రాహుడు". వాని వెనుక నున్న వాడు "ఆక్రందుడు". ఆ ఇద్దరి వెనుకనున్న వాడు "ఆసారులు వారిని వరుసగా “పా ర్ష్ణిగ్రహాసారుడు" "ఆక్రందాసారుడు" అని చెప్పుదురు. విజిగీషువైన రాజు శత్రువుయొక్క ఆక్రమణము ఉన్నను, లేకపోయినను ఆతని విజయమును గూర్చి నిశ్చితముగ ఏమియు చెప్పవీలు పడదు. విజిగీషవు, శత్రువు వీరిరువురును అసంఘటితులై యున్నపుడు వారి విగ్రహానుగ్రహములందు సమర్థుడగు తటస్థుడైన రోజు “మధ్యస్థుడు". ఈ ముగ్గురి విషయమున నిగ్రహానుగ్రహసమర్థుడగు రోజు ఉదాసీనుడ. ఎవ్వడును ఎవ్వనికిని శత్రువుకాదు; మిత్రుడుకాదు. అందరును కారణవశ ముచే పరస్పరము శత్రువులగుదురు, మిత్రులగుదురు. ఈవిధముగ పండ్రెండు రాజమండలములను గూర్చి చెప్పితిని.

కుల్యుడు, అనంతరుడు కృత్రిముడు అని శత్రువులు మూడు విధములు. వీరిలో పూర్వపూర్వుడు అధిక శత్రువు అనగా కృత్రిముని కంటే ఆనంతరుడు, అతని కంటె కుల్యుడు ప్రబలులు. కుల్యుని అణచుట చాల కష్టము. నా అభిప్రాయమున అనంతర శత్రువు కూడ కృత్రిముడే. పార్ష్ణీగ్రాహుడు శత్రువుకు మిత్రుడు. ఆయినను ప్రయత్నించివచో అతడు శత్రువుకు శత్రువు కూడ కావచ్చును. అందుచే వివిధోపాయముంచే పార్ష్ణీ గ్రాహుని తన వశములో నుంచుకొన వలెను. మిత్రునిచే శత్రువును నశింపచేయుట మంచిదని ప్రాచీన నీతిశాస్త్ర వేత్తలయభిప్రాయము. సామంతుడు(సీమానివాసి) అగుటచే మిత్రుడు కూడ మున్ముందు శత్రువు కావచ్చును. అందుచే విజయము కోరు రాజు, శక్తి ఉన్నచో స్వయముగానే శత్రువును నశింపచేయవలెను. ఎందువలన అనగా మిత్రుని ప్రతాపము పెరిగిపోయినచో ఆతని నుండి కూడ భయము కలుగ వచ్చును. ప్రతాపహీనుడై న శత్రువు నుంచి కూడ భయముండదు. విజిగీషువైన రాజు ధర్మ విజయి కావలెను. ప్రజలలో ఎవ్వరికిని ఉద్వేగము కలుగ కుండునట్లు చూచుకౌనుచు విశ్వాసము కలిగించి, తనవకములో నుంచుకొనవలెను.

అగ్ని మహాపురాణమునందు యాత్రా మండల చింతా కథనమను రెండువందల ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.