అగ్ని మహా పురాణము

Table of Contents

131 - అథ ఘాతచక్రాదివర్ణనమ్.

ఈశ్వర ఉవాచః

పరమేశ్వడు చెప్పెను :- పూర్వాడిదిక్కులందు ప్రదక్షిణక్రమమున అకారాది స్వరములు వ్రాయవలెను. దాని యందు శుక్ల పక్ష ప్రతిపత్తు పూర్ణిమ, త్రయోదశి, చతుర్దశి, శుక్ల పక్షాష్టమి మాత్రము, సప్తమి, కృష్ణపక్షపతిపత్తు మొదల తయోడశి వరకు (అష్టమి విడచి) పండ్రెండు తిథుల న్యాసము చేయవలెను. ఈ చైత్రచక్రమునందు పూర్వాదిదిశ లో స్పర్శ వర్ణములను వ్రాయుటచే జయపరాజయములను గూర్చియు లాభమును గూర్చియు నిర్ణయించవచ్చును, విషమదిక్కు, విషమస్వరము, విషమ వర్ణము ఆయిసచో కథ మగును. ఆది సమము లైనచో ఆశుభ మగును. యుద్ధరంథసమయమునందు సేనాపతి మొదట ఎవరి పేరు పెట్టి పిలుచునో అతని పేరు దీర్ఘాక్షరమతో ప్రారంభ మైనచో ఘోరసంగ్రామమునందు గూడ వానికి (సేనాపతికి) విజయము కలుగును. పేరు ప్రస్వాక్షరముతో పారంభ మైనచో తప్పక మృత్యువు కలుగును. ఉదాహరణమునకు ఒకని పేరు ఆదిత్యుడు మరి యొకని పేరు గురుడు. వీటిలో మొదటి పేరు మొదటి అక్షరము ‘ఆ’ దీర్ఘము రెండవ పేరు మొదటి అక్షరము హ్రస్వము. ఆందుచేత అద్యక్షరము దీరాక్షరముగా గల పేరు గలవానిని పిలచినచో మృత్యువు కలుగును. నక్షత్రపిండమునుబట్టి పరచక్రమును గూర్చి చెప్పెదను. మొదలు ఒక మనుష్యుని ఆకారము తయారు చేయవలెను. దానిపై నక్షత్రముల న్యాసము చేయవలెను సూర్యనక్షత్రము మొదలుగా నామనక్షత్రము వరకు లెక్కపెట్టవలెను. మొదటి మూడింటిని శిరస్సు పైనను, ఒకటి ముఖము పైనను, రెండు నేత్రములందును, సాలుగు చేతుల పైనను, రెండు చెవుల పైనను, ఐదు హృదయముపైననూ, ఆరు పాదముల పైనమ, వ్రాయవలెను. నామనక్షత్రమును స్పష్టముగ చక్రమధ్యమున వ్రాయవలెను. ఇట్లు వ్రాసిన పిమ్మట నేత్ర-శిరో-దక్షిణహస్త-ఫౌడ-హృదయ-కంఠ వామహస్త గుహ్యాంగములందు ఎచట శని-కుజ-రవి- రాహు నక్షత్రము లుండునో ఆ అవయమాలపై యుద్ధమునందు దెబ్బ తగులును.

తూర్పునుండి పశ్చిమమునకు పదమూడు రేఖలు గీసి ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డగీతలు గీయవలెను దానిపై అ నుండి ‘హ’ వరకు అక్షరములు వ్రాసి, 10, 9, 7, 12, 4, 11, 15, 24, 18, 4, 27, 24 అంకెలను కూడ వేయవలెను. అంకెలు ఆకారాద్యక్షముల పైన ఉండునట్లు వ్రాయవలెను. శత్రునామము నందలి స్వర వ్యంజనములకు ఎదురుగా అంకెలు కూడి పిండము (మొత్తము) చేయవలెను. దానిని ఏడుచే భాగించగా మిగిలిన ఒకటి మొదలగు దానిని పట్టి సూర్యాదిగ్రహముల భాగలను తెలిసికొనవలెను. శేషము 1 సూర్యుడు; 2 చంద్రుడు; 3 కుజుడు; 5 గురుడు; 6 శుక్రుడు; 7 శని వీరి భాగము లగును రవి-శని-కుజ భాగలు వచ్చినచో జయము కలుగును. శుభగ్రహభాగ మైనచో సంధి కుదురును. తూర్పునుండి పశ్చిమమువరకు పండ్రెండు రేఖలు గీయవలెను. ఆరు లేఖలు ఉత్తరదక్షిణముగ వ్రాయవలెను. దీని పై కోష్ఠమున 14, 27, 12, 15, 6, 4, 3, 17, 8, 8 అంకెలు వ్రాసి కోష్ఠములందు అకారాదిస్వరములు మొదలు హవరకు నుండు అక్షరములు వ్రాయవలెను. పిదప పేరు లోని అక్షరముల ద్వారా ఏర్పడిన మొత్తమును ఎనిమిదిచే భాగించి, ఏకాదిశేషమును బట్టి వాయస –మండల - రాసభ – వృషభ - కుంజర - సింహ - బర - ధూమ్రము లను భాగనామములు అగును. వీటిలోవాయసముకంటె మండలము, దానికంటె రాసభము ఈవిధముగ పూర్వముకంటె ఉత్తరోత్తరము బలీయము.

ఆగ్ని మహాపురాణమునందు ఘాతచక్రాది వర్ణన మను నూటముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.