అగ్ని మహా పురాణము
275 - అథ యదువంశవర్ణనమ్
అగ్ని రువాచః
అగ్నిదేవుడు పలికెడు : యదుపునకు నీలాంజికుడు, రఘువు, క్రోష్టు, శతజిత్, సహస్రజిత్ అను ఐదుగుడు పుత్రులు జన్మించిరి. వారిలో సహస్రజిత్ జేష్టుడు. శతజిత్తునకు హైహయాడు, రేణుహయుడు, హయుడు అని ముగ్గురు పతులు పుట్టిరి. హైహయునకు ధర్మనేత్రుడు వానికి సంసాతుడు, వానిచి మహిమండు, వానికి భద్రసేనుడు, వానికి దుర్గముడు, వానికి కడ జన్మించిరి. కనకునకు కృతవీర్య-కృతాగ్ని-కరవీర-కృతౌజులను పుత్రులుజన్మించిరి. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన దత్తాత్రేయుడు ఆతనికి సప్తద్వీప పరివృతమగు పృథ్విపై ఆధిపత్యమును, వేయ్యిభుజములను యుద్దనునందు అజేయత్వమును వరముగ ఇచ్చి “నీవు ఎప్పుడు అధర్మము చేయుదువో అపుడు శ్రీమహావిష్ణువు నిన్ను సంహరించును” అని చెప్పెను. అర్జునుడు పదివేలయజ్ఞములు చేసెను. అతనిని స్మరించగనే రాష్ట్రములో ఎవరికిని ధన నాశనము కలుగకుండెను. యజ్ఞదావ, తపపరాక్రము, శాస్త్రజ్ఞానము లందు కృత వీర్యకుమారుడగు అర్జునునకు సాటి ఎవ్వరును లేరు. ఆతనికి ఐదువందరి పుత్రులు జనించిరి. వారిలో శూరసేన - శూర - ధృష్ణోక్త - కృష్ణ - జయధ్వజులు, అను ఐదుగురు ప్రధానులు.జయధ్వజుడు అవంతీ దేశరాజాయెను. అతనికి తాల జంముడు పుత్రుడు. తాలజంఘునకు ఆదే పేరుతో ప్రసిద్దులగు చాలమంది పుత్రులు జనించిరి. హైహయవంశ క్షత్రియులలో భోజ - అవంతీ - వీతిహోత్ర - స్వయంసంత, శౌండికేయులను ఐదు కులములు ఉండెను. వీతిహోత్రునకు అనంతడు అతనికి దుర్జయుడు జన్మించెను.
ఇపుడు క్రోష్టువంశమును గూర్చిచేప్పెదను, ఈవంశమున శ్రీమహావిష్ణువు స్వయముగ జన్మించెను. క్రోజ్జనకు వృజినీవంతుడు అతనికి స్వాహా, వానికి రుషద్గుడు, అతనికి చిత్రరథుడు ఆతనికి చక్రవర్తియై శశిబిందువు జనించిరి. శశిబిందువు సర్వదా విష్ణుభజన సక్తుడై యుండెను. ఆతనికి పదివేలమంది పుత్రులు పుట్టిరి వారందరును అధికధనవంతులు తేజశ్శాలులుఅయివుండిరి. వారిలో పృథుశ్రవుడు జ్యేష్టుడు. అతనికుమారుడు సుయజ్ఞుడు అతనికి ఉశనుడు ఆతనికి తితిక్షువు, ఆతనికి మరుత్తుడు, ఆతనికి ఋక్మకవచుడను కంబలబద్దీ శుడు పుట్టెను. ఋక్మ కవచునకు ఋక్మేశువు, పృథు రుక్మకుడు, రావి, జ్యాసగుడ, పాపఘ్నుడు మొదలగు ఏబది పుత్రులు జన్మించిరి. వీరిలో జ్యామగుడు స్త్రీలకులొంగిన వాడై యుండెను. వానికి శైబ్యయిందు విదర్భుడు యన కుమారుడు పుట్టెమ. ఆతనికి కౌశికుడు లోమపాదుడు క్రథుడు అనుపుత్రులు పుట్టిరి. వీరిలో లోమపాదుడు జ్యేష్ఠుడు. ఆతనికి కృతియను పుత్రుడు పుట్టెను. కౌశికుని పుత్రుడు చిది. ఈ వంశము వారు చైడ్యలు యను పేరుతో ప్రసిద్ధులు. విదర్భపుత్రుడగు పృథునకు కుంతి, కుంతికి ధృష్టకుడు, పుట్టిరి. వానికి ధృతి, వానికి విదూరథుడు, పుట్టిరి విదూరథునకు శూరుడనికూడ పేరు. దళార్జునకు వ్యోమూడు వానికి జీమూతుడు వానికి విక లుడు. వానికి భీమరథుడు, వానికి నవరథుడు, వానికి ధ్రుఢరథుడు, వానికి శకుంతి, దానికి కరంభుడు, దానికి దేవరాతుడు, వానికి దేవ నేత్రుడు, వానికి వధువు, వానికి ధ్రవర సుడు, వానికి పురుహూతుడు, వానికి జంతవు - వానికి సాత్వతుడు పుట్టెను. సాత్వతుడు యదు వంశీయులలో ఉత్తమగుణవంతుడగు రాజు అతనికి భజమానుడు, వృష్టి అంధకుడు దేవావృదుడు, అను నలుగురు పుత్రులు పుట్టిరి. ఈ నలుగురి వంశ ములును ప్రసిద్దములైనవి. భజ మానునకు బాహ్యుడు, వృష్టి-కృమి, నిమి, అను పుత్రులు పుట్టిరి. దేవావృధునకు విభువు పుట్టెను. ఆతని విషయమున ఈశ్లోకము చెప్పబడు చున్నది. “మనము దూరమునుండి సద్గుణములను ఎట్లువినుచున్నా మో, దగ్గరనుండి కూడ ఆమ్లేచూచుచున్నాము. బభ్రువు మనుష్యులలో శ్రేష్టుడు, దేవావృధుడు దేవతాసమానుడు.” బభ్రువునకు కుహురుడు భజమానుడు శిని, కంబలబర్హిషుడు ఆను వాసుదేవభక్తులగు నలుగురు కుమారులు పుట్టిరి.
కుహురునకు ధృష్ణువు-వానికిధృతి-వానికి కపోతరోముడు, వానికి తిత్తిరి, వానికి నరుడు, వానికి, ఆనక దుందుభి. పుట్టిరి. ఆనకదుందుభికి పునర్వసువు ఆతనికి ఆ హుకీ పుత్రుడగు ఆ హుకుడు పుట్టెను. ఆ హుకునకు దేవక ఉగ్ర సేనులు పుత్రులు. దేవకునకు దేవవంతుడు ఉపదేవుడు సహదేవుడు, దేవర క్షితుడ, అను నలుగురు పుత్రులు పుట్టిరి. వీరికి ఏడుగురు సోదరీలు ఉండిరి. వారిని వసుదేవుడు వివాహమాడెను. దేవకి శ్రుతదేవి. మిత్రదేవి, యశోధర, శ్రీదేవి, సత్యదేవి, సురాపి, అని వీరి పేర్లు. ఉగ్రసేనునకు కంస-న్యగ్రోధ-సునామ-కంక-శంకు-సుతను-రాష్ట్రపాల-యుద్ధముష్టి-సుముష్టికులను అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి. వీరిలో కంసుడు జ్యేష్ఠుడు. భజమానునకు ఉత్తమ. రథికుడై న విదూరథుడు అతనికి రాజాధి దేవశూరులు పుట్టిరి. రాజాధి దేవునకు శోణాశర్వుడు, శ్వేతవాహనుడు, అను ఇరువురు పుత్రులు జన్మించిరి. శోణాశ్వునకు శనిశ త్రుజిత్, మొదలగు ఐదుగురు పుత్రులు జన్మించిరి. కమికి ప్రతి క్షేత్రుడు వాని భోజుడు, వానికి హృదికుడు జన్మించిరి. హృదికుని పదిమంది పుత్రులలో కృతవర్మ-శతధన్వుడు- దేవారుడు-భీషణుడు-మొదలగువారు ప్రధానులు. దేవార్జునకు కంబల బరి ఆతనికి సమౌజుడ, ఆతనికి సుదౌష్ట్ర-సువాస-ధృష్టులు జన్మించిరి. ధృష్టునకు గాంధారిమాద్రియను ఇద్దరు భార్యలుండిరి. గాంధారియందు సుమిత్రుడు, మాద్రియందు యుధాజిత్తు పుట్టిరి. ధృష్టునకు అనమిత్రుడుశిని పుట్టిరి. శినికి దేవమీఢుషుడు జనించేను. అనమిత్రునకు నిమ్నుడు ఆతనికి ప్రసేన-సత్రాజిత్తులు పుట్టిరి. సోదరుడగు సత్రాజిత్తుకు సూర్యుని నుండి లభించిన శ్యమంతక మణిని ధరించి ప్రసేనుడు వేటకై వెళ్ళగా ఒక సింహ మతనిని చంపి మాణిక్యమును గ్రహించెను. ఆసింహమును చంపి జాంబవంతుడు ఆ మణిని తీసుకొనెను. పిదప శ్రీ కృష్ణుడు యుద్ధము నందు జాంబవంతుని ఓడించి జాంబవతిని ఆమణిని స్వీకరించి ద్వారకాపురికి తిరిగి వచ్చి మణిని సత్రాజిత్తుకు ఇచ్చివేసెను. శతధన్వుడు సత్రా జిత్తును చంపివేసెను. శ్రీ కృష్ణుడు శతధన్వునిచంపి ఆమాణిక్యమును లాగుకొని యశ్శూలియయ్యెను. ఆతడు బలరామాది యదువంశీయుల సమక్షమున ఆమణిని ఆక్రూరునకు యిచ్చెను. దీనితో శ్రీ కృష్ణుని పై వచ్చిన మిథ్యారోపము తొలగి పోయెను. ఈ కథను చదువువానికి స్వర్గముంభించును. సత్రాజిత్తునకు బంకకారుడను పుత్రుడు శ్రీకృష్ణుని భార్యయగు సత్యభామయు జనించిరి. ఆవమిత్రునకు శిని వానికి సత్యకుడు వానికి యుయుధానుటను నామాంతరముగల సాత్యకి, వానికి ధుని, పానికి యుగంధరుడు పుట్టిరి , యుధాజిత్తునకు స్వాహ్యుడు. వానికి ఋషభ - క్షేతకులు పుట్టిరి. ఋషభునకు స్వవల్కుడు, దానికి అక్రూరుడు, వానికి సుధన్వకుడు పుట్టిరి. శూరు నకు వసుదేవుడు మొదలగు పుత్రులు పృథయను కన్యయు పుట్టిరి ఆమెపాండురాజునకు భార్య, కులతియను సామాంతరముగల ఆమెకు (పృథ) యముని అంశముచే యుధిష్ఠిరుడు, వాయుఅంశ ముచే భీమసేనుడు, ఇంద్రాంశముచే ఆర్జునుడు జన్మించిరి. మాద్రికి నకుల సహదేవులు జన్మించిరి. వసుదేవునకు రోహిణియందు బలరామ సారణదుర్గములు అను ముగ్గురు పుత్రులు దేవియందు సుషేణ - కీర్తిమత్ - భద్రసేన - జారుఖ్య - విష్ణుదాస భద్రదేహులు జన్మించిరి. ఈ ఆరుగురు శిశువులను కంసుడు చంపివేసెను. పిదప బలరామ కృష్ణులు ఆవిర్భవించిరి. చివర కల్యాణవచనముగల సుభద్ర జన్మించేను. శ్రీకృష్ణునకు చారుదేష్ణుడు సాంబుడు మొదలగు పుత్రులు పుట్టిరి. సాంబారులు జాంబవతి పుత్రులు.
అగ్నిమహాపురాణమున యదువంశవర్ణనమను రెండువందలడెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.
