అగ్ని మహా పురాణము
295 - అథ దష్ట చికిత్సా
అగ్ని రువాచః
ఆగ్ని దేవుడు చెప్పెను. మంత్ర, ధ్యాన, ఔషధములతో పాముకరచిన వానికి చికిత్సను. నీకు చెప్పేదను. “ఓం నమోభగవతే నీలకంఠాయ” అను మంత్రమును జపించుట చే విషము నశించును. గోమయర సమును ఘృతముతో త్రాగించినచో ఇది ప్రాణమును రక్షించును. విషము రెండు విధములు. సర్పమూషకాది విషము జంగమ విషము. శృంగాది విషము స్థావర విషము. శాంత స్వరముతో బ్రహ్మ (క్షౌం) లో హితము (హ్రీం) తారకము (ఓం) శివము (హౌం) ఈ అక్షరములతో వియతి నామమంత్రమున్నది. దీనికి శబ్దమయ తార్క్షుడు యని పేరు. “ఓంజ్వల” మొదలు “అప్రతిహతశాసనం” “వం హూంఫట్ హస్తాయ ఫట్” యనునవి మంత్రము “ఉగ్రరూపధారక” మొదలు “స్వాహా నేత్రాయ” వరకు - కూడ ముత్రము. మాతృకాన్వయకమలము వ్రాసిదానికి ఎనిమిది దిక్కులందును ఎనిమిది దళము లుండునట్లు చూడవలెను. పూర్వాది దిక్కులందు రెండేసి స్వరములు వ్రాయవలయును. కవర్గము మొదలు ఏడు వర్గ ముల చివరి రెండేసి అక్షరములు కూడ ఒక్కక్క దళముపై వ్రాయవలయును. ఈ కమలము యొక్క కేసర భాగమును వర్గముల ఆద్యక్షరములచే కప్పి కర్ణిక యందు అగ్ని బీజమను (రం) వ్రాయవలయును, సాధకుడు ఆ కమలమును హృదయము నందుఁచుకొని ఎడమ చేతిలో దానిని భావన చేయవలయును. అంగుష్టాదులందు వియతి మంత్ర వర్ణముల న్యాసముచేసి వాటిచే భిన్నములగు కళఁను భావన చేయవలయును. పిమ్మట పసుపు పచ్చనిరంగుతో భూపురము ఆను చతుష్కోణ మండపము చేసి దానికి నాల్గు వేపులను వజ్ర చిహ్నము వుంచవలెను. ఈ మండలమునకు ఇంద్రుడు దేవత అర్ధ చంద్రా కార వృత్తము జల దేవతా సంబంధమైనవి. కమలములోని సగము భాగము శుక్ల వర్ణము. దాని దేవత వరుణుడు. పిదప స్వస్తిక చిహ్న ముతో గూడిన త్రికోణాకారము తేజోమయమగు వహ్ని దేవతా మండల చింతన చేయవలయును. వాయుదేవతా మండలము ఓందు యుక్తమై వృత్తాకారమై నల్లని మాలలతో ప్రకాశించుచుండును.
ఈ నాలుగు వియతి వర్ణములను అంగుష్ఠాది అంగుళీ మధ్య పర్వము లందు సువర్ణ మయ నాగ వాహనముచే చుట్టబడిన స్థానము నందు వున్నట్లు భావన చేసి ఆ నాలుగు పర్వము లందు పృథివ్యాది భూతములను నాల్గింటి న్యాసము చేయవలయును. పిదప రూపరహిత శబ్ద తన్మాత్రమగు శివ దేవుని యొక్క ఆకాశ తత్వమును కనిష్ఠికా మధ్య పర్వమున వున్నట్లు భావన చేసి దాని లోపల వేదమంత్ర ప్రథమాక్షరమును న్యాసము చేయవలయును. నామముల ఆద్యక్షరములను వాటి మండములపై న్యాసము చేయవలయును. పృథివ్యాది భూతముల మొదటి అక్షరములను అంగుషాదుల చివరి పర్వము లపై న్యాసము చేసి విద్వాంసుడు గంగాది తన్మాత్రల అక్షరములను ఐదు అంగుళింపై న్యాసము చేయవలయును. ఇట్లు చేసిన వాడు తార్య మంత్రము ఉచ్చరించుచు పాము కరచిన వానిని స్పృశించగానే రెండు విధముల విషము నశించును. వియతి మంత్రము యొక్క నాలుగు అక్షరములను తన శ్రేష్ఠమైన రెండు అంగుళులతో నాభి స్థాన మందును పర్వము నందును న్యాసము చేయవలయును. గరుత్మంతుడు మోకాళ్ళ వరకు బంగారు ఛాయ కల్గి యుండును. మోకాళ్ళ నుండి నాభి వరకు మంచు వంటి తెల్లటి కొంతిక ఆగి యుండును. నాభి నుండి కంఠము వరకు ఎర్ర గాను కఁఠము నుండి కేశముల వరకు నల్ల గాను వుండును. ఇతడు బ్రహ్మాండము నంతను వ్యాపించి యుండును. చంద్రుడను పేరు గల ఇతడు సర్పాలంకారములను ధరించి యుండును. అతని నాసికాగ్ర భాగము నీల వర్ణము రెక్కలు చాల విశాలమైనవి. మంత్రవేత్త తనను గరుడ స్వరూపునిగా భావించవలయును. అట్టి వాని వాక్యము చేతనే విషము తొలగి పోవును. గరుడుని చేతి పిడి కిలి రోగి యొక్క చేతిలో వున్నచో అది ఆతని అంగుష్ఠము నందలి విషమును తొలగించును. ఆ మంత్రవేత్త గరుడ స్వరూప మగు తన హస్తమును పైకి ఎత్తి ఐదు వ్రేళ్ళను కదళ్చినంత మాత్రముననే విషము వల్ల కలిగిన మదాదులను చూచుచు విషసంజనాదికము చేయకలుగును.
ఆకాశము మొదలు భూ బీజము వరకు వున్న ఐదు బీజములకు పంచాక్షర మంత్ర రాజము అని పేరు. (హం, యం, రం, వం, లం) అధికమైన విషమును స్థంభింప చేయవలసి వచ్చినపుడు ఈ మంత్రమును ఉచ్చరించినంత మాత్ర ముననే విషము శమించును. దీనికి వ్యత్యస్త భూషణ బీజ మంత్రమని పేరు. దీనిని బాగుగ సాధన చేసి ప్రారంఠమున సంప్లవము, ప్లావయ ప్లావయ అను వాక్యము చేర్చినచో విష సంహార మగును. ఈ మంత్రమును బాగుగ జపించి అలి మంత్రించిన జలముతో స్నానము చేయించినంత మాత్రముననే రోగిని లేచినట్లు చేయును. లేదా మంత్రము జపించుచు చేసిన... శంఖ భేత్యాది ధ్వనిని విన్నంత మాత్రముననే నిస్సందేహముగ విషము నశించును. భూ బీజ తేజో బీజములను తారుమారు చేసి ఆ మంత్రమును ఏర్పరచినచో దాని ప్రయోగము వలన కూడ విషము నశించును. భూ బీజ వాయు బీజములను తారు మారు చేసి మంత్రము ఏర్పరచి ప్రయోగించినచో ఆ విషము మరియొకని చేరును. మాంత్రికుడు రోగి దగ్గరగా వుండి కాని, తన యింటిలో వుండి కాని, గరుడ స్వరూపమును చింతించుచు తానే గరుత్మంతుడని భావన చేయుచు రం. వం అను రెండు బీజములనే ఉచ్చరించినచో సాఫల్యమును పొందును. గరుత్మంతుని ఆలయము నందు కానీ వరుణుని ఆలయ ముదు కాని కూర్చండి ఈ మంత్రమును జపించినచో విషమును నశింవ చేయగలుగును. ఈ మంత్రమునకు “స్వధా” శ్రీ బీజము లను చేర్చినచో దీనికి కౌము దిండి మంత్రము యని పేరు. దీనిని జపించుచు స్నానము చేసి జలము త్రాగినచో సాధకుడు అన్ని విధములగు విషముల పైనను జ్వరముల పైనను రోగముల పైనను ఆపమృత్యువు పైసను విజయము సాధించును. “పక్షి పక్షి మొదలు క్షి క్షి స్వాహా” వరకు వున్న మూలోక మంత్రములు గరుడ మంత్రములు. ఈ మంత్రము నుచ్చరిం చుచు ఆభి మంత్రించినచో విషము నశించును. “పక్షిరాజాయ మొదలు “ ప్రచోదయాత్” వరకు గరుడ గాయత్రి మంత్రము పైన చెప్పిన రెండు రాజ మంత్రములకును రంబిజము చేర్చి వాటి పార్శ్వము నందుకూడ రంచేర్చి పిమ్మట దంత శ్రీ దండి . కొల , లాంగలీలను చేర్చి దాని మొదట నీలక ఈ మంత్రము చేర్చవలయును. ఈ మంత్రమును వక్ష స్థలము నందును, కంఠమునందును శిఖ యందును న్యాసము చేయపలయును. పైరెండు మంత్రము లను సంస్కరించి స్తంభముపై వ్రాయవలయును.
పిదప “హర హర హృదయా యనమః” యని హృదయ న్యాసము “కపర్ది స్వాహా, శిరసే స్వాహా నీలకంఠాయ స్వాహా శిఖాయైవ షట్ అను న్యాసముల ను చేసి కాలకూట విష భక్షణాయ” హుం ఫట్, కవచాయహుం యని చెప్పుచు భుజములను కంఠములను స్పృశించ వలయును. “కృత్తి వాససే వౌషట్” యని నేత్రత్రయము నండు న్యాసము చేయ వలయును. పూర్వాది దిక్కులందు క్రమముగ శ్వేత, పీత, అరుణ, శ్యామ ముఖములు కలవాడును నాలుగుహ సము లందును క్రమముగ. ఆశయ వరద, ముద్రలు, ధనుస్సు, వాసుకి ధరించిన వాడును, కంఠమునందు యజ్ఞోపవీతముతో ప్రకాశించు చుండువాడును పార్శ్వమున పార్వతితో కూడిన రుద్రుడు దాని దేవత. . మంత్రాక్షరములను పాదములు మోకాళ్ళు గుహ్య భాగము నాభి హృదయము, కంఠము, శిరస్సు వీటి పై న్యాసము చేసి రెండు హస్తముల ఆంగుష్ఠాద్యంగుళుల పై కూడి న్యాసము చేయవలయును. అనగా తర్జని మొదలు తర్జని వరకు న్యాసము చేసి సంపూర్ణ మంత్రమును అంగష్టుముల పై న్యాసము చేయవలయును. ఈ విధముగ ధ్యాన న్యాసములు చేసి శీఘ్రముగ శూల ముద్రను బంధించి విష సంహారము చేయవలయును. కనిష్ట అంగుళిని జేష్టాగుళితో బంధించి మిగిలిన మూడు వ్రేళ్ళను చాపిన చో అది శూల ముద్ర. విషమును వశింప చేయుటకు ఎడమ చేతిని, ఇతర కార్యము లందు కుడి చేతిని ప్రయోగించవలయును. “ఓం నమో భగవతే” మొదలు “రుద్ర మన్యవే” వరకు వున్న మూలో మౌ మంత్రమును జపించుచు తుడిచినచో విషము నశించును. సండేహము లేదు. ఈ మంత్రమును రోగి చెవిలో జపించుటచే గాని మంత్రము జపించుచు రోగి ప్రక్క నేల పై చెప్పుతో కొట్టుటచేత గాని విషము ఉగిపోవును. రుద్ర విధానము ననుసరించి నీల గ్రీవుడైన మహేశ్వరుని ఆరాధించినచో విష వ్యాధి తొలగి పోవును.
అగ్ని మహా పురాణమున దష్ట చికిత్సన మను రెండు వందల తొంబది యైదవ అధ్యాయము సమాప్తము.
