అగ్ని మహా పురాణము

Table of Contents

47 - అథ శాలగ్రామాఽఽది పూజాకథనమ్

            హయగ్రీవుడు చెప్పెను : ఇపుడు చక్రాంకిత కాలగ్రామముల పూజావిధానమును చెప్పుచున్నాను. ఇది సిద్దిప్రద మైనది. శ్రీహరి పూజ కామ్య, అకామ్య, కామ్యాకామ్య అని మూడు విధములు. మత్స్యాది పంచ విగ్రహముల పూజ కామ్యముగాని, ఉథయాత్మికగాని కావచ్చును, వెనుక చెప్పిన చక్రములతో ప్రకాశించు వారాహ వామన - నృసింహుల హజను ముక్తి కొరకు చేయవలెను, ఇపుడు మూడు విధములైన శాలగ్రామ పూజను గూర్చి వినుము. వీటిలో నిష్ఫల పూజ ఉత్తమము: సవలపూజ కనిష్ఠము; మూర్తిపూజ మధ్యమము, చతురస్ర మండపము పైనున్న కమలమునందు పూజా విధి ఈ విధముగ ఉండును– హృదయమునందు ప్రణవన్యాసము చేయుచు షడంగన్యాసము చేయవలెను. పిమ్మట కరన్యాసము, వ్యాపకన్యాసము చేసి మూడు ముద్రలను చూపవలెను. పిమ్మట చక్రమునకు. బేట, తూర్పున గురువును పూజించవలేమ. పశ్చిమమున గణమును,  వాయవ్యమున ధాతను, నైరృతి యందు - విధాతను పూజింపవలెను. దక్షిణోత్తరములయందు వరుసగా కర్తను, హర్తను పూజింపవలెను. ఈశాన్యమున విష్వక్సేనుని, ఆగ్నేయమున క్షేత్రపాలుని పూజింపవలెను. పిమ్మట, పూర్వాది దిక్కులందు ఋగ్వేదాది - వేదచతుష్టయమును పూజించి, ఆధారశక్తిని, అనంతున్ని, పృథివిని, యోగపీఠమును, పద్మమును, సూర్యమండలమును, చంద్రమండలమును, బ్రహ్మాత్మక వహ్ని మండలమును పూజించి, ద్వాదశాక్షరిచే ఆసనముపై శిలాస్తాపనముచేసి పూజింపవలెను. పిదప - మూల మంత్రమును, విభజించియు, సంపూర్ణ మంత్రముచేతను క్రమపూర్వకముగా పూజింపవలెను. పిదప- ప్రణవముచే పూజించి మూడు - ముద్రలు చూపవలెను:- కష్వక్సేన - చక్ర - క్షేత్రపాలుల ముద్రలు చూపవలెను.

ఇంతవరకును చెప్పినది శాలగ్రామ మధ్యమ పూజ. ఇపుడు నిష్ఫలపూజ చెప్పబడుచున్నది. వెనకటి వలెనే షోడశదలకమలముతో కూడిన మండలము చేయవలెను. దాని పై శంఖ - చక్ర - గదా - ఖడ్గములను, గురువు మొదలగువారిని వెనుక చెప్పినట్లుగనే పూజింపవలెను. పూర్వోత్తర దిశలయందు. వరుసగా ధనుర్బాణములను పూజింపవలెను. ప్రణవముచే ఆసనము సమర్పించి, ద్వాదశాక్షరిచే శిలాన్యాసము చేయవలెను. ఇపుడు మూడవదైన కనిష్ఠ పూజను (సఫల పూజను) చెప్పుచున్నాను, వినుము. అష్టదల కమలముపై వెనుక టివలే గుర్వాదిపూజ చేయవలెను - పిదప అష్టాక్షర మంత్రముచే ఆసనము సమర్పించి, ఆ మంత్రముచేతను, శిలను స్థాపించవలెను.

ఆగ్ని మహాపురాణమునందు శాలగ్రామ పూజాకథనమను నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.