అగ్ని మహా పురాణము

Table of Contents

305 - పంచాశద్విష్ణునామాని

 అగ్ని రువాచః-

ఆగ్ని దేవుడు పలికెను. శ్రీ మహావిష్ణువు యొక్క యేబదిఐను నామములు ఎవడు జపించునో అతడు మంత్ర జపాది ఫలమును తీర్థ పూజనాదుల అక్షయ పుణ్యమును పొందును. పుష్కరము పుండరీకాక్షుని గయయందు గదా ధరుని, చిత్రకూటము నందు రాఘవుని. ప్రభాసమునందు దైత్య సూదనుని, జయంతియందు జముని, హస్తి నాపుర సన జయంతుని, వర్ధమానమున వారాహుని, కాశ్మీరమున చక్రపాణిని కబ్జామ్రమున జనార్దనుని మధుర యందు కేశవుని కుఱ్ఱమకమున హృషీ కేశుని గంగాద్వారమున జటాధరుని, శాలగ్రామమున మహాయోగుని గోవర్ధనాచలమున వారిని పిండారకమున చర్బాహువును శంఖోద్ధారము నందు శంఖిని, కురు క్షేత్రమున పామమని, యుమున యందు త్రివిక్ర ముని, శోణమున విశ్వేశ్వరుని పూర్వసాగర మన కపిలుని మహోదధి యందు విష్ణువును గంగా సాగర సంగమ మున వనమాలుని, కిష్కింధయందు రైవతకుని, కాశీ తటమున మహాయోగుని వీర జయందు రిపుంజయుని, విశాఖ యూపమున అజితుని నేపాలమున లోక భావనుని, ద్వారకలో కృష్ణుని మందరమున మధుసూదనుని, లోకాకుల మున రిపుహరుని, శాలగ్రామమున హరిని స్మరించవలెను. పురుషవటమున పురుషుని విమలమున జగత్ర్పడు పును సైధవారణ్యమున ఆనంతుని, దండక యందు శార్జధారిని ఉత్పలా వర్తకమున శౌరినీ నర్మద యదు శ్రీపతిని రైవతకమున దామోదరుని నంద యందు జలశాయిని, సింధు సముద్రమున గోపీశ్వరుని మహేంద్ర తీర్థమున అచ్యుతుని, సహ్యాద్రి పై దేవ దేవేశుని మాగధ వనమున వైకుంఠుని వింధ్యము పై సర్వపాప హరిని ఓడ్ర దేశమున పురుషోత్తపని హృదయమున ఆత్మను స్మరించవలెను. ఈ ఆత్మ జపించు వారికి భుక్తి ముక్తులను ఇచ్చును. ప్రతి వటము నందు వైశ్రవణుని, ప్రతి చత్వరము నందు శివుని, ప్రతి పర్వతము నందు రాముని సర్వత్ర మధుసూదనుని భూమ్యాకాశము లందు సరుని వశిష్ఠ తీర్థమున గరుడ ధ్వజుని సర్వత్ర వాసుదేవుని స్మరించువాడు భుక్తి ముక్తులను పొందును. ఈ విష్ణు నామమును జపించువాడు సర్వమును పొందును. ఈ క్షేత్రములలో చేసిన శ్రాద్దము, దానము, జపము. తర్పణము అంతయు కోటి గుణిత మచును. అట్లు చేసినవాడు మరణానంతరము బ్రహ్మ మయుడగును. ఇది చదివిన వాడును, విన్న వాడును పాపరహితుడై స్వర్గము పొందును.

ఆగ్ని మహా పురాణమున పంచ పంబా శద్విష్ణు నామ కథన మను మూడు వందల ఐదవ అధ్యాయము సమాప్తము.