అగ్ని మహా పురాణము

Table of Contents

164 - అథ నవగ్రహహోమ నిరూపణమ్.

పుష్కర ఉవాచః-

లక్ష్మిని కోరువారును, శాంతిరాముడగు, సృష్టి కయుర్దా పుష్టు నోరు పొడును లేదా ఆభిచారప్రక్రియ భించ నున్న వాగును గ్రహపూజ -రంభించవలెను. సూర్యు , చంద్రుడు, కుజుడు. బుధుడు, బృహస్ప, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని గ్రహములు. ఈ గ్రహముల మూర్తులను క్రమముగ రాగి, స్ఫటికము, రక్త చందనము, స్వర్ణము (బుధగురువులు), రజతము, ఇనుము, సీసము (రాహు కేతువులు)... వీటితో నిర్మించవలెను లేదా ఆయా గ్రహముల రంగులతో వ్రాసి గాని, గంధమండలముల పై గాని పూజించవలెను. వారి వారి రంగులననుసరించి వస్త్రములు, పుష్పములు, గంధము, బలులు ఇవ్వవలెను. గుగ్గులుధూప మీయవలెను. పతిగ్రహమునకుమ మంత్ర పశము లైన చదువులు ఇవ్వవలెను. ఈ గ్రహములకు వరుసగా “ఆకృ షేన......” “ ఇమం దే......” “అగ్ని ర్మూర్గా దేవః కకుత్...” “ఉదృడ స్వ...” “బృహస్పతే ఇతి యదర్యః...”, అన్నాతస్రుతః...”, “న్నోదేవీ...”, “కాణ్డాత్”, “కేతుం కృణ్వన్ని మాన్...” ఆను మంత్రములు వినియోగించవలెను. ఈ గ్రహములకు క్రమముగా ఆర్కము-పలాశ ఖదీర.అపామార్గ-పిప్పలఉదుంబర శమీ దూర్వా  కుకలు సమిధలు. ఒక్కొక్క గ్రహమునకు ఈ సమిధలు నూటఎనిమిది గానీ, సూటఇరువదిగాని, మధు.ఆజ్యదధులతో హోమము చేయవలెను. ఈ గ్రహముల నుద్దేశించి బ్రాహ్మణులకు భోజనమునంద వరుసగా బెల్లముతో వండిన ఆన్న ము, పాయసము, హవిష్యము, క్షీరయష్టికము, దధ్యోదనము, హవిస్సు, ఆపూపములు, మాంసము. చిత్రాన్న ము ఇవ్వవలేను. వారిని యథాశ క్తిగా, యథా లాభముగా సత్కరించవలెను. ఈ గ్రహముల నుద్దేశించి క్రమముగా ఈయ దగిన దక్షిణ ధేనువు, శంఖము, ఎద్దు, సువర్ణము, వస్త్రము, అశ్వము, కపిఃధేనువు, మేక. ఏగ్రహము ఎవనికి దుష్టస్థానాదుల నుండుట చే ఆపకారిగా నుండునో అతడు ఆ గ్రహమును పూజించవలెను. “మిమ్ములను ఎవరు పూజింతురో వారిని మీరు పూజించవలెను (రక్షించవలెను).” అని బ్రహ్మ ఈ గ్రహముకు వరములిచ్చేను. రాజుల ఉన్నతి పతనము కూడ గ్రహాధీన మైనది. జగత్తుయొక్క స్థితి లయములు గూడ వీటిపై ఆధార పడి యున్నవి. అందుచే గ్రహములు చాచి పూజింపదగినవి.

ఆగ్ని మహాపురాణమునంద నవగ్రహహోమా నిరూపణమను ఆరువది నాల్గవ ఆధ్యాయము సమాప్తం.