అగ్ని మహా పురాణము
253 - అథ వ్యవహార నిరూపణమ్
ఆగ్ని రువాచః
అగ్ని దేవుడు చెప్పెను : వసిష్ఠా! ఇపుడు నయ - అనయముల వివేకమును తెలుపు వ్యవహారమును వర్ణించెదను. దీనికి నాలుగు చరణములు, నాలుగు స్థానములు, నాలుగు సాధనములు చెప్పబడినవి. ఇది నలుగురికి హితము చేకూర్చును. నలుగురికి సంబంధించి యుండును. నాలుగు చేయును. దీనికి ఎనిమిది అంగములు. పదునెనిమిది పదములు, నూరుశాఖలు మూడు యోనులు, రెండు అభియోగములు, రెండు ద్వారములు, రెండు గతులు ఉండును. ధర్మము, వ్యవహారము, చరిత్రము, రాజశాసనము అనునవి వ్యవహారదర్శనము యొక్క నాలుగు చరణములు. వీటిలో ఉత్తరోత్తరచరణములు పూర్వపూర్వ సాధకములు. వీటిలో ధర్మమునకు ఆధారము సత్యము. వ్యవహారమునకు ఆధారము సాక్ష్యము. చరిత్ర పురుష సంగ్రహాధీనము. శాసనము రాజాజ్ఞాధీనము. ఇది సామ - దాన - భేద - దండములచే సాధ్యము గాన చతుః సాధ నము, ఇది ఆభియో క్ర, సాక్షి, సభాసదులు, రాజు అనువారి పై ఒక్కొక్క పాదమున నిలచియుండును. అందుచే ఇది చతుర్య్వాపి. ఇది ధర్మ - అర్థ - యశో - లోక ప్రియతలను నాల్గింటిని పెంచును గాన చతుష్కారి. రాజపురుష - సభా సద - శాస్త్ర - గణక - లేబక - సువర్ణ - అగ్ని - జలములను ఎనిమిది అంగములు కలదగుటచే అష్టాంగము. మానవుడు కామ - క్రోధ - లోభములచే దీనియందు ప్రవృత్తుడగును. అందుచే ఇది త్రియోని, శంకాభియోగ ము, తత్త్వాని యోగము అని ఆభియోగములు రెండు విధములు. అందుచే ఇది ద్వ్యభియోగము. అసత్పురుష సంబంధముచే శంకాభి యోగము, తగిన ప్రమాణములను చూచుటచే తత్త్వాభియోగము ఏర్పడును. దీనికి పూర్వవాద పక్షము (అభియోగము చేసినవాడు). ఉత్తర వాదప్రతిపక్షము, (ఎవనిపై అభియోగము చేయబడినదో వాడు) అను రెండు పక్షములుండును గాన ఇది “ద్విద్వారము”. నిజంగా జరిగినది, కపటము అను రెండు పద్ధతులుండుగాన ద్విగతి.
ఎట్టి ఋణమీయ వచ్చును. ఎట్టిది ఈయరాదు. ఎప్పుడు ఇవ్వవచ్చును. ఎప్పుడు ఇవ్వరాదు ఎట్లు ఇవ్వ వలెను. ఋణమునిచ్చు విధాన మేది. దానిని మరల రాబట్టుకొనుట ఎట్లు - ఈ విషయములనన్నింటిని విచారించుట 'ఋణాదానము'. ఒక వ్యక్తి విశ్వాసముతో మరొక వ్యక్తి వద్ద ధనమును దాచి ఉంచినచో ఆది నిషేపము”. వర్తకులు మొద లగు వారు చాలమంది కలిసి పరస్పర సహకారముతో ఏ దైన ఒక కార్యము చేసినచో ఆది “సంభూయ సముత్థానము" అను వివాదపదము. ఒక వ్యక్తి ఏదైన ఒక వస్తువును యథావిధిగ ఇతరునికి దానము చేసికూడ దీనిని తనకే ఉంచుకొనవలెనని కోరినచో అది “దత్తా ప్రదానిక” వివాదపదము. సేవ చేసెదనని చెప్పి సేవ చేయకున్నచో ఆది "అభ్యు పేత్య-ఆశుశ్రూష" అను వివాదపదము. భృత్యులకు వేతనము సరిగా చెల్లించకపోవుటచే ఏర్పడినది “వేతనా నపాకర్మ వివాదపము". తాకట్టు పెట్టిన లేదా నష్టమైన పర ద్రవ్యమును, అపహరించిన దానిని, దాని స్వామికి తెలియకుండ అమ్మి వేసినచో ఆది 'ఆస్వామి విక్రయము' అను వివాదపదము. వర్తకుడు ఒక వస్తువును అమ్మిన తరువాత కూడ దానిని కొన్న వానికి ఇవ్వ కున్న చో ఆది “విక్రీయాసంప్రదానము" అను వివాదపదము. ఒకవస్తువును కొన్న వాడు అది బాగులేదని ఆన్నచో ఆది “క్రీతా నుశయము" అను వివాదపదము. గ్రాహకుడు ఒక వస్తువును మూల్యము చెల్లించి కొన్న పిమ్మట ఆ కొనుగోలు సరిగాలేదని తలచి, దానిని ఆదినమునందే వర్తకునకు తిరిగి ఇచ్చివేసి కచో, విక్రేత దాని మూల్యమునంతను ఏమాత్రము తగ్గించకుండకేతకు తిరిగిఇచ్చి వేయవలెను
పాషండులు, నైగములు మొదలగు వారిస్థితికి సమయమని పేరు. దీనికి సంబంధించినది. “సమయాన పాక కర్మ వివాదపదము". పొలముల పై అధికారమును పురస్కరించుకొని వంతెనలు, మళ్ళు, సరిహద్దులు . వీటిని గూర్చిన వివాదము “క్షేత్రజము". స్త్రీ-పురుషుల వివాహాదులకు సంబంధించినది "స్త్రీ పుంసయోగ వివాదపదము". తండ్రి ఆ స్తిని పంచుకొను పుత్రులలో ఏర్పడినది “దాయభాగ వివాదపదము". బలగర్వముచే అనాలోచితముగ చేసిన ఆది "సాహస వివాదపడము". ఒక వ్యక్తిని ఆతని దేశము, జాతి, కులము మొదలగు వాటిని పురస్కరించుకొని దోషారోపణము చేయుచు విపరీతార్థములుగల వ్యంగ్యోక్తులు పలుకుట వాక్పారుష్య వివాదపదము", హస్తపాదములచేగాని, ఆయుధముచేగాని, అగ్ని చేతగాని ఎవరికైన శరీరముపై అఘాతము కలిగించుట "దండ పారుష్యము”. పాచికలు, తోలు ముక్కలు, ఏనుగు దంతములతో చేసిన శలాకలు వీటిని ఉపయోగించి చేయు క్రీడకు ద్యూతమని పేరు. పశుపక్ష్యాదుల నుపయోగించి చేయు క్రీడ “ప్రాణి ద్యూతము”. రాజు ఆజ్ఞను ఉల్లంఘించి ఆతడు చెప్పిన పని చేయకుండుట “ప్రకీర్ణక” మను వ్యవహారపదము. ఈ వివాదపదము రాజుకు సంబంధించినది. ఈ విధముగ వ్యవహారమునందు పదునెనిమిది పదము లున్నవి. వీటికి మరల నూరుభేదము లున్నవి. మనుష్యుల పనులను బట్టి ఈ నూరుభేదమూ లేర్పడును.
రాజు క్రోధరహితుడై జ్ఞానసంపన్నులగు బ్రాహ్మణునితో కలిసి వ్యవహారవిచారము చేయవలెను. వేదవేత్తలు, శత్రుమిత్రులను సమానదృష్టితో చూడగలిగినవారును, లోభర హితులును ఆగువారిని సభాసదులనుగ నియమించవలెను. తాను స్వయముగ వ్యవహారము చూడ వీలులేనప్పుడు రాజు సభాసదులతోపాటు విద్వాంసుడగు ఒక బ్రాహ్మణుని ఆకార్యమున నియమించవలేను. సభాసదులు రాగలోథయాదులచే ధర్మశాస్త్ర–ఆచారాది విరుద్ధములగు నిర్ణయములు చేసినచో రాజు వారి పై వేరు వేరు వివాదముకంటె రెట్టింపు ఆర్థదం: ముచే వారిని శిక్షించవలెను. ఎవ్వడై న ఒక వ్యక్తి మరొక వ్యక్తిచే ధర్మశాస్త్ర - సమాచారములకు విరుద్ధముగ బాధింపబడినచో, ఆడు రాజువద్దకు వెళ్ళి ఆ విషయమును తెలిపిన అది ‘వ్యవహార పద' మని చెప్పబడును. వాది చెప్పినదానినంతను రాజు సంవత్సరము, మాసము, పక్షము, దినము, పేరు, జాతి మొదలగు వాటితోసహ ప్రతివాది ఎదుట ప్రాయించవలెను. (వాది చేసిన నివేదనమునకు ‘భాష' ప్రతిజ్ఞ' లేదా 'పక్షము' అని పేరు). ప్రతివాది వాది చెప్పినదంతయువిని దానికి ప్రత్యుత్తరము వాని ఎదుటనే వ్రాయించవలెను. వాది ఆ సమయమునందే తాను చేసిన నివేదనమునకు ప్రమాణము వ్రాయించవలేను. నివేదనము ప్రమాణితమైనచో వాది జయించును, కానిచో పరాజితుడగును. ఈ విధముగ వివాదమునందు నాలుగు పాదములు (ఆంశములుగల) వ్యవహారము చూపబడినది. ఆభియుక్తుని పై వచ్చి జరుగుచున్న అభియోగమునకు నిర్ణయము కానంత వరకును ఆతని పై వచ్చిన మరియొక ఆపరాధమును గూర్చి విచారణ చేయగూడదు. ఇతరునిచే ఆభి ముక్తుడగు వాని పై విరుద్ధముగ ఏమియు చెప్పరాదు. కాని హింసాద్య పరాధాభియోగ మైనచో దానిని, ముందు నడచుచున్న అభియోగమునకు నిర్ణయము కాకపూర్వమే నడిపించవచ్చును.
సభాసదసమేతుడైన సభాపతి (ప్రాడ్వివాకుడు) వాది ప్రతి వాదుల వివాదమును నిర్ణయించుటక సమర్థులగు వారిని ‘ప్రతిభూ' (జామీను) గా ఏర్పరుపవలెను. అర్థి (వాది) చేసిన ఆభి యోగమును ప్రతివాది తిరస్కరించగా, ఆర్థి సాక్ష్యాదులు చూపి తన అభియోగమును ప్రతివాదిచే ఆంగీకరింపచేయగలిగినచో, ప్రతివారి ఆర్థికి ఇవ్వవలసిన ధనమంతయుచెల్లించి, అంతే ధనమున, దండముగా రోజుకు చెల్లించవలేను. ఆర్థి తన అభియోగమను నిరూపించుకొనజాలక మిథ్యాభియోగి యైనచో అతడు అభియుక్త ధనమునకు రెట్టింపు ధనము రాజుకు అర్పించవలెను. హత్య దోపిడి, వాక్పారుష్యము, దండపారుష్యము, పాలు ఇచ్చు ఆవులను అపహరించుట, ఆభిశాపము (మహాపాతకము చేసినట్లు అభియోగము), ఆత్యయము (ప్రాణఘాతము), ధనాతిపాతము, శ్రీ చరిత్ర మొదలగు వాటికి సంబంధించిన అభియోగము వచ్చినప్పుడు అపరాధి నుండి వెంటనే ఉత్తరము (సముజాయిషీ) తీసుకొనవలెను. ఆలస్యము చేయరాదు. ఇతర వివాదములలో వాది ప్రతివాదులు, సభాసదులు, ప్రాడ్వివాకుడు మొదలగువారి ఇచ్చననుసరించి సమయము తీసికొనవచ్చును. అభియోగ సమయమున ఆభియోగము చేయువాడుగాని, సాక్ష్యమిచ్చువాడు గాని ఒకచోటునుండి మరి యొక చోటునకు తిరుగుచుండినను, స్థిరముగా ఉండజాలకున్నమ, రెండుచలివేలు నాకుచున్నను, ఆతని నుదుట చెమటపట్టినను, ముఖము వెలవెలబోయినను, కంఠము ఎండిపోయి మాటతడబడివను. పూర్వాపర విరుద్దముగ మాటలాడినను, ఇతరులకు సరిగా ప్రత్యుత్తర మీయజాలకున్నను, ఇతరుల చూపులో చూపు కలుపజాలక పోయినను, పెదవులు వంకరటింకర చేయుచున్నను, ఈ విధముగ సహజముగనే మనో-వాక్-శరీర క్రియలందు వికారము పొందినచో ఆతడు దుష్టుడని చెప్పబడినది. అప్పుతీసికొన్న వాడు నిరాకరించిన సందేహాస్పదమైన ఋణమును గూర్చి ఏదో విధముగ నిజమని నిరూపించుటకు ప్రయత్నించువాడును, రాజు పిలిపించినపుడు అతని యెదుట ఏమియు చెప్పజాలని వాడును దుష్టుడే. అతడు కూడ దండనీయుడు. ఇద్దరు వాదుల పక్షములందు సాక్ష్యము చెప్పువారు అభ్యులై నపుడు పూర్వ వాది సాక్షులనే ప్రశ్నింపవలేను. వాటికి జవాబుగ "నేనీ క్షేత్రమును చాలకాలము క్రితమే దానరూపమున పొందితిని అప్పటినుండియు నేను దీనిని అనుభవించుచున్నాను” అని చెప్పువాడు ఇచట. పూర్వవాది; ముందుగా ఆభియోగము చేసిన వాడు కాదు. అప్పుడు రెండవవాడు “నిజమే, ఇది ఈతనికి దానమువలన లభించినది, కాని ఇతని నుండి అముక వ్యక్తి (ఫలానావ్యక్తి.) దీనివి కొని నాకిచ్చినాడు" అని చెప్పినచో అపుడు పూర్వపక్షము అసాధ్యము గాన దుర్బలమైపోవును. అపుడు ఉత్త రవాది సాక్షులను మాత్రమే ప్రశ్నించవలెను. వివాదము ఏదైన ఒక పందెము పై (షరతు) చేయబడినపుడు అట్లు పందెము వేసినవాడు ఓడిపోయినచో ఆతడు వేసిన పందెము సౌమ్మా రాజుకు ఇచ్చివేయవలెను. అర్థి ధనవంతుడైనపుడు వివాదాస్పదమగు ధనము మాత్రమే ఆతనికి ఇప్పించవలెను. రాజు కపటము విడనాడి, సత్యము నాశ్రయించి వ్యవహార నిర్ణయము చేయవలెను య థార్ధ వస్తువై నను లిఖితపూర్వకముగ లేనిచో వ్యవహార మన పరాజయమే కలుగుమ అర్థిసువర్ణ - రజత - వస్తాదివస్తువులను అభియోగ పత్రమున వ్రాయగా ప్రత్యర్థి వాటినన్నింటిని అంగీకరించినచో, అట్టి పరిస్థితులలో సాక్ష్యాధారము పై ప్రత్యర్థి ఆ వస్తువులలో ఏ ఒక్క వస్తువును ఒప్పుకొన్న ను, రాజు ఆభియోగపత్రమునందు వ్రాసినవాటినన్నింటిని ఆర్థికి ప్రత్యర్థి చే ఇప్పించవలెను. మొదట అభియోగపత్రమునందు ప్రోయబడనీదానిని ఆ వస్తుచెల మ్సూచియందు చేర్చుట జరిగినచో ఆ వస్తువును ఇప్పించవలసిన పనిలేదు. రెండు స్మృతి వాక్యములలోగాని, ధర్మశాస్త్ర రచనములలోగాని, పరస్పర విరోధము కనబడినచో సామాన్యాపవాద న్యాయము ననుసరించి సామాన్యశాస్త్రము కంటే విశేషశాస్త్రము బలీయమని నిర్ణయించ వగైన. ఆర్థశాస్త్ర ధర్మములందు పరస్పర విరోధమేర్పడినపుడు అర్థశాస్త్రముకంటే ధర్మశాస్త్రము బలీయమని మునులు చెప్పిన మర్యాద (కట్టుబాటు).
లిఖితపరు, భుక్తి, సాక్షి అనునవి మూడు మానుష ప్రమాణములు. ‘భుక్తి’ అనగా అనుభవించుట. ఈ మూడింటిలో ఏ ఒక్కటియు లభించనపుడు చెప్పబోవు దివ్యప్రమాణములలో ఏదైన ఒక దాని గ్రహించవలెను. ఋణము మొదలయిక సమస్త వివాడ ములందును ఉత్తర క్రియబలవత్తరము. ఉత్త రక్రియ సిద్ధీకృతమైనపుడు విజయము ఉత్తర వాది కే. పూర్వవాది తన పక్షమును సిద్దము చేసినను ఆతడు ఓడిపోవును కాని ఆధి (తాకట్టు) ప్రతిగ్రహ - క్రీతములందు పూర్వక్రియ బలీయము. భూస్వామి చూచుచుండగనే ఒక వ్యక్తి ఆ భూమిని అనుభవించుచుండగా ఆతడేమియు అనకున్నచో ఇరువది సంవత్సర ముని తరువాత ఆ భూమి అనుభవించువానికి చెందును. ఆది ధనమైనచో పది సంవత్సరములయిన తరు వాత అనుభవించువానికి చెందును. కాని తాకట్టు, సరిహద్దు, నిక్షేపము, జడులధనము, బాలకులఢశము, ఉపనిధీ, రాజస్త్రీ - శ్రోత్రియుల ధనము - వీటి విషయమున పై నియమము వర్తించదు. పైన చెప్పినవారి సొత్తును చాలకాలము అనుభవించినంతమాత్రమున అపహరింపజూచు వానిచే ఆ ధనమును స్వామికి ఇప్పించి, అంత ధనమును దండించి రాజు తీసికొనవలెను. లేదా ఆ విధముగ అపహరించినవాని శక్తి నిబట్టి, అధికముగాని, అల్పముగాని ధనమును దండరూపమున తీసికొనవలెను సత్వమునకు హేతువగు ప్రతిగ్రహ-క్రయాదులకు ఆగమమని పేరు. ఆగమము భోగముకంటే ప్రబలము. సత్వమును స్థాపించుటకు ఆగ మసాపేక్షమైన భోగమే ప్రమాణము. కాని పితృ పితామహాది క్రమమున అనుభవింపబడు చున్నది తప్ప ఇతర భోగమువందే ఆగమనమునకు ప్రాబల్యము. పూర్వపరంపరా ప్రాప్తమగు భోగము ఆగమముకంటెను ప్రబలమైనది. ఏమాత్రము ఉపభోగము లేని ఆగమమునకు బలము లేదు,
విశుద్దమైన ఆగమమును బట్టి భోగమునకు ప్రామాణ్యము వచ్చును.. ఆగమము సరియైనది కానపుడు భోగము ప్రమాణము కాదు. భూమ్యాద్యాగమము కలవాడు, “నీకిది ఎట్లు వచ్చినది ?" ఆని ఎవరైన అడిగినపుడు లిఖితాది ప్రమాణములచే ఆగమమును నిరూపించుకొనవలెను. వానిపుత్రపౌత్రాదులు ఆగమమును నిరూపించుకొవవలసిన పనిలేదు. పరంపరాగత భోగమే అచట ప్రమాణముగ గ్రహింపబడును. వ్యవహార నిర్ణయనునకు పూర్వమే ఒకడు మరణించినచో ఆతని ధనమునకు ఉత్తరాధికారులైన పుత్రాదులు లిఖితాది ప్రమాణముల ద్వారా ఆగమనమును నిరూపించుకొనవలెను. ఎందు చేతననగా ఆ వ్యవహారమునందు ఆగమము లేకుండ కేవలము భోగము ప్రమాణము కాజాలదు. బలాత్కార - భయాదులచే జరిపిన వ్యవహారమును త్రిప్పి వేయవలెను. కేవలము స్త్రీయే చేసిన అభియోగమును, రాత్రియందు చేసినదానిని, ఇంటిలోపల జరిగిన సంఘటనకు సంబంధించినదానిని, గ్రామాదుల వెలుపల నిర్జన ప్రదేశమునకు సంబంధించినదానిని, శత్రువు చేసిన దాడివి న్యాయాలయమునందు విచారణారపు గ్రహింపరాదు, త్రిప్పివేయవలెను. మాదక ద్రవ్య సేవనముచే వత్తులో నున్న వాడును, వాత-పిత్త-కఫ సన్ని పాత గ్రహావేశాలచే ఉన్మత్తుడును, రోగపీడితుడును, ఇష్టవియోగ అనిష్టప్రాప్తులచే దుఃఖితుడును, అప్రాప్తవయస్కుడును, శత్రువులు మొతలగువారి నుండి భయపడినవాడును నడిపిన వ్యవహారము "ఆసిద్ధము" అని చెప్పబడినతి. ఆభియు వస్తువుతో సంబంధము లేనివారు నడిపినది కూడ ఆసిద్ధము.
ధనవంతుని ధనము ఎంత పోయినదో అది రాజు ఆతని కీయవలెను. పోయిన ధనమును దాని స్వామి గుర్తింప జాలక పోయినచో, ఎంతధనము పోయినదని రాజకు చెప్పెనో ఆంతధనమును రాజువకు దండముగా ఇవ్వవలెను. చోరులు అపహరించిన ధనమును రాజు ఏ జనపదమునుండి అపహరించబడినదో ఆ జనపదమునకే ఇచ్చివేయవలెను. ఏదైన ఒక వస్తువును తాకట్టు పెట్టి తీసికొనిన ఋణముపై ఎనుబదవభాగము (1/80) ప్రతి మాసము ఇవ్వవలెను. బంధకము (తాకట్టు) లేనిచో బ్రాహ్మణాది వర్ణక్రమమున ప్రతిశ తము కొంచెము కొంచెము అధికమగు వడ్డీ తీసికొనవచ్చును. ఆడ పశువులను ఋణముగా తీసికొనినపుడు వాటి పిల్లలు వడ్డీగా గ్రహించవలేను. నూనె, నెయ్యి మొదలగు రసద్రవ్యములు ఋణముగా తీసికొన్నప్పుడు, అది పెరిగి పెరిగి ఎనిమిది రెట్లు కావచ్చును. అంతకు మించి వృద్ధి ఉండకూడదు. వస్త్ర-ధాన్య.సువర్లముల విషయమున వృద్దిక్రమముగా నాలుగు, మూడు, రెండు రెట్లవరకు ఉండవచ్చును; అంత కంటె అధికము కాదు.
వ్యాపారము కొరకై దుర్గమ వనప్రదేశములుదాటి ప్రయాణము చేయువారు ఋణదాతకు నూటికి పది చొప్పునను, సముద్రయానము చేయువారు నూటికి ఇరువర్చొప్పునను వృద్ధి ఇవ్వవలెను. లేదా అన్ని జాతులవారును, ఏజాతివారినుండి తీసుకున్న ఋణమైనను, అది సబంధకి మైనను (తాకట్టు ఉన్నది) ఆబంధక మైనను, ఋణదాతకును తమకును మధ్య జరిగిన ఒప్పందమును బట్టి వడ్డీ ఇవ్వవలెను, ఋణము తీసికొన్నవాడు ఏధన ముమతీసికొనెనో, అది సాక్షి ప్రమాణితమైనపుడు, దానిని ఋణదాత వసూలు చేసుకోవచున్నపుడు రోజు ఆడ్డు పెట్టగూడదు. ఋణదాత న్యాయసంగతముగ ఋణమువసూలు చేసికొనుచున్నను వానిపై అభియోగము చేయువానిని రాజు దండించవలెను. వానిచే ఆధనమిప్పించవలెను.
ఆగ్ని మహాపురాణమునందు వ్యవహార కథనమను రెండువందల ఏబది మూడవ అధ్యాయము సమాప్తము.
