అగ్ని మహా పురాణము

Table of Contents

369 - అథాత్యన్తిక ప్రళయగర్భోత్పత్తి నిరూపణమ్

అగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. ఆత్యంతిక ప్రళయమును గూర్చి చెప్పెదను. ఇది జ్ఞానము వలన కలుగును, ఆధ్యా త్మికాది సంతాపమును తెసుకొని మానవుడు తన విషయముననే కొంత వైరాగ్యమును పొందవలయును. అపుడు జ్ఞానము కలుగును. ఆధ్యాత్మిక సంతాపము “శారీరము” మానసము అని. రెండు విధములు, శారీరక సంతాపము అనేక విధము లై నది. వాటిని గూర్చి వినము. జీవుడు భోగ దేహమును త్యజించి కర్మానుసారముగ గర్భమున చేరును. ఆతిదాహిక మను ఒక దేహ ముండును. మనుష్యులకు మృత్యు కాలము వచ్చినపుడే ఆ దేహము లభించును. యమదూతలు ఆ శరీ రమున యమలోక మార్గము యమ లోకమునకు తీసుకొని పోవుదురు. ఇతర ప్రాణులట ఈ ఆతిపాక శరీరము వుండదు, యమ లోకమునకు వెళ్ళిన జీవుడు కొంత కాలము స్వర్గము, కొంత కాలము నరకము కందుచు మట యంత్రము వలే తిరుగుచుండును. ఇది కర్మ భూమి. పరలోకము ఫల భూమి. యముడు ఆయ జీవుల కర్మానుసారముగా వివిధ యోనులను వరకములను వారికి ఇచ్చును. ఆతడే నరకములను నింపుచుండును. యముడే వీరికి నియామకుడు. జీవుడు వాయు రూపమున గర్భములో ప్రవేశించుచుండును. యమ దూతలచే తీసుకొని వెళ్ళబడిన జీవుని యముడు చూచును. ఆ జీవుడు ధర్మాత్ముడే నచో యముడు ఆతనిని పూజించును. పాపాత్ములైనచో తన లోకమున ఆతనిని దండించును. వాని శుభా శుభ కర్మలను గూర్చి చితగు పుడు వివరించి చెప్పును. బంధువులకు ఆశాచము తీరు వరకును జీవుడు ఆతీవాహిక శరీరములోనే వుండి వారిచ్చిన పిండములను భుజించును. పిదప పేత లోకము చేరి ప్రేత దేహమును విడచి మరియొక భోగ దేహమును పొంది ఆకలి దప్పికలతో బాధపడుచు ఆచట నివసించును. శ్రాద్ధ రూపమున ఇవ్వబడు ఆపద్రవ్య మును ఆతడు భుజించును. ప్రేమకు పిండ దానము లేకుండగ చేయనిచో వానికి ఆతివాహిక దేహము నుండి విడుదల వుండదు. సపిండీకరణ శ్రాద్దము wరిగిన సంవత్సరమునకు తరువాత వాడు పేత దేహము విడచి భోగ దేహమును పొందను శుభ దేహము, అశుభ దేహము ఆని ఆది రెండు విధములు. ఆ దేహముతో కర్మ బంధములను అనుభవించిన పిమ్మట, పర్వ లోకమునకు గెంటి వేయబడున. అపుడు ఆతను విడిచిన దేహమున నిశాచరులు భక్షింతురు. మొదట పుణ్య ఫల మగు స్వర్గమును అనుభవించినచో పాప భోగము మిగిలి యున్నచో మరొక భోగ శరీరమును ధరించును. కాని పాప ఫలమును ఆమఠవించినవాడు పిదప స్వర్గ సుఖమును అనుభవించి దాని పిమ్మట స్వర్గ భ్రష్టుడై పవిత్రులగు శ్రీమంతుల గృహము లందు జనించును. పుణ్యము వుండగా ముందు పాప ఫలము అనుభవించిన వాడు ఫల భోగము పూర్తియైన పిమ్మట ఉత్తమ దేహమును ధరించును. కర్మ భోగము కొంచెము మాత్రమే మిగిలి యుండగా జీవునకు నరకము నుండి విముక్తి లభించుమ. వరక విముక్తుడు తిర్యగ్యోనిలో పట్టును. సందేహము లేదు.

గర్బములో ప్రవేశించిన జీవుడు కలలము నడుండును. రెండవ మాసమున గట్టి పడును. మూడవ మాస మున అవయవములు ప్రకట మగును. నాల్గవ మాసమున ఆస్థి మాంస త్వక్ లు ఏర్పడును. ఐదవ మాసమున రోమములు పుట్టును. ఆరవ మాసమున చై తనము ఏర్పడును. ఏడవ మాసము నుండి దుఃఖము ననుభ వింప ప్రారంభించును. మావితో చుట్టబడిన దేహము నందు శిరస్సుపై దోసిలి కట్టి యుండును. గర్భ మధ్యమున నున్నచో నపుంసకుడు, వామ భాగములో వున్నచో స్త్రీ, కుడి ప్రక్క వున్న చో పురుషుడు, ఉదరము నందుండి పృష్ఠ భాగమునకు అభిముఖుడుగా వుండును. తాను ఏ యోని యందున్నాడో వానికి తెలియును. సందేహము లేదు. నవ జన్మ మొదలు సకల వృత్తాం తమును స్మరించును. ఆ అంధకారమున మానవుడు గొప్ప పీడను పొందును. ఏడవ మాసమున తల్లి భుజించిన ఆహార మును ఆ శిశువు పొందును. అష్టమ, నవమ మాసము లందు మిక్కిలి ఉద్విగ్నుడగును. మైథువ మ్మునందు ఇంకను పీడను పొందను. తల్లి ఆధిక వ్యాయామము చేసినను శిశువునకు పీడ కలుగును. ఆమెకు వ్యాధి యున్నచో శిశువు కూడ ఆరోగము యొక్క కష్టమను అనుభవించును. ఒక ముహూర్తము నూరు సంవత్సరముల వలె కనబడును.

కర్మలతో బాధపడుచు ఎన్నియో మనోరథములు కలిగి యుండును. గర్భము నుంచి బయట పడగ నే మోక్ష జ్ఞానమునకు ప్రయత్నము చేయునట్లు వుండుమ. ప్రసూతి వాయు ప్రేరణచే ఆధోముఖుడై యోని యంత్ర పీడితుడై బయట పడును. ఒక మాసము వరకు చేతితో ముట్టుకొనినను వానికి పీడ కలుగును. ఆకాశము వలన వాని శరీరమణ చిన్న చిన్న రంధ్రములు, చెవి మొదలగునవి ఏర్పడును. వాయువు వలన శ్వాసోచ్చ్వాసములు గతి, ఆవయవములను ఇటు అటు తిప్పుతూ స్పృశించుట ఏర్పడును. అగ్ని వలన రూపము నేత్రములు వేడి జీర్ణ శక్తి పిత్తము, మేధ, వర్ణపటం, బలము ఛాయ తేజస్సు శౌర్యము,  ఇవి శరీరము వందేర్పడును. జలము వలవ, చెమట, ఆస్వాదము, వస, రస, గ్రహణ శక్తి రక్తము, శక్రమూత్ర కఫాదికము ఏర్పడును. భూమి వలన ఫ్రతి కేళ, నఖములు బరువు ఏర్పడును. శరీరము నందలి త్వడ్మాస హృదయ, నాభి, మజ్జా, మల మేదన్, క్లేదనములు ఆమాశయములు తల్లి వలన పుట్టినవి. రన్స్నా రు శుక్ర ములు తండ్రి వల్ల పుట్టును. కామ క్రోధ భయ హర్ష, ధర్మ, ఆకృతి, స్వర, వర్ణ మేహన ఆదులు జీవుని శరీరమవ స్వతః ప్రకటన మగువ. అజ్ఞాన, ప్రమాద, ఆలస్య, ముధా, తృషా, మోహ, మాత్సర్య, వై గుణ, శోక, ఆభాస భయా దులు తమ గణము వలన బుట్టును. కామ, క్రోధ, శౌర్య యజ్ఞాభిలాష బహుభాషిత ఆహంకార అవాదరములు రజో గుణము వలన పుట్టును. ధర్మాభిలాష, మోక్షకామిత్వము విష్ణువు పై ఉత్తమ భక్తి, దాక్షిణ్యము, ఉద్యోగ శీలత్వము. ఇవి సత్వ గుణము వలన పుట్టును.

చపలుడు క్రోధి భీరువు బహుభాషి కలహప్రియుడు స్వప్నమునందు ఆకాశములో సంచరించువాడు అగు మనుష్యు నిలో వాతము ప్రధానముగా నుండును. ఆకాలమున జుట్టు నెరసినవాడు కోపశీలుడు. మహాబుద్ధిమంతుడు యుద్ధ ప్రియుడు స్వప్నమునందు ప్రకాశించుచున్న వస్తువులను చూచువాడు అగు మనుష్యుని యందు పిత్తము అధికముగా నుండును. స్థిరమైన మైతి కలవాడు స్థిరోత్సాహుడు స్థిరాంగుడు ధనవంతుడు స్వప్నమున శ్వేత వస్త్రమును చూచువాడు అగు మనుష్యునిలో కఫము అధికముగా నుండును. ప్రాణుల దేహమున రసము జీవనమును, రక్తము లేపనమును, మాంసము, మోహన స్నేహ నములను కలగించును. ఆస్థులు - మజ్జి శరీరమును నిలుపును. వీర్యవృద్ధి శరీరమును పూర్ణము చేయును. ఓజస్సు శుక్ర వీర్య వృద్ధికరము. జీవుని స్థితికి ప్రాణమునకు ఆవష్టంభకము. ఓజము శుక్రము కంటే ఎక్కువ సారము కలది. ఆది హృదయ సమీపమునందుండును. కొంచెము పసుపు పచ్చగ వుండును. కాళ్ళు బాహువులు. శిరస్సు, ఉదరము. ఇవి షడంగములు. చర్మలో ఆరు పొరలుండును. బయటకు కనబడునది బాహ్యము. రక్తము ధరించునది రెండవది. మూడవది కిలాసమును, నాల్గవది కుండమును ధరించుము. ఐదవది ఇంద్రియముల స్థానము. ఆరవది ప్రాణధారణము చేయునది. కల కూడ ఏడు విధములు. మొదటిది మాంసములు ధరించుమ. రెండవది రక్తమును, మూడవది యకృత్ ప్లీ హలను, పాల్గవది మేధస్సును అస్థులను, ఐదవది మజ్జి శ్లేష్మ పురీషములను, ఆరవది పిత్తమును, ఏడవది శుక్రముమ ధరించును. ఐదవది పక్వాళయమునందున, ఏడవది శుక్రాశయమము నందును వుండును.

అగ్ని మహా పురాణమున ఆత్యంతిక ప్రళయ గర్భోత్పత్తి వర్ణనమను మూడు వందల అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.