అగ్ని మహా పురాణము
144 - అథ కుబ్జికాపూజా
ఈశ్వర ఉవాచః-
పరమేశ్వరుడు చెప్పేను : ఇపుడ, ధర్మార్థకామవిజయాదులను ప్రసాదించు కుల్దీకాదేవీ మంత్రము చెప్పెదము. మూలమంత్రముతో వరిజరసహితురా లగు ఈ దేవి పూజ చేయవలెను. “ఓం ఐం హ్రీం శ్రీం...... కిలికిలి” అనునది (మూలోకము) కుల్దీకామంత్రము - ఆంగన్యాసకరన్యాసములు చేసి సంధ్యావందనము చేయవలెను. వామా - జ్యేషా రౌద్రులు ముగ్గురు సంధ్యలు. “కాలవాగీశీ విద్మహే మహాకాలీతి ధీమహి తన్న కౌలీ ప్రచోదయాత్ అనునది కౌలీగాయత్రి. దీనిలో ఐదు మంత్రము లున్నవి. ప్రారంభమున ప్రణవము అంతమున నమః ప్రయోగించవలేను. మధ్య ఐదుగురు నాథుల పేర్లు, అంతమున “శ్రీ పాదుకాం పూజయామి” అని చేర్చవలేను. మధ్యయందు చతుర్థ్యంత మగు దేవతానామము చేర్చవలేను. ఈ విధముగ ఐదు మంత్రములలో ఒక్కొక్కటి దాదాపు పదునెనిమిది అక్షరములు కలిగి ఉండును. ఈ పేరు లన్నింటిని షష్ఠీ విభక్తిలో ప్రయోగించవలెను. ఈ విధముగ వాక్యయోజన చేసి ఈ మంత్రముల స్వరూపమును - తెలిసికొనవలెను. కౌలీశనాథ - శ్రీకంఠనాధ - కౌలనాథ - గగనానందనాథ - తూర్ణ నాధు లనువారు పంచనాధులు. వీరి పూజా మంత్ర వాక్యములు “ఓం కౌలీశనాధాయ నమస్తస్మై పాదుకాంపూజయామి” ఇత్యాది విధమున నుండవలెను. వీరితో పాటు, పుట్టుక నుండియు గూను ఉండుటచే కుట్టికా అను పేరు గల సుక లాదేవి, చటులాదేవి, వికరాలరూపము గల మైత్రశీదేవి అతలదేవి, శ్రీ చంద్రాదేవి అను ఐదుగురు దేవులను పూజించవలెను. వీరి పేర్లకు చివర దేవీ అని ఉండును. పూజామంత్రవాక్యములు”సుకలాదేవ్యై నమస్తస్యై భగాత్మ పుంగణ దేవమోహినీం పాదుకాం పూజయామి” ఇత్యాది విధమున ఉండును. చటులాదేవి పాదుకకు “ఆతీత భువనానన్దరత్నాథ్యాం” అను విశేషణము, మూడవ దేవిపాదుకకు “బ్రహ్మజ్ఞానాడ్యామ్” అను విశ్లేషణ మును, నాల్గవ దేవి పాదుకకు “కమలాడ్యామ్” అను విశేషణమును ఐదవ పాదుకకు “పరమ విద్యా డ్యామ్” అను విశేషణమును చేర్చవలేను. ఈ విధముగ విద్యా - దేవీ - గురువుల శుద్దికి త్రిశుద్ది” అని పేరు. గగనానంద - చటులి - ఆత్మానంద - పద్మానంద - మణి - కలా - కమల - మాణిక్యకంఠ - గగన - కుముద - శ్రీ పద్మభైరవానంద - కమలదేవ - శివ - భవకృష్ణులు అను పదునారుగురు నూతనసిద్ధులు, చండ్రపూర - గుల్మ - శుథకామ - అతిము క్షక వీరకంఠ - కుశల - దేవగక - విశ్వదేవ - ఇఢదేవ-రుద్ర-ధాతృ - ఆసి ముద్రిస్ఫోట - వంశపూర - భోజు లను పదునారుగురు సిద్దులు.
వీరి దేహము కూడ షడ్విధన్యా సనియంత్రితమై ఆత్మతో సమానమగును. మండలము పై పుష్పములు చల్లి మండలపూజ చేయవలెను. అనంత - మహత్ - శివపాదూ . శూన్య - పంచతత్త్వాత్మకమండల - శ్రీకంఠనాథపాదుకా. శంకర - అనంతుల పూజ చేయవలెను. సదాశివ - పింగల - భృగ్వానంద.నాథసముదాయ - లాంగూలానంద - సంవ ర్తులను మండలస్థానమున పూజించవలేను. నైరృతియందు శ్రీమహాకాల - పినాకి - మహేన్ద - బడ్డ - నాగ - బాణ - అఘాసి - శబ్ద - వశ - ఆజ్ఞారూప - నందరూపములకు బలి ఇచ్చి క్రమముగా వాటిని పూజించవలెను. వటుకునకు ఆర్ఘ్య పుష్ప - ధూప - దీప - గంధ - బలులను క్షేత్రపాలునకు పుష్ప-బల్లులను సమర్పించవలేను. అపుడు “హీం ఖం ఖం... నమస్తుభ్యమ్” “ఓం హ్రాం హ్రీం ...... స్వాహా” అను (మూలోక్తము లగు) మంత్రములను వినియోగించవలెను. బలి చివర కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, ఎదుట త్రికూటమును పూజించవలెను. ఇందుకు మంత్రము “హీం హ్రూం హోం శ్రీం త్రికూటాయ నమః” పిదప ఎడమ ప్రక్కన నిశానాథుని, కుడి ప్రక్కన తమోరినాథుని (సూర్యనాథుని), ఎడుట కాలానలుని పాదుకలను పూజించవలెను. పిదప ఉడ్డియాన - జాలంధర - పూర్ణగిరీ - కామరూపులను, గగనానంద దేవ వర్గసహితస్వర్గానదదేవ - పరమానందదేవ - సత్యానందదేవపాదుకా - నాగానందటేపును పూజించవలెను. ఈ విధముగ ‘వర్గము' అను పేరు గల పంచరత్నములను గూర్చి చెప్పబడినది. ఉత్తర ఈశాన్యములందు సుర నాధపాదుకను, సమయ కోటిశ్వరుని, విద్యాకోటీశ్వరుని, కోటీశ్వరుని, బిందు కోటీశ్వరుని, సిద్ధకోటీశ్వరుని పూజించవలేను. అగ్నేయమున నలుగురు సిద్ధులను, అమరీ శేశ్వర - చక్రీ శేశ్వర - కురంగేశ్వర - వృత్రీశ్వర - చంద్రనాథులను గంధాదిపంచోపచార ముతో పూజించవలెను. దక్షిణమున ఆది విమల - సర్వజ్ఞవిను - యోగ విమల - సిద్ధవిమల - సమయఎమలులను పూజించవలేను.
నైరృతియందు నాలుగు వేదమును, కందర్పనాథుని, వెనుక చెప్పిన అందరు శక్తులను, కుట్టిక శ్రీపాదుక ను పూజించవలెను. కుబ్జకాపూజ “ఓం హ్రాం హ్రీం కుట్టికాయై నమః” అను నవాక్షర మంత్రముతో గాని, లేదా కేవలము పంచప్రణవరూప మగు మంత్రముతో గాని చేయవలెను. తూర్పు మొదలు ఈశాన్యమువరకు బ్రహ్మ-ఇంద్ర-అగ్నియమనిరృతి-ఆనంతవరుణ-వాయు కుబేర ఈశాను లను దశ దిక్పాలకులను పూజించవలెను. సహస్రనేత్రు డగు ఇద్రుని, అనవద్యు డగు విష్ణువును, శివుని సదా పూజించవలెను. తూర్పు మొదలు ఈశాన్యము వరకును ఎనిమిది దిక్కులలో క్రమముగా బ్రహ్మాజీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహీ, ఐంద్రీ, చాముండా, మహాలక్ష్ములను పూజించవలెను. వాయవ్యము మొదలు ఆరు ఉగ్ర దిక్కులందు వరుసగ డాకినీ–రాకిణీలాకిసీకాకినీ-శాకినీ–యాకినులను పూజించవలెను. పిదప ధ్యానపూర్వకముగ కుట్టికాదేవిని పూజించవలెను. ముప్పది రెండు వ్యంజనాక్షరములు ఆమె శరీరము. ఆమెను పూజించునపుడు ఐదు ప్రణవములను గాని, 'ప్రీం' గాని, బీజరూపమున ఉచ్చరించవలెను. ఆమె దేహచ్చాయ నీలక మలదలశ్యామము. ఆరు ముఖము లుండును. వాటి కాంతి గూడ ఆరు విధముల నుండును. ఆమె చైతన్య శ క్తిస్వరూపురాలు. అష్టాదశాక్షర మంత్రముచే ప్రతిపాదింపబడునది. పండ్రెండు భుజము లుండును. సుఖముగా పింహాసనముపై కూర్చుండును. కర్కోటకుడు ఆమెకు మేఖల. తక్షకుడు శిరస్సుపై నుండును. వాసుకి కంఠహారము. ఆమె రెండు చేవులకును, కులికుడు, కూర్ముడు అనునాగములు కుండలముగా నున్నవి. రెండు కనుబొమ్మలపై పద్మమహాపద్మము లను నాగము లున్నవి. వామహస్తములందు నాగ –కపాల-అక్షసూత్రఖట్వాంగ, శంఖపుస్తకములు, దక్షిణ హస్తములందు త్రిశూలదర్పణఖడ్గ-రత్నమాలా ఆంకుశ ధనుస్పులు ఉండును. ఆ దేవి ముఖములు రెండు పై వైపునకు ఉండును. వాటిలో ఒకటి పూర్తిగా తెల్లగాను, రెండవది సగము తెల్లగాను ఉండును. తూర్పు వైప ముఖము పాండువర్ణము గలది. దక్షిణము వైపు ముఖము కోపముతో నున్నట్లు కనబడును. పశ్చిమ ముఖము నల్లగాను, ఉత్తరముఖము హిమ-కుంద చంద్రుల వలె తెల్లగాను ఉండును. ఆమే చరణతలమున బ్రహ్మయు, జఘనమున విష్ణువు, హృదయమున రుద్రుడు, కంఠమునందు ఈశ్వరుడు, లలాటమునందు సదాశివుడు ఆమె పై భాగమునందు శివుడును ఉందురు. కుట్టికాదేవి ఊగు తున్నట్లు ఉండును. పూజాదిసమయములందు కుబ్లికను ఈ విధముగ ధ్యానించవలెను
అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున కుబ్జికాపూజావర్ణన మను నూట నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
