అగ్ని మహా పురాణము
257 - అథ సీమా వివాదాది నిర్ణయః
అగ్నిరు వాచః
అగ్ని దేవుడు పలికెను: క్షేత్రము విషయమున సీమా వివాదము (సరిహద్దు) ఏర్పడినపుడు సామంతులు వృద్ధులు మొదలగువారు గోపాలకులు ఆ సరిహద్దులలో వుండు కర్షకులు వనములో నివసించువారు. వీరందరును ఎత్తైన ప్రదేశము బొగ్గులు ఊక (పొల్లు) వృక్షములు వంతెనలు, పుట్టలు పల్లములు, చైత్యములు మొదలైన వాటి సహాయముతో ఆ సరిహద్దును గుర్తించవలెను. సామంతులు గాని, గ్రామములోని నలుగురుని గాని, ఎనమండుగురు గాని, పదిమందిగాని. ఎర్రని పుష్పమాలలను, వస్త్రములను, ధరించి, తల పై మట్టిపెట్టుకొని సీమా నిర్ణయము చేయవలెను. ఈ సామంలాదులు అసత్యము చెప్పినచో రాజు వారికి వేరువేరుగా మధ్యమ సాహసదండము ఇవ్వవలెను. సీమను నిర్ణయించు చిహ్నములులేని పక్షమున రాజే సీమా నిర్ణయము చేయు వాడు. తోటలు గృహములు, గ్రామములు తటాకాదులు ఉద్యానములు దేవాలయములు, వర్షాజలములు ప్రవహించు కాలువలు మొదలగు వాటి విషయము గూడ సీమా నిర్ణయము ఇట్లే చేయపలెను. సరిహద్దులు తొల గించిన వారికిని క్షేత్రము హరించిన వారికిని సరిహద్దు దాటిన వారికిని రాజు క్రమముగా, అధమ ఉత్తమ మధ్యమ, దండములు ఇవ్వవలెను. చాలమందికి ఉపయోగించినది కొంచెము మాత్రమే బాధ కలిగించునది యగు సేతువు- పరుల భూమిలోనికి పోవు అత్యధికమగు జలముగలది . అల్ప క్షేత్రమును ఆక్రమించునది యగు కూపము-వీటిని అడ్డు పెట్టరాదు. క్షేత్రాధిపతికి తెలుపకుండ గనే క్షేత్రమునందు సేతువును నిర్మించినచో దానిని క్షేత్రాధిపతియే అనుభవించవలెను. అతడు లేనిచో ఆదిరాజునకు చెందును. దున్ను వాడు తానుదున్నిన భూమి పై పంటపండింపకున్నను, ఇతరులను పుడింపకుండ అడ్డుకున్నను దున్నిన భూమి పై వచ్చు టకు అవకాశమున్న పొలమును ఆతనికి ఇప్పించి ఆ పొలమును మరియొకనిచే చేయించవలెను.
గేదె సస్యమునకు కల్గించినపుడు ఎనిమిది మాషములు గోవు నష్టము కల్గించినచో నాలుగు మాషములు, మేకలు గొఱ్ఱెలు, కలిగించినచో దండము విధించవలేను, గేదెలు మొదలగునవి సస్యమును భక్షించి అక్కడ కూర్చున్నచో పైన చెప్పినదానికి రెట్టింపు దండమును విధించవలెను. వినీత క్షేత్రము నందు కూడ పైన చెప్పినట్లే దండమును విధించవలేను. గాడిదలకు ఒంటెలను కుండ గేదేతో సమానముగా దండము. ఎంత సస్యము నష్టమేనదో అంత క్షేత్రస్వామికి ఆ పశువుల స్వామి చేత ఇప్పించవలెను. పశువుల కాపరికి లాడనమే దండము. గోస్వామికి ఆతడు స్వయముగా మేపినచో పైన చెప్పిన దండము విధించవలెను. ఆ క్షేత్రము మార్గమునందును గ్రామము యొక్క వివీతము చివరను వున్నపుడు తెలియక పశువులు మేసినచో దండములేదు. తెలిసి మేపినచో చోరుని వలె దండించవలెను. ఆటోలు, దేవతలనుద్దేశించి విడిచిన పశువులు క్రొత్తగా ఈనిన ఆవుచెదరి వచ్చిన ఆవు ఇవి మేసినచో దండములేదు. వాటిని విడిచి పెట్టవలెను. దైవోపహతములు, రాజోపహతములగు పశువులను కూడ విడిచి పెట్టవలెను. గోపాలకుడు ప్రాతః కాలమున పశువులను లానెట్లు తీసుకొనిపోవునో సాయంకాలమున అట్లే తిరిగి స్వామికి అప్ప చెప్పవలెను. జీతము తీసుకొను గోపాలుని ప్రమాదముచే పశువులు మరణించి నను, నష్టమైనను ఆతనిచే వాటి స్వామికి ఇప్పించవలెను. గోపాలుని పొరపాటు చే పశువు నశించినచో పదమూడున్నర పణముల దండము విధించి పశు మూల్యమునకు సమానమైన ధనమును పశుస్వామికి ఇప్పించవలెను. గ్రామస్థుల ఇష్టము ప్రకారము గాని, రాజాజ్ఞచేతగాని, గోవుల మేత కె కొంత భూమిని విడువవలెను బ్రాహ్మణుడు అన్ని క్షేత్రములనుండియు సీమా వివాదాడి నిర్ణయః తృణమును కట్టెలను, పుష్పములను, తన సొంత వస్తువువలె గ్రహించవచ్చును. గ్రామమును పొలమునకును మధ్యవంద ధనుస్సుల దూర ముండవలెను. ఖర్వటము (పెద్ద గ్రామము) నకు క్షేత్రమునకు మధ్య రెండువందల ధనుస్సుల ఆంతరము నగరమునకు క్షేత్రములకు మధ్య నాలుగు వందల ధనుస్సుల ఆంతరము వుండవలెను.
తన వస్తువును అపహరించి ఎవరైన ఇతరులకు ఆమ్మి వేసినపుడు అది కనబడినచో దానిని స్వామి తీసుకొన వచ్చును. దానిని బయటకనబడకుండ చేసినచో అది కొన్న వాని దోషము ఒక నీచుని నుండి తక్కువ మూల్యము ఇచ్చి సమయము కాని సమయమునందు రహస్యముగా ఒక వస్తువును కొన్నవాడు చోరుడే. నష్టమేనను ఆపహృతమైనను ఒక వస్తువు కనబడినచో అది ఎవని వద్దనుండునో వానిని రాజపురుషులచే పట్టించవలెను. ఆదేశమునందు ఆసమయమునందు పట్టించుటకుదరక పోయినను, తాను స్వయముగా పట్టి ఇవ్వవలెను. అపహృత వస్తువును కొన్న వాడు అమ్మినవానిని చూపించి వచో వాడు శుద్దుడగును. రాజు ఆ ద్రవ్యమును స్వామికి ఇప్పించి అమ్మినవానిని శిక్షించి కొన్న వానికి వానిచే మూల్యమును తిరిగి 8ప్పించవలెను. నష్టమైన వస్తువును దాని స్వామి తనకు ఎట్లువచ్చినదో తాను ఎట్లు అనుభవించెనో చెప్పి ఆది తనదని నిరూపించుకొనవలెను. అట్లుచేయజాలనిచో రాజు దానిలో పంచమాంశమును దండముగ విధించవలేను. హృతమైన లేదా నష్టమైన తన వస్తువునుగూర్చి రాజుకు నివేదించకి ఇతరుల ద్వారాదానిని పొందినవానికి రాజు తొంబది యాఱు పణములు విధించవలెను. శుల్కా ధికారులు కాని, స్థానపాలకులు గాని, తీసుకొనివచ్చి రాజువద్దవుంచిన నష్టఅపహృత ధనమును దాని స్వామి ఒక సంవత్సరములోపుగ తనదని నిరూపించి మరల పొందవచ్చును. సంవత్సరము దాటినచో అది రాజుకుచెందును. ఏకశఫములు (గుఱ్ఱములు మొదలగునవి) పోయి మరల లభించినచో వారికి స్వామి రాజునకు నాలుగు పణములు ఇవ్వవలెను. మనుష్యజాతికి సంబంధించిన ద్రవ్యములభించికచో ఐదుపణములు, మహిషము, ఉన్షము, గోవు తిరిగి లభించినపుడు రెండేసి పణములు, మేకలకు గొఱ్ఱెలకు పణములో నాలుగవవంతు ఇవ్వవలెను
తనకుబుంబమునకు నష్టముకాని విధమున తన వస్తుపులను దానము చేయవచ్చును. భార్యాపుత్రాదులను ఎన్నడును దానము చేయకూడదు. తన సర్వస్వమును తన వంశము వున్నపుడు ఇతరుల ఎవ్వరికిని ఇవ్వకూడదు. ఒకరికి ఇచ్చిన దానిని మరొకరికి ఇవ్వకూడదు. ప్రతిగ్రహము అందరి యెదుటను చేయవలెను. ఇచ్చెదనని చెప్పినవస్తువును తప్పక ఇవ్వవలెను. ఇచ్చిమరల తీసుకొనగూడదు. బీజములు ఇనుము, వాహనములు, రత్నములు, దాసి, పాలిచ్చు పశువులు దాసులు వీరిని రక్షించుటకు వరుసగ పది, ఒకటి, ఐదు, ఏడు దినములు మాసము, మూడుదినమరణులు, ఆర్గమాసము తీసుకొన వచ్చును. బంగారము ఆగ్నిలో వేసినను తరగదు. వెండి నూటికి రెండుపలములు తగ్గును. తగర ము సీసము నూటికి ఎనిమిదిపలములు తగ్గును, రాగికి ఐదు పలములు ఇనుమకు పది పలములు తరుగువచ్చును. ఉన్ని నూలు వీటితో నేసిన బట్టలకు నూటికి పది పలవలు పెరుగును. మధ్యప్రమాణముగల దారమైనచో ఐదుపలములు సూక్ష్మ మయినచో మూడు పలములు హెచ్చును. ఆద్దకము బట్టలందును, రోమములు గుచ్చిన బట్టలందును నూటికి ముప్పైవంతులు తరుగవచ్చును. పట్టుబట్టలందు, నారచీరలందు, శయముగాని వృద్ధికానిఉండదు. కుశలుగు వారు దేశ వంను కాలమును భోగమును దృష్టిలో వుంచుకొని వష్టమైన వస్తువుల విషయమున బలాబలములను ఏ విధముగా నిర్ణయింతురో ఆ నష్టమును రాజు తప్పక ఇప్పించవలెను.
బలాత్కారముగా, దాసుడుగా చేయబడిన వానిని చోరులచే అమ్మబడిన వానిని తన స్వామిని ప్రాణ సంకటవ నుండి రక్షించిన వానిని, తవరై స్వామి ఎంత వ్యయము చేసెనో అంతధనము తిరిగి ఇచ్చివేసిన వానిని దాసత్వమునుండి విడిపించవలెను. ప్రవ్రజావసితుడు (సన్యాసమును స్వీకరించి భ్రష్టుడైన వాడు) ఆమరణాంతము రాజుకు దాసుడుగా వుండవలెను. వర్ణములలో దాస్యము ఆనులోమ్యముచే (క్రిందవర్ణము వారుపై వర్ణము వారికి) దాస్యముండును. ప్రతి లోమ క్రమమకాదు. శిల్పము నేర్చుకొన్న శిష్యుడు నిశ్చితమగు కొంతకాలము పాటు గురుగృహమునందే నివసించుచు, గురువు వంట భోజనము చేయుచు, శిల్పముల వలన సంపాదించిన డనమును గురువువకు ఇవ్వవలెను. రాజు తన నగరమున స్థానము కల్పించి అచట బ్రాహ్మణులకు నివాసమేర్పరచి వేదవిదులగు వారికి వృత్తి కల్పించి “మీరు ఇచట స్వధర్మానుష్టానము చేయడు” అని ప్రార్థించవలెను. స్వధర్మమునకు ఆవిరుద్ధమగు ఆయాసమయములందు ఏర్పరచ బడిన రాజనిర్ణీత ధర్మమును కూడ ఆ బ్రాహ్మణులు పాలింపవలెను. ఎవడు జనగణము యొక్క ద్రవ్యమును హరించునో, మర్యాదనులంఘించునో ఆతని సర్వస్వమును తీసుకొని రాష్ట్రమునుండి వెడలగొట్టవలెను. సమాజహితమును కోరువారు చెప్పిన విషయమును అందరును ఆచరించవలెను. తద్విపరీతముగా ప్రవర్తించు వానిని ప్రథమ సాహస దండముచే శిక్షించ వలెను. సమాజ కార్యము పై పంపబడినవాడు తనకు లభించిన దంతయు సమాజమునకు సమర్పించ వలయును. వాడు ఆట్లు ఆర్పించకున్నచో వానిచే పదకొండు రెట్లు ఇప్పించవలెను. వేదజ్ఞులు, పవిత్రులు, లోభము లేనివారు, కార్యచింతకులు కావలెను. సమాజ హితమును చెప్పువాతి వచనమును అందరును ఆచరించవలెను. శ్రేణులు, నైగములు, పాషండులు, గజముల వీరికి కూడ ఇది వర్తించును. రాజు వీరి ధర్మ భేధములను, పూర్వవృత్తిని పాలించవలెను.
వేతనము తీసుకొని పనిమానివేసినవాడు వేతనమునకు రెట్టింపు ధనమును స్వామికి ఇవ్వవలెను. అతడు వేతనము తీసుకొనకుండ పనిమాని వేసినచో వేతన ధనమును స్వామికి ఇప్పించవలెను. భృత్యుడు ఉపకరణములను రక్షించుచుండవలెను. వేతనము నిశ్చయించకుండగ ఎవరైనా భృత్యునిచే పని చేయించుకున్నచో రాజు వానిచే ఆ భృత్యునికి వాణిజ్యము పదవులు సస్యము వీటిలో పదవవంతు ఇప్పించ వలెను. దేశ కాలములను దాట బెట్టుటచే పనిని చెడ గొట్టిన భృత్యునకు స్వామి తన ఇష్టము వచ్చినంత వేతనమనే ఇవ్వవలెను. ఆనుకొనిన దానికంటే అధికము. సమకూర్చినచో అధిక వేతనము ఇవ్వవలెను. ఎవడు ఎంత పని చేయునో అతనికి అంతయే వేతనము ఇద్దరికి అసాధ్య మైన పనిని ఒకడు ఎంత చేయునో ఆంతయే వేతనము సాధ్యమైనచో చెప్పినంత వేతము ఈయవలెను. భారమును మోయు భృత్యుడు, రాజునకు కాని దైవమువకు కాని, సంబంధించిన వస్తువును మోయుచు దానిని నష్టపరచినచో ఆవాహకునిచే అంత ధనము స్వామికి ఇప్పించ వలెను యాత్రలో విఘ్నము కలిగించు భృత్యునిచే వేతనమునకు రెట్టింపు ధనమును ఇప్పించ వలెను. యాత్రా ప్రారంభమున పనిమానివేసిన వానిచే వేతనములోని సప్తమ భాగమును మార్గమునందు మానివేసిన వానిచే చతుర్థ భాగమును, మార్గమధ్యమునందు మానివేసినవానిచే మొత్తము వేతనమును ఇప్పించ వలెను. జూదములో పందెము నందు, నూరుగాని, అంతకంటే అధికము గాని ఎక్కువ సంపాదించిన జూదరి నుండి సభికుడు రాజునకు సభికుడు (ద్యూతగృహాధ్యక్షుడు) నూటిలో పదవ వంతు తీసికొనవలెను. మరల అంత లాభము వచ్చినప్పుడు నూటికి పదవ వంతు తీసుకొనవలెను. రాజుచే బాగుగ పరిపాలింపబడిన సభికుడు రాజునకు నిర్ణీ తథాగమును ఇవ్వవలేను. జయించిన ధనమును జయించిన వానికే యిచ్చి క్షమాపరాయణుడై సత్యమునే పలుకవలెను. ప్రసిద్దులగు జూదరుల సముదాయము సభికులతో సహ రాజువద్దకు వెళ్ళి ఆతని భాగమును చెల్లించిననే రాజు జయించనివానికి జయించిన సొమ్ము నే ఇప్పించ వలెను. ద్యూతమును సంబంధించిన వ్యవహారములను పరిశీలించుటకును, సాక్ష్యము చెప్పుటకును, జూదరులనే నియమించవలెను. తప్పుడు పాచికలతో ఆడించువారి వారి శరీరముపై కొన్ని గుర్తులుచేసి దేశ మునుండి వెడలగొట్టవలెను. జూదములో దొంగలను తెలుసుకొనుటకు ఒక వ్యక్తినే ప్రధానునిగా నియమించవలెను. ప్రాణి ద్యూతమునందు కూడ ఇదియే నియమము.
అగ్ని మహాపురాణమునందు సీమా వివాద ద్యూతాది నిర్ణయమను రెండువందల యేబది ఏడవ అధ్యాయము సమాప్తము.
