అగ్ని మహా పురాణము

Table of Contents

301 - అథ సూర్యార్చనమ్

అగ్ని రువాచః

అగ్ని దేవుడు చెప్పెను. శార్జ్గి (గ కారము) దండి (అనుస్వార యుక్తము కావలెను). దానిలో పద్మేశుడు ( ఈకారము) పావకుడు (రకారము) ఈ నాలుగు అక్షరములను కలుపగ ఏర్పడిన బీజా క్షరము (గ్రీం) స్వూర్థ సాధకము పై బీజమునకు క్రమముగా దీర్ఘ స్వరములను చేర్చి ఆంగన్యాసము చేయవలయును. గణాధిపతికి గఁగః గౌం గంగ్, అను ఐదు బీజాక్షరము ఉన్నవి. అవి వేరువేరు ఫలములిచ్చును. గణం జయాయనమః, ఏకదంష్ట్రాయ, చలకర్ణినే గజ వక్త్రాయ, మహోదర హస్తాయ, ఇవి సర్వ సామాన్యమైన పంచాంగములు. లక్ష పర్యాయములు జపించుటచే మంత్ర సిద్ది కలుగును. అష్టదళకమలము ఏర్పరచి దిగ్దళములందు గణేశుని నాలుగు విగ్రహములను పూజించవలయును. క్రమ ముగా ఐదు అంగములను కూడ పూజించవలయును. నమః చివర చేర్చి గణాధిపతయే, గణేశ్వరాయ, గణనాయకాయ, గణక్రీడాయ అనునాల్గు ముత్రములు దిగ్గళమునందున్న మూర్తులను పూజించుటకు ఉపయోగించవలెను. ఆంగపంచక మును వెనుకటి వలె నే పూజించవలయును. వక్రతుండాయ ఏకదంష్ట్రాయ, మహోదరాయ, గజవక్త్రాయ, వికటాయ, విఘ్న రాజాయ, ధూమ్రవర్ణాయ, యని దిగ్వి దిక్కులందున్న మూర్తులను పూజించవలయును. పిదప దిక్పాలకులను పూజించవలెను. ముద్రా ప్రదర్శన ద్వారా పూజ శ్రేష్ఠము. మధ్యమాతర్జనీల మధ్య బొటన వ్రేలు ఉంచి పిడికిలి బిగించినచో అది గణేశ ముద్ర. ఈ విధముగా ధ్యానించవలెను. నాలుగు భుజములు కలవాడును మోదకములును గ్రహించిన వాడును, దండ పాశాంకుశములతో కూడినవాడును. దంత భక్ష్యములు ధరించినవాడును రక్తవర్ణుడును పద్మ పాఠ అంకుశములను ధరించినవాడును అగు గణేశుని పూజించపలెను. చతుర్దియందు విశేషముగా పూజించవలెను. శ్వేతార్క మూలముతో మూర్తి నిర్మించి తిలఘృత హోమములు చేసినచో సకల మనోరథములు సిద్ధించును. దధి మధు ఆజ్యములతో తండులములు హోమము చేసినచో సౌభాగ్యము వశిత్వము కలుగును. 

ఘోష (హ) అస్మక్ (ర) ప్రాణ (య) శాంతి (ఔ) అర్థీ (ఉ) దండ (0) కలుపగ ఏర్పడిన (హ్యౌ) ఓం ఆను మార్తాండ భైరవమును బిఁబ బీజముతో సంపుటితము చేసినచో సాధకునకు ధర్మార్థ కామ మోక్షములు లభించును. ఐదు హ్రస్వాక్షరములను ఆదియందు బీజముగ చేర్చి పంచమూర్తుల న్యాసము చేయవలయును. దీర్ఘస్వర బీజములతో హృద యాద్యంగన్యాసము చేయవలయును. ధ్యానము సిందూరమువలె ఎర్రగానున్నవాడును, ఈశాన్య దిక్కునందు వామార్ధ మున భార్యా సహితుడై వున్న వాడును అగు సూర్యునకు నమస్కారము. ఆదిత్యాది పరివృతమగు రవి మండలమును పూజించి ఉదయ సమయము ఆర్ఘ్యము ఇవ్వవలెను. ఈ శాన్యమునందు కృతాంతునకు నిర్మాల్యమును చండునకు దీపిత తేజస్సును సమర్పించవలెను. రోచన కుంకుమ జల రక్త చందన ఆక్షరాంకుర వేణు బీజయవశాలి శ్యామాక తిల రాజక జపాపుష్పములు అర్ఘ్య పాత్రము నందుంచి, దానిని శిరస్సుపై ధరించి మోకాళ్ళపై కూర్చుండి సూర్యునకు ఆర్ఘ్యము ఇవ్వ వలెను. స్వముత్రములచే ఆభిమంత్రితములగు కలగములతో గ్రహములను పూజించి గ్రహాది శాంతి కొరకై శాంతికలశ జలముతో శాంతిచేసి సూర్యమంత్రము జపించువాడు సకల మనోరథములను పొందును. - సంగ్రామ విజయ మంత్రము నందు బిందు పోషక బిందుయుక్తర చేర్చి ఆమంత్రముతో శిరస్సు నుంచి పాదముల వరకు ముద్రా ప్రదర్శన పూర్వకముగ ఆవాహన చేయుచు సూర్యుని పూజించవలెను. అంగన్యాసము చేసి తానే రవియని భావించవలెను. మారణస్థుబనము లందు సూర్యుని పీతవర్ణునిగాను ఆప్యాయనమునందు శ్వేతవర్ణుని గాను శత్రు సంహారమునందు కృష్ణవర్ణునిగాను మోహన కర్మయందు ధనుస్సు వంటి ఆకారము కలవానినిగాను భావన చేయవలయును. సూర్యుని ఆభిషేక, జప, ధ్యానపూజ, హోమములందు సర్వదా లగ్న డైనవాడు తేజశాలియై ఆజేయుడై శ్రీమంతుడై యుద్ధాదులందు జయమును పొందును. తాంబూలాదులఁదు ఈ మంత్రన్యాసము చేసి దానియందు ఉశీరకము పుంచి తన చేతిలో కూడ సంగ్రామ విజయ బీజమును వ్రాసి ఆ కాంబూలము ఎవరికైన ఇచ్చినను హస్త ముతో స్పృశించినను అతడు వశుడగును.

ఆగ్ని మహాపురాణమున గణపతి సూర్యార్చనకథనమను మూడు వందల ఒకటవ అధ్యాయము సమాప్తము.