అగ్ని మహా పురాణము

Table of Contents

114 - అథ గయామాహాత్మ్యమ్.

ఆగ్ని రువాచః-

అగ్ని దేవుడు చెప్పెను. ఇపుడు నేను గయామాహాత్మ్యమును చేప్పెదను. గయ ఉత్తమతీర్ధములలో ఉత్తమ మైనది. గయడను, అసురుడు గొప్ప తపస్సు ప్రారంభించెను. దానిచే డేవతలు పీడితు లై క్షీరసాగరశాయి యగు విష్ణువు వద్దకు వెళ్ళి భగవంతుడా! నీవు గయాసురునినుండి మమ్ము రక్షించుము” అని ప్రార్థించిరి. అటులనే అని పలికి శ్రీమహా విష్ణువు గయాసురుని వద్దకు వెళ్ళి వరకు కోరుకొనుము అని పలికెను. “మహావిష్ణ నేను సకల తీర్థములకంటెన అతి పవిత్రుడను అగుదును గాక” అని గయుడు పలికెను. “అటులనే అగుగాక” అని పలికి శ్రీమహావిష్ణువు వెడలిపోయెను. పిదవ మానవు లందరును ఆ దైత్యుని దర్శనము చేసి “భగవంతుని చేరుచుండిరి భూమి శూన్య మైపోయెను. ఆపుడు బ్రహ్మాదిదేవతలు” మహావిష్ణువువద్దకు వెళ్ళి “దేవా! స్వర్గము భూలోకము కూడ శూన్య మైపోయినవి. ఆ దైత్యుని దర్శనము చేసికొనినంతమాత్రముననే ఆందరును నీ లోకమును చేరుకొనుచున్నారు అని పలికిరి. ఆ మాటలు విని శ్రీహరిబ్రహ్మ తో నీవు దేవతాసమేతుడవై వెళ్ళి యజ్ఞభూమిగా చేయుటకై నీ శరీరమునిమ్ము అని గయాసురుని కోరుము” అని పలికెను. బ్రహ్మ దేవతాసమేతుడై గయునిదగ్గరకు వెళ్ళి “దైత్యశేషా నేను అతిథి నైనీ ద్వారమువద్దకు వచ్చితిని. నీ పవిత్రశరీర మును యజ్ఞముకొరకై ఇమ్ము” అని కోరెను. “తథాస్తు” అని పలికి గయాసురుడు భూమిపై పరుండెను. బ్రహ్మ ఆతని శిరముపై యజ్ఞము ప్రారంభించెను. పూర్ణాహుతి సమయము వచ్చుసరికి, గయుని శరీరము కదలిపోయెను. అది చూచి బ్రహ్మదేవుడు విష్ణువుతో “దేవా! పూర్ణాహుతి సమయమున గయాసురుని శరీరము కదలి పోవుచున్నది” అని చెప్పెను. అపుడు విష్ణువు ధర్మదేవతను పిలిచి “నీవు అసురుని శరీరముపై ధర్మమయశిలను ఉంచుము. దేవతలందరును ఆ శిలపై కూర్చుండవలెను దేవతలతోపాటు నా గదాధరమూ ర్తికూడ ఆ శిలపై ఉండగలదు” అని పలికెను. ఆ మాట విని ధర్మ దేవత విశాల మగు దేవమయశిలను తీసికొని వచ్చి ఆ అసురుని దేహముపై ఉంచెను. (ఆ శిల కథ యిది):- ధర్మునకు తన భార్య యగు ధర్మవతి గర్భమున ధర్మవ్రత యను కుమార్తె జనించెను. అమె గొప్ప తపశ్శాలిని, బ్రహ్మ కుమార్త డైన మరీచిమహర్షి ఆమెను పరిణయమాడెను. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె, శివుడు పార్వతితో వలె, మారీచి ధర్మ వ్రతతో సుఖముగా నుండెను.

దేవవ్రతోవాచః-

అగ్ని రువాచః

ఒకనాడు అడవినుంచి కుశ సమిధాదులు తెచ్చిన ఋషి చాల అలసిపోయేను. ఆతడు భోజనానంతరము ధర్మ తను తన పాదము లొత్తు మని యాజ్ఞాపింపగా ఆమె సరే నని అలసి యున్న ఆ మహర్షి పాదములను ఒత్తసాగెను. ముని నిద్రించెను. ఇంతలో బ్రహ్మ వచ్చెను. “నేను బ్రహ్మదేవునిని సత్కారములు చేయవలేవా, లేదా? మహాముని పాదము లొత్తవలేనా?” బ్రహ్మ గురువునకు గూడ గురువు నా భర్తకు కూడ పూజ్యుడు. ఆందుచే ఈయనను పూజించవలెను.” అని ఆలోచించి ధర్మవ్రత బ్రహ్మ ను పూజించుచుండెను. మేల్కొన్న ముని ధర్మవ్రత అచట లేకుండుట జూచి,  ఆజ్ఞనుల్లంఘించినందులకు “నీవు శిలవు కమ్ము” అని ఆమెను శపించెను. అది విన్న ధర్మవ్రత కుపితురాలై , “మునీ! నీ చరణసేన విడచి: నేను నీకు కూడ హజూ డైన నీ తండ్రికి, పూజ చేసితిని. అందుచే నేను సర్వధా నిర్దోషురాలను. ఇట్టి పరిస్థితులలో కన్ను శపించితిరి. ఆందుచే నీకు గూడ శివునివలన కాపము లభించగలదు.” అని పలికి, శాస్త్రమును , దూరముగానుంచి, అగ్నిలో, ప్రవేచి వేలకొలది సంవత్సరములు తీవ్ర తపస్సు చేసెను. ఆ తపస్సుకు సంతసించిన విష్ణ్వాది దేవత్తల వరము కోరు శ్రీమదగ్ని మహాపురాణము కొను మని పలికిరి. “మీరు నా శాపమును తొలగింపుడు” అని ధర్మవ్రత ప్రార్ధించెను. దేవతలు పలికిరి పూజ్యురాలా! మరిచిమహర్షి ఇచ్చిన శాపము అన్యధా కాజాలదు. నీవు దేవతా చరణచిహ్న ములచే అంకిత మైన శరీరము గల పరమపవిత్ర మైన శిలగా అవగలవు. గయాసురుని శరీరమును స్థిరముగా నుంచుటకై నీవు శిలారూపమును ధరించవలసి యున్నది. అపుడు నీకు “దేవవ్రతా, దేవశిలా, సర్వదేవస్వరూపా, సర్వతీర్థమయీ, వుణ్యశిలా” అను పేర్లు లభింపగలవు. దేవవ్రత వలికెన  దేవతలారా! మీరు నాపై అనుగ్రహించినచో బ్రహ్మ విష్ణురుద్రాది దేవతలుమ, గౌరీ లత్మ్యాది దేవులను నాపై సర్వదా ప్రకాశింతురు గాక.” అగ్ని దేవుడు పలికెను; దేవవ్రత మాటలు విని ఆ దేవత లందరును 'అట్లే అగుగాక' అని వలికి స్వర్గమునకు వెళ్ళిపోయిరి.

ఆ దేవమయీ శిలనే ధర్మదేవక గయాసురుని శరీరము పై నుంచేను. కాని గయుడు శిలతో సహ కదల నారం భించెను. అది చూచి రుద్రాది దేవతలు కూడ ఆ శిలపై కూర్చుండిరి. ఆ దేవతలతో సహా అతడు కదల మొదలిడెను, అపుడు దేవతలు క్షీరసాగరముపై శయనించి యున్న విష్ణువును ప్రసన్ను ని చేసికొనగా శ్రీమహావిష్ణువు తన గదాధరమూర్తిని వారికిచ్చి “దేవతలారా మీరు వెళ్ళుడు. దేవగమ్య మైన ఈమూర్తి ద్వారా నేను ఈ విధముగ గయుని శరీరమం స్థిరముగా మండు నట్లు చేయుటకై సాక్షాత్ వ్యక్తావ్యక్తోభయస్వరూపుడగు గదాధారి యగు విష్ణువు అచట ఉండెను. ఆదిగదాధరు డన పేరుతో శ్రీమహావిష్ణువు అచట నున్నాడు. పూర్వము గదు డను ఒక భయంకరుడగు. రాక్షసుని శ్రీమహావిష్ణువు సంహరించగా, వాని ఎముకలతో విశ్వకర్మ గదను నిర్మించేను. అది “ఆదిగద” ఆ ఆదిగదతో గదాధరుడు హేతి మొద లగు రాక్షసులను సంహరించెను. అందుచే అతడు “అదిగదాధరుడు ఆయెను. దేవమయీశిలపై గదాధరుడు కూర్చుండగనే గయాసురుడు కదలకుండ నుండెను. అపుడు బ్రహ్మ పూర్ణాహుతి ఇచ్చెను. గయాసురడు దేవతలతో “మీరు నన్నిట్లు ఏల వంచించితిరి? శ్రీవిష్ణువు చెప్పినచో నేను స్థిరముగానుండ కుందునా! దేవతలారా మీరు నన్ను శిలాదులచే అణచి ఉంచినారు గాన నాకు వర మీయవలెను” అని పలికెను.

దేవా ఊచుః-

దేవతలు పలికిరి : తీర్థమును నిర్మించుటకై నీ శరీరము స్థిరముగా నుండు నట్లు చేయబడినది గాన నీ క్షేత్రము బ్రహ్మవిష్ణుమహేశ్వరుల నివాసస్థానము కాగలదు. . ఈ తీర్థము అన్ని తీర్థములకంటెను ఎక్కువ ప్రసిద్ధి పొందగ అదు. పితృదేవతలకు ఇది బ్రహ్మలోకము నిచ్చును” ఇట్లు పలికి దేవత లందరును అచటనే నివసించిరి. దేవీతీర్థాదు కూడ అచటనే నివాస మేర్పరచుకొనిరి. బ్రహ్మ యజ్ఞము పూర్తి చేసి ఋత్విక్కులకు దక్షిణగా ఐదు క్రోశుల దూరము గయా షేత్రమును ఏబది యైదు గ్రామములను సమర్పించెను. . అనేక మైన బంగారు పర్వతములను నిర్మించేను. పారు తేనె ప్రవ హించు నదుల నిచ్చెను. దధిమధువులతో నిండిన సరోవరములనిచ్చెను. అనేకమైన అన్నాదిపర్వతములను, కామధేను వును, కల్పవృక్షమును, వెండి బంగారముల గృహములను కూడ ఇచ్చేను. వీటి వన్నింటిని ఇచ్చుచు బ్రహ్మదేవుడు. ఆ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. “విప్రవరురాలా! ఇక మీరు వాకంటే తక్కువవానివద్దకు వెళ్ళి, ఎన్నడును యాచన చేయదు”. ఇట్లుపలికి అతడు ఆ వస్తువుల నన్నింటిని వారికి సమర్పించేను. తరువాత ధర్ముడు యజ్ఞము చేయగా  లోభముచే ఆ బ్రాహ్మణులు అతని నుండి ధనాది దానములు స్వీకరించి గయలో ఉంటూండగా బ్రహ్మ వారిని శపించెను. “మీరు విద్యావిహీనులును లుబ్దులును అగుదురు గాక”. ఈ నదులలో ఇక పై క్షీరాదులు ఉండవు, ఈ సువర్ణ లములు కూడ శిల లైపోవును”, అపుడు బ్రాహ్మణులు బ్రహ్మతో ఇట్లువలికిరి “దేవా! మీ శాపముచే మా నర్వస్వము సష్ట మైపోయి వధి. మా జీవికకు ఏదైన మార్గము చూపుము”. బ్రహ్మదేవు డిట్లు పలికెను. “ఇటు పై మీ జీవిక ఈ తీర్థము ద్వారా జరగును. సూర్యచంద్రు లన్నంతవరకును మీరు ఈ వృత్తితోడనే జీవించగలరు. గయకు వచ్చువారందరును మిమ్మ లను పూజింతురు. హవ్య-కవ్య-ధన-శ్రాద్ధాదులతో మిమ్మును సత్కరించు వారి వంశములోనివారునూరు తరములవరకును స్వర్గమునకు వెళ్ళుదురు. స్వర్గములోనే ఉన్న వారు. ముక్తి పొందుదురు”. గయమహారాజు కూడ ఈ క్షేత్రమునందు బహ్వన్నదక్షిణలు గల యజ్ఞము చేసెను. అతని పేరుచేతనే గయానగరమునకు ఆ పేరు వచ్చినది. పాండవులు కూడ గయ వెళ్ళి అచట శ్రీమహావిష్ణువును పూజించిరి.

అగ్ని మహపురాణమునందు గయామాహత్మ్యవర్ణన మను నూటపదునాల్గవ అధ్యాయము సమాప్తము.