అగ్ని మహా పురాణము
117 - అథ శ్రాద్ధకల్పః
అగ్ని రువాచః-
ఆగ్ని దేవుడు చెప్పెను: కాత్యాయనమహర్షి మునులకు చెప్ళిన కొద్దకల్పమును చెప్పేదను. గయాదితీర్థములలో విశేషించి సంక్రాంత్యాదిసమయములందు శ్రాద్ధము చేయవలెను, ఉపరాష్ట్రకాలమునందు, కృష్ణపక్షమున, చతుర్థితిథియందు గాని. శ్రాథమునకు కావలసిన సామగ్రి సంపాదించుకొని ఉత్తమనక్షత్రమునందు శ్రాద్ధము చేయవలెను. శ్రాద్ధది వసమునకు ఒక దివసము ముందుగనే బ్రాహ్మణుల నియంత్రణము చేయవలెను. అనింద్యులును స్వస్వకర్మనిరతులును, శిష్టులును సదా చార వంతులును అగు సంవ్యాసులమ గృహస్థులను సాధుపులను వేద స్నాతకులను, లేదా శ్రోత్రియులను నియంత్రించవలెను. తొల్లికలవారిని, కుషాదులు కలవారిని నియంత్రించరాదు. నియంత్రితులగు బ్రాహ్మణులమ స్నానాచమనాద్యనంతరము దేవ కర్మకై పూర్వాభిముఖముగ కూర్చుండబెట్టవలెను. దేవశ్రాద్ధ-పితృశ్రాద్ధములందు ముగ్గురేసి కాని, ఒక్కొక్కరు గాని బ్రాహ్మణు లుండవలెను. మాతామహాదిగ్రాద్ధమునందు గూడ ఇడ్లీ శ్రాద్ధకర్మ శాకాదులతో జరుపవలెను. శ్రాద్ధడివప మున బ్రహ్మచర్య మవలంబించి క్రోధరహితుడుగా ఉండవలెను. ఆ రోజున చాల దూరము ప్రయాణము చేయకూడదు. స్వాధ్యాయాధ్యయనము చేయరాదు. ప్రతి ఒక్క కర్మ విషయమనన, పంక్తి పావను-అగు బ్రాహ్మణులను అడుగుచుండ వలెను, ఆసనములపై జింకలు పరచవలెను. పితృకర్మలందుకుకలురెండుగామడచి వేయవలెను. మొదట దేవకర్మ చేసి పిదప పితృకర్మ చేయవలెను. దేవకర్మయందున్న బ్రాహ్మణులను “నేను విశ్వేదేవులను ఆవాహన చేసెదమ” అని అడుగగా వారు “ఆవాహన చేయుము”అని ఆనుజ్ఞ ఇవ్వవలెను. పిదప ‘విశ్వేదేవాస ఇత్యాదిమంత్రముచే విశ్వేదేవతల ఆవాహన చేసి ఆసనముపై యవలు చల్లవలెను, “విశ్వేదేవాః శృణుతేమం” ఇత్యాదిమంత్రము జపించవలేను. పిదప నేనిపుడు పితృ దేవతలను ఆవాహన చేసెదను” అని కర్మనియుక్తు లగు బ్రాహ్మణులను అడగవలెను. “ఆవాహన చేయుము” అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిదప “ఉక వస్వా” ఇత్యాది మంత్రము చదువుచు ఆవాహన చేయవలెను. తిలలు చల్లి అకున్తః ఇత్యాది మంత్రము జపించుచు, పవిత్రసహితమగు ఆర్ఘ్యపాత్రమునందు “శం నో దేవీ” ఇత్యాదిమంత్రముతో ఉదక ముపోయవలెను. పిడప ‘యవోసి' ఇత్యాదిమంత్రముచే యవలు ఇవ్వవలెను. పితరుల విషయమున సర్వత్ర తిలలు ఉపయోగించవలెను. పితృదేవతల ఆర్ఘ్యపాత్రమునందు “శం నో దేవీ' ఇత్యాదిమంత్రము చే ఉదకము పోసి “తిలోసి సోమదేవత్యో గోసవే దేవ విర్మిత ప్రత్నవద్భిః ప్రత్తః స్వధర పితృన్ లోకాన్ ప్రీణాపా స్వధావము” అను మంత్రము చదువుచు తిలలువేయవలెను. పిదప”శ్రీశ్చ తే? ఇత్యాది మంత్రముచే అర్ఘ్య పాత్రమదందు పుష్పములుంచవలెను. ఆ్యపాత్రము సువర్ణమయముగాని. రజతమయము గాని, ఉదుంబరమయము గాని, పత్రనిర్మితము గాని కావలెను, దేవతలకు సవ్యముగను పితృదేవతలకు అపసవ్యముగను ఈ వస్తువులను ఉంచవలెను. ఒక్కొక్కరికి ఒక్కొక ఆర్ఘ్యపాత్రము వినియోగించుట మంచిది. వితృ దేవతలకు చేతిలో ముందుగా పవిత్రమునుంచిన పిమ్మటనే ఆర్ఘ్యమీయవలెను.
పిదప “ఓం యా దివ్యా అపసుహవా భవన్తు” అను (మూలములో ఇచ్చిన) ముత్రము చదువుచ విశ్వేదేవాః ఏష వో హర్తార్ఘ్యః స్వాహా ఆని చెప్పి, విశ్వదేవతలకు అర్ఘ్య మిచ్చి పాత్రలను దక్షిణ (కుడి) భాగమున ఉంచ వలెను. పిత్రాదులకు కూడ స్వధా అని చివర చెప్పుచూ ఇదే విధముగ అర్ఘ్యము ఇవ్వవలెను. పితామహాదులకు కూడ ఇదే విధముగ ఇవ్వవలెను. ఆర్యావశేషము నంతను మొదటి పాత్రలో ఉంచవలెను. పాత్రలను మూడింటిని పిత్రాసన వామ భాగమునందు “పితృభ్య స్థానచుసి” అని చెప్పుచు బోర్లించవలెను. పిదప దేవతలను పితరులను గంధ - పుష్ప - ధూప దీప . వస్త్రాదులతో పూజించవలెను. పిదప పాత్రనుడి మృతయుక్త మగు అన్నము తీసి, “నే నీ అన్నమును అగ్నిలో హోమము చేసెదను” అని బ్రాహ్మణులను అడిగి, “చేయుము”. అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట ఆగ్నిలో హోమమ చేయవలెను. సాగ్ని యైనవాడు పవిత్రయుక్త మగు పితృహస్త మునందు, మంత్రమతో హోమము చేయవలెను “అగ్నమే కవ్యవాహనాయ స్వాహా” అని మొదటి ఆహుతి చేయవలెను” రెండవది “సోమాయ పితృమతే స్వాహా” అని చేయవలెను యముని, ఆంగిరసుని ఉద్దేశించి ఆహుతి ఇవ్వవలె నని కొందరి మతము, హోమము చేయగా మిగిలిన అన్నము వరుసగ దేవతా పితృపాత్రములందు వడ్డించి, పాత్రను హస్త ముతో కప్పి “ఓం పృథివీ శ్రీ పాత్రమ్జుహోమి స్వాహా” అను మంత్రము జపించుచు, ఇదం పిషుర్విచక్రమే” ఇత్యాది మంత్రముతో బ్రాహ్మణుని అంగుష్ఠముతో ఆ అన్నమును స్పృశింప చేయవలెను అపహతా అసురా”. ఇత్యాది మంత్రముతో పితృపాత్రమున తిలలు చల్లి సంకల్ప పూర్వకముగ అన్నము అర్పించవలెను. పిదప “జుషధ్వమ్” (భుజింపుడు) అని చెప్పి, గాయత్ర్యాదిమంత్రములను జపించవలెను. “దేవతాభ్యః..... నమో నమః.” ఆనుమంత్రమును గూడ జపించవలెను. పితృదేవతలు తృప్తి చెందిన విషయము తెలిసికొని, పాత్రము నందలి అన్నము చల్లవలెను. ఒక్కొక్క సారి అందరికిని జల మీయవలెను, సవ్యముగా నుండి గాయత్రీ మంత్రజపము చేసి, “మధువాతా” ఇత్యాది ఋక్కును జపించి, మీరు తృప్తి చెందినారా?” అని బ్రాహ్మణులను అడుగవలెను మేము తృప్తుల మైతిమి” అని వారు సమాధానము చెప్పవలెను. బ్రాహ్మణుల అనుమతిచే శేషాన్న మును కలిపి పిండము చేయుటకై పాత్రనుండి బైటకుతీసి, పితృచ్ఛిష్టాన్న సమీపమున అవనేజనము చేసి, కుశ ముల పై సంకల్ప పూర్వకముగ పిండదానము చేయవలెను. బ్రాహ్మణులు చేతులు కడిగిని ఆచమనము చేసిన పిమ్మట పిండ ప్రదానము చేయవలె నని కొందరి మతము.
ఆచమనానంతరము ఉడక మ పుష్పములు, అక్షతలు సమర్పించవలేను. ఏడవ అక్షయ్యోదకి మిచ్చి ఆశీర్వాదమును కోరుచు, “నా పితృదేవతలు సౌమ్యులగా నుందురుగాక” అని పలికి ఉదకము వదలవలెను. “మా గోత్రము సర్వదా వృద్ధి పౌండగాక. వేదముల పఠన పాఠనక్రమము అవిచ్చిన్నముగ కొనసాగుగాక! సంతానవృద్ధి ఆగు గాక. మాకు శ్రద్ధ లోపించకుండుగాక.. దానము చేయుటకై మా వద్ద వివిధ వస్తు సామగ్రి ఉండుగాక, చూవద్ద అన్నము కూడ అధిక ముగా నుండుగాక, మా యింటికి ఆతిథులు వచ్చుచుందురుగాక. యాచకులు మావద్దకువచ్చి యాచించమురు గాక. మేము మాత్రము ఎవ్వరిని యాచించకుందుముగాక అని ప్రార్థించవలెను. స్వధావాచనము నిమిత్త ము పిండములపై పవిత్రక సహిత మగు రకములు కప్పి నేను స్వధావాచసము చేయించెదను ఆని బ్రాహ్మణును అడిగి, “స్వరా వాచనము చేయుము” అని వారి అనుజ్ఞపొంది ఈ విధముగా చెప్పవలెను. 'బ్రాహ్మణులారా! మీరు మా పితృ - పితామహ - ప్రపితామహుల కొరకై స్వంవాచనము చేయుకు” అపుడు బ్రాహ్మణులు” అస్తు స్వధా” అని అందరు. పిమ్మ ఓ కుశ లపై దుగ్గమిశ్ర జలమును క్షిణాగ్రధారగా పోసి, అర్ఘ్యపాత్రను ఉత్తానము చేసి, దేవశ్రాద్ధ పిృశ్రాద్ధ ప్రతిష్టార్థమై యథా శక్తి గ సువర్ణ రజత దక్షిణ ఈయవలెను “శ్వేదేవా ప్రీయనామ్” అని చెప్పి దేవతావిసర్జన చేసి “ వాజే పాక్ష ఇత్యాది మంత్రముచే పిత్రాదులను విసర్జించవలెను. “ఆమావాజస్య” అను మంత్రము పఠించుచు బ్రాహ్మణును అనుసరించి నడచి, ప్రదక్షిణము చేసి ఇంటిలోనికి వెళ్ళవలెను. ప్రతి అమావాస్యయండను ఈ విధముగనే పార్వణ శ్రాద్ధము చేయవలెను,
ఇపుడు ఏకోద్దిష్ట శ్రాద్ధ మును గూర్చి చెప్పెదను. ఈ అర్ధము కూర వెనుకటివ నే చేయవలెను భేద మేమనగా దీనిలో ఒకే పవిత్రకము, ఒకే అర్ఘ్యము, ఒకే పిడము ఇవ్వవలెను. దీనిలో ఆవాహనము అగ్నౌ కరణము, విశ్వేదేవ పూజనము ఉండవు తృప్తి ని ప్రశ్నించినపుడు “స్వంతమ్” అని ప్రశ్నించవలెను బ్రాహ్మణుడు సుస్వదితమ్ అని ప్రత్యు త్తర మీయవలెను “ఉపతిష్ణమ్” అని చెప్పి అర్పణము చేయవలెను - అక్ష యోచకము కూడ ఇవ్వవలెను. విసర్జన సమయమున ఈ “ఆభిరమ్యతామ్” అని పలుక వలెను (హ్మణు. ఈ ఆభిరతాః “స్మః” అని ప్రత్యుత్తర మీయవలెను. మిగిలిన దంతము వెనుక టి వలనే చేయవలెను. ఇపుడు సపిండికరణమును గూర్చి చెప్పే కను ఇది సంవత్సరాంతమునందమ మధ్యయుదును కూడ చేయవచ్చును. దీనిలో పినరు కొరకు మూడు పాత్రలను, ప్రేతకు వేరుగా ఒక పాత్రయు ఉంచవలెను, నాలుగు అర్ఘ్యపాత్రముందును పత్రము, తిలలు. పుష్పములు, చందనము, జలము నింపవలెను. వాటి నుండియే అర్ఘ్యము నిచ్చు చుండవలెను 'తే, సమానాః' ఇత్యాది మంత్రద్వయముతో ప్రేతార్ఘ్యపాత్రను క్రమముగా పితృపితామహ, ప్రపితామహ పాత్రలతో కలపవలెను ఈ విధముగనే పిడదానము, దానము మొదలగు నవి గూడ చేసి, ప్రేత పిండమును పితరుల పిడములతో కలప వలెను. ఇట్లు చేయు చే ప్రేకకు పితృత్వము ప్రాప్తించును. ఇప్పుడు ఆభ్యుదయిక శ్రాద్ధమును గూర్చి చెప్పుచున్నాను దీని విని యతయు వెనుకటి వలనే. దీని యందు పితృదేవతాముత్రమును తప్ప ఇతర మంత్రము. జపము చేయవలెను. కోమ, కుశ లను ఉపయోగించవలెను. తిలలకు బదు యవలు ఉపయోగించ వలెను పితరులతృప్తి ని గూర్చి బ్రాహ్మణులను ప్రశ్నించు నపుడు ఓ సంపన్నమ్ అని ప్రశ్నించవలెను. వారు సు సుప్నమ్ అని సమాధానము చెప్పవలెను దీనిలో పెరుగు, అక్షత, బదరీఫ ములు మొదలగు వాటితో చేసిన పిండముల ప్రదానము చేయవలెను ఆవాహనసమయమున నేను నాందీముఖు లను పేరుగల పితృదేవతలను ఆవాహన చేసె నను” అని ప్రశ్నించవలెను. ఆక్షయ్యతృప్తి విష యమున 'ప్రీ మతామ్' ఆపవలెను. నేను సాందీముఖ పికృ దేవతల తృప్తి వాచనము జేయించే నను అని అడిగి, బ్రాహ్మాణు అను గొని, నాస్టీముఖాః పితరః ప్రియన్తమ్ ఆనీ, చెప్పవలేను. పితృ- పితామహ - ప్రపితామహులు, మాతామహ - ప్రమాతామహ - వృద్ధవ మాతామహులను పోందీముఖపితృ దేవతలు అభ్యుదాయిక శ్రాద్ధమునందు “స్వరా' ఉపయోగించరాదు. బ్రాహ్మణయము నకు భోజనము పెట్టవలెను. ఇపుడు నేను పితృదేవతల తృప్తి ని గూర్చి చెప్పెదను గామ్యాన్నము చేతను ఆరణ్యకంద - మూ - ఇలాచులచేతను” ఒక మాసము తృప్తి కలుగును. మత్స్యము చే రెండు మాసము, మృగ మాంసము చే మూడు మాసములు, పక్షి మాంసముచే నాలుగు మాసములు. రురు మృగమాంసముచే ఆ మదుమాసములు, మేక మాంసముచే ఆరు మాసములు కూర్మమాంసముచే ఏడుమాసములు, వరాహమాం సముచే ఎనిమిది మాసములు మేషమాంసముచే తొమ్మిది మాసము, మహిష - పర్వత శృగాలమాంసములచే పది మాసములు, గోక్షీర - పాయసము చే సంవత్సరము తృప్తి కలుగును వర్ధినసమాంసముచే పండెండు సంవత్సరము పాలు తృప్తి కలుగును. ఖడ్గమృగమాంసము, కాలశాకము, లోహితచ్చాగలము, మధువు మహాశల్కము వర్షకాలమున మహశాద్ధము ఇవి ఆక్షయతృప్తి నిచ్చును.
మంత్రపాఠము చేయువాడు, అగ్నిహోత్రి, శాఖాధ్యయనము చేయువాడు, షడంగ వేత్త , త్రిణాచికేతుడు, త్రిమధువు ధర్మ ద్రోణము పఠించువాడు, త్రిసుపర్ణ.” బృహల్సామములు తెలిసినవాడు, ఇట్టి బ్రాహ్మణులు పంక్తి పావనులు. ఇపుడు కామ్య శ్రాద్ధకల్పమును గూర్చి చెప్పెదను. ప్రతిపత్తునంద శ్రాద్ధము చేయుటచే ఆధికముగ ధనము లభించన. ద్వితీయయందు శేషశ్రీ, చతుర్ధియందు ధర్మకామములు, పంచమినాడు పుత్రుడు, షష్టియందు శ్రేషత్వము, సప్త మినాడు వ్యవసాయములో లారమ, అష్టమినాడు ధనమ్మా నవమినాడు గుజములు మొదలగు ఒక డెక్క గల మృగములు, దశమినాడు గోసముదాయమ ఏకాదశినాడు పరివారము, ద్వాదశినాడు ధనధాన్యవృద్ధి, త్రయోదశినాడు స్వీయజాతి శ్రేష్ఠత్వము లభించును. చతుర్దశి యందు శస్త్రహతులకు మాత్రమే శ్రాద్ధము పెట్టవచ్చును. దశార్ణదేశమునం దుండెడు ఏడుగురు వ్యాధులు, కాలంజరగిరిపై మృగములుగాను, శరద్వీపమునందు చక్రవాకములుగాను, మానససరోవరమునందు, హంసలుగాను, అయిరి. వారే ఇపుడు కురుక్షేత్రమునందు వేదపారగతు లైన బ్రాహ్మణు లైరి. వారు చాలా దూరము దాటివేసినారు. మీరు వారికంటె చాల వెనుకబడి కష్టపడుచున్నారు. శ్రాద్దసమయపాలన దీనిని చదువుటచే శ్రాద్దము పరిపూర్ణమై బ్రహ్మలోకము నిచ్చును. పితామహుడు జీవించి యున్నచో పుత్రాదులు తమ తండ్రికిని, పితామహుని తండ్రికిని, ఆతని తండ్రికిని అద్దము పెట్ట వలెను. ప్రపితామహుడు జీవించియున్న చో పితృ-పితామహ-వృద్ధప్రపితామహులకు శ్రాద్ధము పెట్టవలెను. మాతృమాతామహాదిగ్రాద్ధము విషయమునందు గూడ ఇట్లే చేయవలెను. ఈ శ్రాద్ధకల్పమును పఠించువానికి, శ్రాద్ధవలము లభించును. ఉత్త మతీర్థములందును, యుగాది-మన్వాదితిథులందును చేసిన శ్రాద్ధము అక్షయము. ఆశ్వినశుక్ల నవమి, కార్తి క ద్వాదశి, మామ-భాద్రపదతృతీయలు, పాల్గునఅమావాస్య, పౌషశుక్లైకాదశి; ఆషాఢదశమి, మామసప్తమి, శ్రావణకృష్ణాష్టమి, ఆషాడ. కార్తిక.ఫాల్గున-జ్యేష్ఠపూర్ణిమలు. ఈ తిథులు స్వాయంభువాదిమనువులకు సంబంధించినవి. వీటి ఆది భాగమునందు చేసిన శ్రాద్ధము అక్షయ మగును. గయా-ప్రయాగ గంగాకురుక్షేత్ర-నర్మదా-శ్రీపర్వత ప్రభాసశాలగ్రామతీర్థ -కాశీగోదావరి- లీపురుషోత్త మషేత్రాదులలో చేసిన శ్రాద్ధము ఉత్త మము.
అగ్ని మహాపురాణమునందు శ్రాద్ధకల్పవర్ణన మను నూటపదునేడవ అధ్యాయము సమాప్తము.
