అగ్ని మహా పురాణము

Table of Contents

129 - అథార్ఘకాణ్డమ్.

ఈశ్వరవాచః

పరమేశ్వరుడు పలికేను : వస్తువుల మూల్యమును (అల్పత్వాధికత్వముల) గూర్చి చెప్పెదను, భూతలవంపై ఉల్కాపాతము, భూకంపము, వజ్రపాతము, చంద్రసూర్యగ్రహణములు, దిక్కులందు ఆధికముగ వేడి కలుగు నపుడు ఈ విషయమును ప్రత్యేకమాసమునందును పరిశీలించవలెను. పైన చెప్పిన లక్షణములలో ఏ దైన లక్షణము చైత్రమునం దైనచో అలంకారసామగ్రిని (వెండి, బంగారము మొ!!) సంగ్రహించుకొనవలెను. ఆరు మాసముల తరువాత ఆవి నాలుగు రెట్ల మూల్యమునకు అమ్ముడుపోవును. వైశాఖమునం దైనచో వస్త్ర-ధాన్య-సువర్ణ-మృతాదులను సంగ్రహించుకొనవలెను ఎనిమిదవ మాసమున ఆరు రెట్ల మూల్యమునకు అమ్ముడుపోవును. జ్యేష్ఠాషాఢములం దైనచో యవలు, గోధుమలు, ధాన్యము సంగ్రహించు కొనవలెను. శ్రావణమునం దైనచో మృతతై లాదరస పదార్థములను సంగ్రహించవలెను. ఆశ్వయజ మాసముం దైనచో వస్త్రములు, ధాన్యము సంగ్రహించవలెను. కార్తిక మునం దైనచో అన్ని విధముల అన్నమును కొని ఉంచుకొనవలెను. మార్గశిర పుష్యముం దైనచో కుంకుమము వలనను సుగంధపదార్థముల వలనను లాభము వచ్చును. మాఘమునం దైనచో ధాన్యము వలన లాభము కలుగును. ఫాల్గునమునం దైనచో సుగంధపదార్ధముల వలన లాభము కలుగును. లాభము వచ్చు ఆవధి ఆరు ఎనిమిదిమాసము లని గ్రహించవలెను.

అగ్ని మహాపురాణమునందు అర్ఘకాండ మను నూటఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.