అగ్ని మహా పురాణము

Table of Contents

77 - అథ కపిలాపూజాది విధానమ్

నమః హం సోమాయ నమః, ఓం హం సూర్యాయ నమః, ఓం హం బృహస్పతయే నమః, ఓం హాం ప్రజాపతయే నమః, ఓం హాం సర్వేభ్యో దేవేభ్యో నమః, ఓం హం సర్వవిశ్వేభ్యో నమః, ఓం హం అగ్నయే స్విష్టకృతే నమః” అను ఎనిమిది మంత్రములతో ఎనమండుగురు దేవతలను పూజించవలెను. పిదప ఈ మంత్రముల చివర “స్వాహా చేర్చి ఒక్కొక్క ఆహుతి ఇచ్చి, అపరాధములను క్షమింపు డని ప్రార్థించి అందరిని విసర్జన చేయవలెను.

పొయ్యికి కుడిప్రక్క “ధర్మాయ నమః” అను మంత్రముతో ధర్మమును, ఎడమప్రక్క “అధర్మాయ నమః” అను మంత్రముతో అధర్మమును పూజించవలెను. గంజి మొదలగునవి పోయుట కషయోగించు పాత్రలందును, జలము నుంచు మటాదులందును “ఓం రసపరివర్తమానాయ వరుణాయ నమః” అను మంత్రముతో వరుణుని, వంటింటిద్వారమున అవిఘ్న రాజాయ నమః” అని విఘ్నేశ్వరుని, తిరుగలి పై “సుభగాయై నమః” అని సుథగను, రోటియందు “రౌద్రికే గిరికే నమః” అను మంత్రముచే రౌద్రికా-గిరికలను, రోకలియందు “బలప్రియాయుధాయ నమః” అను మంత్రముతో బలిరాముని ఆయుధ మును పూజించవలెను.

చీపురు పైన పూర్వోక్త దేవతలను (రౌద్రికాగిరికలను), శయ్య పై కామదేవుని, మధ్యనున్న స్తంభముపై స్కందుని పూజింపవలెను. పిమ్మట వ్రతపాలనము చేయు సాధకుడును, పురోహితుడును వాస్తుదేవతకు బలి సమర్పించి, బంగారు పాత్రలో గాని, లేదా తామరాకులలో గాని భోజనము చేయవలెను. మట్టి, రావి, జిల్లేడు, వాతావి! సర్జము, భల్లాతకము ఈ ఆకులలో భోజనము చేయగూడదు. ముందు ఆచమనము చేసి, ప్రాణ మొదలగు శబ్దములకు మొదట “ఓం” కారము చివర “స్వాహా చేర్చి అన్నము ఐదు ఆహుతులు తీసికొని, జఠరాగ్నిని ఉద్దీపము నిసిన పిమ్మట భోజనము చేయవలెను. వాగ--కూర్మ-కృకల-దేవదత్త.లేవంజయములు' ఉపవాయువులు “ఏతేభ్యో నాగాదిభ్య ఉపవాయుభ్యః స్వాహా” అను మంత్రముతో ఆచమనము చేసి, ఆ దులను నివేదసము చేసి, చివర మరల ఆచమనము చేసి “ఓం అమృతోపస్తరణమసి స్వాహా అని చెప్పి, “ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా, ఓం సమానాయ స్వాహా” అను మంత్రములతో పంచ ప్రాణములకుమ పంచాహును తన ముఖమునందు ఈయవలెను. పిమ్మట పూర్తిగా భోజనముచేసి, చుబుకము నీటితో ఆచమనము చేసి, “ఓం అమృతాపిధానమసి స్వాహా” అని చెప్పవలెను. ఈ ఆచమనము శరీరములోపల నున్న అన్న మును ఆచ్చాదించుటకు ఉపయోగించును.

అగ్ని మహాపురాణమునందు కపిలా పూజాది విధాన మను డెబ్బది యేడవ అధ్యాయము సమాప్తము.