అగ్ని మహా పురాణము

Table of Contents

263 - అథోత్పాత శాంతిః

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను : పరశురానూ! ఒక్కొక్క వేదములోనున్న లక్ష్మీవర్ధకమగు శ్రీసూక్తమును తెలియవలెను. “హిరణ్యవర్ణాం హరిణీం” మొదలగు పదునై దు ఋగులు ఋగ్వేదీయ శ్రీసూక్తము. “రథే” (29-43) “అక్షయరాజాయ” (80-18) వాజి (18-34) చతస? (18-32) ఈ సాలుగు మంత్రములును యజుర్వేదీయ శ్రీ సూక్తము. “క్రాంతి యసామ” సామవేదీయ శ్రీసూక్తము. “శ్రీయంధాతర్మయిధేహి” ఇది ఆథర్వవేదీయ శ్రీసూక్తము. భక్తిపూర్వకముగ శ్రీసూక్త జపహోమము చేయువానికి తప్పక లక్ష్మి లభించును. శ్రీదేవి అనుగ్రహమునకై కమలములు, బిల్వములు ఆజ్యము, తిలలు, హోమము చేయవలయును. అన్ని వేదములదును పురుషసూక్తము వున్నది. ఆది సకల కామప్రదమిది. స్నానము చేసి పురుషసూక్తములోని ఒక్కొక్క మంత్రముతో మహా విష్ణువునకు ఒక్కొక్క జలాం జలియు పుష్పమును సమర్పించువాడు తానుపాపరహితుడై ఇతరుల పాపములను కూడ తొలగించును. స్నానము చేసి ఈసూక్తమునందలి ఒక్కొక్క మత్రముతో శ్రీమహావిష్ణుగువకు ఫలమును సమర్పించువాడు సర్వ కామములను పొందును. పురుషసూక్త జపమచే మహా పాతకములు ఉప పాతకములు నశించును. కృఛవ్రతము చేసి పరిశుద్దుడైన వాడు స్నానపూర్వకముగ పురుష సూక్త జప హోమములు చేసినచో సర్వమును పొందును.

పదునెనిమిది శాంతులలో సమస్త ఉత్పాతములను తొలగించు అమృత. ఆథయ, సౌమ్య, అనుమూడు శాంతులు సర్వోత్తమములు. అమృతాశాంతి సర్వదై వత్యము. అభయాశాంతి బ్రహ్మదేవతకము. సౌమ్యాశాంతి సర్వదే వత్యము. వీటిలో ఒక్కొక్కటి కూడ సర్వకామప్రదము. ఓ భృగు శ్రేష్ఠా! అభయశాంతి కొరకై వరణవృక్షము యొక్క మూలముతో మణి చేయవలయును. ఆమృతశాంతికి దూర్వామూల మణిని, సౌమ్యా శాంతికి శంఖమణిని ధరించవలయును. ఆయా శాంతుల దేవతలకు సంబంధించిన మంత్రములతో మణిని సిద్ధము చేసి కట్టవలెను. ఈ శాంతులు దివ్య అంతరిక్ష భౌమ ఉర్చాతములను శమింప చేయును. దివ్య, అంతరిక్ష, భౌమ ములను మూడు విధముల ఆద్భుతములగు ఉత్పాతములను చెప్పెదను వినుమా. గహనుక్షత్రముల వికారములచే కలుగు ఉత్పాతములు దివ్యములు. అంతరిక్షత్పాతములను వినుము. ఉల్కాపాతము, దిగ్గాహము, సూర్యుడు గుడి కట్టుక, గంధర్వనగ రము, వికృతమైన వరము ఇవి అంతరిక్ష ఉత్పాతములు. స్థావరములందును జంగమప్రాణులందును కలుగు ఉపద్రవములు, భూకంపము, ఇవిభూమితోత్పాతములు. ఈ ఉత్పాతములు కనబడిన తరువాత ఒక వార ములో పునఃవర్షము పడినచో ఆ అద్భుతము నిష్ఫలమగును. మూడు సంవత్సరముంవరకు ఈ ఆద్బుతోత్పాతమునకు శాంతిచేసుకున్న చో ఆది లోకమునకు భయావహము. దేవతా ప్రతిమలు నాట్యమాడుట, కదలుట, మండుట, శబ్దము చేయుట, ఏడ్చుట, చెమట పట్టుట, నవ్వుట మొదలగు వికారములు కనబడినచో ఆ దేవతలను పూజించి ప్రాజాపత్య హోమము చేయవలయును, ఏరాష్ట్రము నందు అంటించకుండగ నే ఆగ్ని ఘోర శబ్దముతో ప్రజ్వలించినదో ఆ రాష్ట్రము రారిచే పీడింపబడును.

భృగునందనా ! ఇట్టి ఆగ్ని వికారశాంతికి అగ్ని దైవత్యములగు మంత్రములలో హోమము చేయవలయును. వృక్షములు ఫలములిచ్చినను, వాటినుండి పాలు, రక్తము కారినను ఆది వృక్షజనీత భౌమోల్పాతము. అపుడు శివుని హౌజించి ఉత్పాతములకు శాంతి చేయవలయును. ఆతి వృష్టి, అనావృష్టి రెండును దుర్బిక్షకారణములు. వర్ష ఋతువుకాని ఋతువులో మూడు దినములు నిరంతర వృష్టి కలిగినచో ఆదిభయజనకము, పర్జన్య, చంద్ర సూర్యులను పూజించుటచే ఈ వర్షవికారము నశించును. ఒక నగరము నుండి నదులు, దూరమై పోయినను దగ్గరకు వచ్చినను, అందలి సరోవర మూలు ప్రవాహములు ఎండిపోయినను ఈజలాశయ వికారమును తొలగించుటకు వారుణ మంత్రము జపించవలెను. స్త్రీలు అసమయమున ప్రసవించినను, సమయమున ప్రసవించకున్నను వికృతమైన గర్బముకన్నను, కవల పిల్లలు మొదలగు వారిని కన్నను ఈ ప్రసవవికారమను తొలగించుటకు పతి వత లైన స్త్రీలను, బ్రాహ్మణాదులను పూజించవలెను. గుఱముగాని, ఏనుగుగాని, ఆవుగాని, రెండు పిల్లలుకన్నను, వికృతమైన విజాతీయ సంతాసమును కన్న ను ఆరుమాసము లకోపన మరణించినను వికృత గర్భము కన్నను ఆరాజ్యమునకు శత్రువులనుండి భయము కలుగును. ఈ ఉత్పాతమును శాంతింపచేయుటకై హోమము జపము ! బ్రాహ్మణ పూజ చేయవలెను. ఆయోగ్యమైన పశువులు బండి కట్టినను, యోగ్య పశువులు బండిలాగకున్నను, ఆకా మున తూర్యనాదము వినబడినను మహాభయము వచ్చును. వన్య పశుపక్షులు గ్రామ ములో ప్రవేశించినను గ్రామ్య పశువులు వనములోనికి వెళ్ళిపోయినను స్థలచరములు జలములో ప్రవేశించినను, జలచరములు స్థలము పైకి వచ్చినను రాజ ద్వారాది సమీపమునకు నక్కలు వచ్చినను, ప్రదోష కాలమున కోడికూసినను, సూర్యోదయ సమయమున వక్కలు ఆరచినను, పావురములు, ఇంటిలో దూరినను మాంసము తిను పక్షులు తలపై తిరిగినను, సామాన్యపు ఈగ తేనె కూర్చివను కాకులు మైథునము చేయుచుండగ కనబడినను దృడమైన ప్రాసాదములు తోరణములు, ఉద్యానములు, ద్వారములు, ప్రాకారములు, భవనములు, ఆకారణమగ పడిపోయినను రాజు మరణించును. పరాగముగాని, ధూమము గాని, పదిదిక్కుల నిండి పోయినను కేతువు ఉదయించినను. గహణము వచ్చినను, సూర్యచంద్రబింబముల మధ్యరంధ్రము కనబడివను ఇవి గహనక్షత వికారములు. ఇవి ఎచట కనబడునో అచట రయమును సూచించును. ఆగ్ని మండక పోయిను, ఉదక కుంభము అకారణముగ కారినను ఈ ఉత్పాతములకు ఫలితముగ మరణము, భయము, మహా మారి, మొదలగునవి కలుగును. బాహ్మణులను దేవతలను పూజించుటచేతను, జపహోమముల చేతను, ఈ ఉత్పాతములు శాంతించును.

ఆగ్నిమహాపురాణమున ఉత్పాతశాంతికథనమను రెండువందల ఆరువది మూడవ అధ్యాయము సమాప్తము