అగ్ని మహా పురాణము
38 - అథ దేవాలయ నిర్మాణఫలమ్
అగ్ని దేవుడు చెప్పేను :- మునీశ్వరా! వాసుదేవాదులకొరకు దేవాలయమును చేయించుటచే కలుగు ఫలమును చెప్పుచున్నాను. దేవాలయములు కట్టవలే ననియు, తటాకాదులు నిర్మింపవలెననియుకలిగిన శుభసంకల్పము అట్టి సంకల్పము కలవాని వేల కొలది జన్మల పాపములను నశింపచేయును. భావన చేతనైన దేవాలయనిర్మాణము చేసినవాని అనేక జన్మల పాపములు తొలగిపోవును. ఎవరైన దేవమందిరాదులు. గట్టుచున్నపుడు దానిని ఆమోదించినవారు కూడ సమస్తపాపములు తొలగి విష్ణులోకమును పొందుదురు. శ్రీమహావిష్ణువునకు ఆలయము నిర్మించినవారు భూతకాలము ఎందలి వేయి తరములవారిని భవిష్యత్తులోని వేయి తరములవారిని విష్ణులోక నివాసార్డులనుగ చేయును. శ్రీకృష్ణుని ఆలయమును నిర్మించినవాని పితరులు వెంటనే నరకదుఃఖమునుండి విముక్తులై . దివ్యవసాభరణాదులు ధరించి ఆనందముతో విష్ణులోకమున నివసింతురు. దేవాలయనిర్మాణము బ్రహ్మహత్యాదిపాపములను తొలగించులు. యజ్ఞము చేతనవలన కలుగని ఫలములు గూడ దేవాలయనిర్మాణముచే కలుగును. దేవాలయనిర్మాణమువలన సమ స్తతీర్థములందును, స్నానము చేసిన ఫలము కలుగును.
దేవతాబ్రాహ్మణాదుల రక్షణము నిమిత్తము రణభూమిలో ప్రాణత్యాగము చేసిన వీరునకు ఏ ఫలము లభించునో ఆ ఫలము దేవాఃయనిర్మాణము చేయువానికి లభించును. లోభముచే మట్టితో దేవాలయము కట్టించినవానికి గూడ స్వర్గముగాని దివ్యలోకము గాని లభించును. ఏకాయతన దేవాలయము. ఒకే దేవతా విగ్రహమునకై ఒక గది గల ఆలయము నిర్మించినవాడు స్వర్గమును పొందును. త్యాయతనదేవాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకములో నివసించును. పంచాయతనదేవాలయమును నిర్మించినవాడు. శివలోకమును చేరును, అష్టాయతనమందిరము నిర్మించిన వాడు. శ్రీహరిసానిధ్యము నం దుండును. షోడశాయతనదేవాలయ నిర్మాణము చేసినవాడు భోగమును, మోక్షమును కూడా పొందును. శ్రీహరి దేవాలయములలో కనిష్టము, మధ్యమము, శ్రేష్టము అను మూడు శ్రేణు లున్నవి. వీటి నిర్మాణము వలన క్రమముగ స్వర్గలోక - విష్ణులోక - మోక్షములు ప్రాప్తించును. ధనవంతుడు శ్రేషశ్రేణికి చెందిన విష్ణ్వాలయమును నిర్మించుటచే ఎట్టి ఫలితమును పొందునో ఆ ఫలితమునే కనిష్ట శ్రేణికి చెందిన దేవాలయమును నిర్మించిన నిర్దనుడు పొందును. తాను సంపాదించిన ధనములో స్వల్పధనమును మాత్రమే వెచ్చించి దేవాలయమును నిర్మించినను భక్తుడు అధిక మగు పుణ్యమును, భగవంతుని అనుగ్రహమును పొందును. ఒక లక్షగాని, ఒక వెయ్యి గానీ, నూరు గాని, దానిలో సగము గాని ముద్రలను వెచ్చించి విష్ణునుందిర మును నిర్మించువాడు శ్రీ మహావిష్ణులోకమును చేరును.
బాల్యమునందు ఆట లాడుచు మట్టితో విష్ణ్వాలయమును నిర్మించినవారు కూడ విష్ణులోకమును చేరుదురు. తీర్థములందు, పవిత్రస్థానములందు, సిద్ధ క్షేత్రములందు, ఆశ్రయములందు విష్ణ్వాలయము నిర్మించువారికి ఇతర ప్రదేశము లందు నిర్మించువారికంటే మూడు రెట్లు ఎక్కువ ఫలము లభించును., విష్ణ్వాలయమునకు వెల్లివేసినవారును, దానిపై బంధూకపుష్పముల చిత్రములు వేసినవారును విష్ణులోక మును పొందుదురు. కూలిపోయిన లేదా కూలిపోవుచున్న లేదా సగము కూలిపోయిన దేవాలయమును జీర్ణోద్దారణము చేసినవానికి కొత్తదేవాలయము నిర్మించినవానీకంటే రెట్టింపు ఫలము లభించును. కూలిపోయిన విష్ణ్వాయమును మరం నిర్మించి రక్షించినవాడు, సాక్షాత్ భగవత్స్వరూపుడు. భగవంతుని ఆలయమునందు ఇటుకలు ఎంతకాల ముండునో అంతవరకును, వాటిని నిర్మించినవాడు, తన కులముతో కూడ, విష్ణులోకములో నుండును. ఇహలోకమునందును, పరలోకమునందును గూడ ఆతడే పూజనీ ముడు; ఆతడే పుణ్యవంతుడు.
శ్రీకృష్ణునకు ఆలయము కట్టించిన పుణ్యాత్ముడే పుట్టినవారిలో లెక్క. ఆతడే తన వంశమును రక్షించువాడు. విష్ణు-శివ-సూర్య-దేవ్యాదులకు ఆలయమును నిర్మించువాడే ఈ లోకమునందు కీర్తి పొందును. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనమును, శ్రీకృష్ణాలయమును నిర్మించుటకు వినియోగింపక, కేవలము దానిని రక్షించుచుండు మూర్జునకు దానివల్ల ఏమి ప్రయోజనము కలుగును? పితరులు, బ్రాహ్మణులు, దేవతలు. వీరికై తన ధనమును వినియోగించని వాని ధనము, బంధువులకు ఉపకరించని వాని ధనము వ్యర్థము. దానమునకు గాని, భోగమునకు గాని, ధర్మాచరణమునకు గాని, కీర్తికొరకు గాని ఉపకరించని ధనమునకు స్వామి. అయి ఏమి ప్రయోజనము? అందుచే పూర్వజన్మాదృష్టముచేత గాని, పురుషప్రయత్నముచేత గాని, మరి ఏఉపాయాంతరముచేత గాని లభించిన ధనమును ఉత్తమబ్రాహ్మణులకు దానము చేయవలెను; స్థిరకీర్తి లభించుటకు ఉపయోగించవలెను. దానకీర్త్యాదులకంటె గూడ దేవాలయనిర్మాణము ఉత్తమ మైనది గాన ఐదీమంతుడు విష్ణ్వాదిదేవతకు ఆయములు కట్టించవలెను. భక్తిమంతుడగు పురుషుడు దేవాలయమును నిర్మించి, దానిలో దేవతాప్రతిష్ట చేసినా డనగా, ఆతడు చరాచరరూపమంగు ముల్లోకములకును భవనమునిర్మించినా డని యర్థము. భూతవర్తమాన భవిష్యత్కాలములకు చెందిన స్థూల సూక్ష్మరూపము. తద్భిన్నము అయిన బ్రహ్మాది స్తంభాంత మగు ప్రపంచ మంతయు మహావిష్ణువునుండియే జనించినది. దేవాధిదేవుడును, సర్వవ్యాపకుడుమ, మహాత్ముడును అగు అట్టి విష్ణువునకు ఆలయమును నిర్మించినవాడు మరల ఈ సంసారమునందు జనింపడు. శివ-బ్రహ్మ-సూర్య-గణేశ-దుర్గా-లక్ష్మ్యాదిదేవతలకు ఆలయమును నిర్మించినవారికి గూడ విష్ణ్వాలయమును నిర్మించినవారికి లభించు ఫలము లభించును. దేవతాప్రతిమను నిర్మింపచేసినవారికి ఆలయనిర్మాణము చేయించినవారికంటె గూడ అధికఫలము లభించును. దేవతాప్రతిమా స్థాపనరూప మగు యజ్ఞమువలన లభించు ఫలము అనంతము. మట్టితో చేసిన ప్రతిమకంటే కట్టితో చేసిన ప్రతిమ ఉత్తమ మైనది. దానికంటే ఇటుకలతో నిర్మించినది, దానికంటె జాయితో నిర్మించినది, దానికంటె సువర్ణావిలోహములతో నిర్మించినది శేషమైనది, దేవాలయ ప్రారంభము చేసినంతమాత్రముననే ఏడు జన్మల పాపము నశించును. నిర్మించువాడు స్వర్గలోక ప్రాప్తికి అధికారి యగును. అతడు నరకమునకు వెళ్ళడు. ఆంతే కాదు-ఆతడు తన వంశములోని నూరు తరములవారిని విష్ణులోకమునకు పంపును. యమధర్మరాజు తన దూతలతో, దేవాలయములు నిర్మించువారిని గూర్చి ఇట్లు చెప్పేను.
యమధర్మరాజు చెప్పెను : “దేవప్రతిమా నిర్మాణముచేసినవారిని, దానికి పూజలు సలిపిన వారిని మీరు వరకమునకు, తీసికొనిరాకూడదు. దేవాలయాదులను నిర్మింపనివారిని మాత్రమే తీసికొనిరావలెను. మీరందరు లోకములలో సంచరించుచు నా ఆజ్ఞను పాలింవుడు. ప్రపంచమునందలి ఏ ప్రాణియు మీ ఆజ్ఞను ధిక్కరింపజాలడు. జగత్పిత యైన ఆనంతుని శరణుజొచ్చినవారిని మాత్రము మీరు విడచివేయవలెను. వారికీ లోకములో నివాసము ఉండదు. భగవంతునిపై చిత్తములగ్నము చేసి, భగవంతుని శరణుజొచ్చినభగవద్భక్తులగు మహాత్ములను, సదా విష్ణుపూజ చేయువారిని మీరు విడిచివేయవలెమ.నించినపుడు గాని, నిద్రించినపుడు గాని, నడచునపుడు గాని, అన్ని వేళ లందును శ్రీకృష్ణనామ స్మ రణము చేయువారి దరికి పోవలదు. నిత్యనైమిత్తిక కర్మల ద్వారా జనార్ధనుని పూజ చేయువారి వైపు కన్నెత్తి యైనను చూడవలదు. అట్టి భగవద్ర్వతశీలులు భగవంతునే చేరుదురు.
పుష్పములు, ధూపము, వస్త్రములు మొదలగు అలంకారములను సమర్పించి భగవంతుని పూజ చేయువారి జాడలకు పోవలదు. వారు శ్రీకృష్ణుని చేరినవారు. దేవాలయములందు అలికి ముగ్గులు వేయువారి పుత్రులను, వంశీయులను కూడ విడిచివేయవలెను. విష్ణ్వాలయమును నిర్మించినవారి వంశములో నూరు తరములవరకును మీరెవ్వరిని దుష్టభావముతో చూడరాదు. కట్లతో గాని, మట్టితో గాని, తాతితో గానీ విష్ణువునకు ఆలయము కట్టించినవాడు సమస్తపాపనిర్ముక్తు డగును. ప్రతిదినము యజ్ఞములు చేసి భగవదారాధన చేయువానికి లభించు ఫలమే విష్ణ్వాలయము నిర్మించినవానికి గూడ కలుగును. విష్ణ్వాలయము కట్టించినవాడు తన వంశము నందలి వెనుకటి నూరుగురిని, రాబోవు నూరుగురిని విష్ణులోకమునకు పంపును. మహావిష్ణువు సప్తలోకమయుడు. ఆట్టి విష్ణుమూర్తికి ఆలయము కట్టించువాడు తన వంశమును తరింపచేయును. తన వంశీయులకు అక్షయపుణ్యలోక ప్రాప్తి కలుగునట్లు చేయును. తాను కూడ అక్షయలోకములను పొందును. దేవాలయములోని ఇటుకల కట్టుబడి ఎన్ని సంవత్సరము లుండునో అన్ని వేల సంవత్సరములపాటు ఆ దేవాలయ నిర్మాత స్వర్గలోకములో నుండును. భగవత్పతిమ నిర్మించినవాడు విష్ణులోకము చేరును. దానిని స్థాపించినవాడు భగవంతునిలో లీనమగును. దేవాలయము నిర్మించు దానిలో ప్రతి మాస్థాపన చేసినవాడు సర్వదా విష్ణుకోకములో నివసించును”.
అగ్నిదేవుడు పలికేను : యమధర్మరాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారము, యమదూతలు విష్ణుస్థాపనాదిపుణ్య కార్యములు చేసినవారిని యమలోకమునకు తీసికొనివెళ్ళరు. దేవాలయాదిప్రతిష్టాదివిధానమును గూర్చి హయగ్రీవుడు బ్రహ్మతో వర్ణించి చెప్పెను.
అగ్ని మహాపురాణము నందలి దేవాలయనిర్మాణమాహాత్మ్యాదివర్ణన మను ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.
