అగ్ని మహా పురాణము

Table of Contents

319 - అథ వాగీశ్వరీ పూజా

ఈశ్వర ఉవాచః-

శివుడు చెప్పెను. ఇపుడు మండలసహిత వాగీశ్వరీ పూజా విధానమును చెప్పెదను.  ఊకారమును మాతో చేర్చి దానికి అనుస్వారము చేర్చినచో, “మాం” యను ఏకాక్షర మత్రము ఏర్పడును. నిషాదము పై “ఈ” చేర్చి దాని బిందు విసర్గయుక్తము చేయవలయును. ఈ ఏకాక్షర మంత్రము అందరికిని ఉపదేశించరాదు. వాగీశ్వరీదేవిని ఈ విధ ముగా ధ్యానించవలెను. దేవి శరీర కాంతి చంద్ర కుంద కుసుమముల వలె వుండును. ఏబది అక్షరముల మాలామయ మగు రూపము ధరించి యుండును. ముత్యాల హారములు శ్వేత పుష్పహారములు ధరించి యుండును. త్రినేత్రియగు ఆమె హస్తములలో వరుసగ వరద, అభయ, ఆక్ష మాల, పుస్తకములు, శోభించు చుండును. ఇట్లు ధ్యానించి పైన చెప్పిన ఏకాక్షర మంత్రము ఒక లక్ష జపించవలెను. పాదముల నుండి మస్తకము వరకు లేదా స్కందము వరకు అకారాదిక్ష కారాంతమగు వర్ణమాలను ఆమె ధరించి యున్నట్లు భావన చేయవలెను. గురువు మంత్రోపదేశము చేయుటకు దీక్షార్థమై ఒక మండలము ఏర్పరుపవలయును. ఆది సూర్యాగ్రమై ఇందు విభ క్తమై యుండవలెను. రెండు, భాగమలండ కమలము ఏర్పరుపవలేను. ఆ కమలము సాధకువకు హితకరమగును. పిదప వీథిపాదిక ఏర్పరచి నాలుగు పదములండు కమలము లను వాటి బాహ్య భాగమున వీథి పదిక లను నిర్మించవలేను. రెండేసి పదములతో ఒక్కొక్క దిక్కు యందు ద్వారము లను ఉపద్వారములను నిర్మించవలెను. కోణములందు రెండేసి పట్టిక లు నిర్మించవలెమ. తొమ్మిది కమలములను శ్వేత వర్ణములుగా చేసి కర్ణిక పై బంగారు రంగుగల చూర్ణము చల్లి పచ్చగాను కేసరములను వివిధ వర్ణములు గను కోణములను రక్తవర్ణములుగను చేయవలెను. వ్యోమరేఖాంతరము కృష్ణ వర్ణముగా చేసి ద్వార ముల మానము ఇంద్ర గజమానమును అనుసరించి వుండునట్లు చేయవలెను. మధ్య కమలమున సరస్వతివి, సర్వ కమలమున వాగీశినీ ఆగ్నేయాది విదిక్కుల క్రమమున హృల్లేఖా చిత్రవాగీశి, గాయత్రి విశ్వరూప శాంకరీ మతిధృతులను స్థాపించి పూజించవలెను. నామ ప్రారం భము హీం చేర్చి వామాద్యక్షరమును బీజరూపమున ఉచ్చరించి పూజించ వలెను. సరస్వతినే వాగీశ్వరీ రూపమున ధ్యానించ వలేను. కపిల ఘృతముతో హోమము చేయవలెను. ఇట్లు చేసిన వాడు సంస్కృత ప్రాకృత భాషలలో, కావ్యరచన చేయు కవియగును. కావ్యశాస్త్ర విద్వాంసుడగును.

అగ్ని మహాపురాణమున వాగీశ్వరి పూజా విధానమను మూడువందల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.