అగ్ని మహా పురాణము

Table of Contents

324 - అథ రుద్ర శాంతిః

ఈశ్వర ఉవాచః-

పరమేశ్వరుడు చెప్పెను. ఇపుడు కల్పా ఘోర శివకాంతిని చేప్పెదను. అఘోర శివుడు ఏడు కోట్ల గణములకు ఆధిపతి బ్రహ్మహత్యాది పాపములను నశింపచేయును. ఉత్త మాధమ సిద్దును ఇచ్చువాడు సమస్త రోగములను తొలగించును. భౌమ దివ్య ఆంతరిక్ష ఉత్పాతములను మర్ధించును. విషగ్రహ పిశాచములను కూడ మీంగీ వేసి సకల కామము లను పూరించును. పాప పీడలను తొలగించుటకు దుర్బాగ్య దుఃఖ వినాశకమగు ప్రజల ప్రాయశ్చిత్తరూపుడు. ఏకవీర మును సర్వాంగ న్యాసము చేసి సర్వదా పంచముఖ ధ్యానము చేయవలెను. శాంతిక పౌష్టికములందు శివుడు శుక్ల వర్ణుడు వశి కరణమున రక్త వర్ణుడు స్తంభన కర్మగుందు పీతవర్ణుడు. ఉచ్చాటన మారణ కర్మలందు ధూమ వర్ణుడు ఆకర్షణమున కృష్ణవర్ణుడు మోహన కర్మయందు కపిల వర్ణుడు ముప్పది రెండు అక్షరములు వేదోక్తములగు ఆఘోర శివుని రూపము అందుచే ఆట్టి ఆ ఘోర శివుని పూజించవలేను ఈ మంత్రమును ముప్పది లక్షల జపము చేసి గుగ్గులు మిశ్ర మృతముతో దశాంశ హోమము చేసినచో, సాధకుడు మంత్ర సిద్ధి పొంది సిద్ధార్థుడగును అతడన్నియు సాధించగలడు. అఘోర మంత్రమును మించి భుక్తి ముక్తి పదమగు మరియొక మతములేదు. దీనిని జపించుటచే అబహ్మ చారి బ్రహ్మచారి యగును. ఆస్నాతకు స్నాతకుడగును. అఘోరాస్త్రము అఘోర మంత్రము ఈ రెండును మంత్రరాజములు ఏఒక్క దాని నైనను జప హోమార్చనములందు వినియోగించినచో యుద్ధము నందు శత్రు సైన్యమును నశింపచేయవచ్చును.

ఇపుడు సర్వార్థ సాధకమగు మంగళకరమైన రుద్రశాంతిని చేప్పెదను, పుత్రపాప్తి గ్రహ బాధా నివారణ విష వ్యాధుల వినాశము దుర్భిక్ష మహామారి శాంతి దుస్స్వప్న నివారణము బల రాజ్యాది ప్రాప్తి రివు విదాశనము వీటిని సాధించుటకు రుద్రశాంతిని ప్రయోగించవలెను. వృక్షము అకాలమున ఫలించినను సమస్త గ్రహబాధలను తొలగించుటకును కూడ దీనిని ప్రయోగించవలెను. పూజనమునందు మంత్రాంతమున నమః చేర్చవలెను. హోమమునందు స్వాహా చేర్చవలేను. తృప్తి యందు వషట్ పుష్టికరము యందు నౌషట్ చేర్చవలెను. మంత్రము నందు రెండు చోట చ వున్న చోట ఆవశ్య కతాను సారముగ “నమః” స్వాహా మొదలు జాతి యోగములు చేయవలెను. “ఓం రుద్రాయ” మొదలు “అవికృత రూపాయ” వరకును మూలో క్తము రుద్ర శాంతి మంత్రము. ఉత్తరపర్తి కమల దళమున నియతి తత్వము. పశ్చిమ కమల దళ మన తొలతత్వము నే ఋతి దశమన మాయాతత్వము వుండును వీటి యందు దేవతలను పూజించవలెను. ఏక పింగళాయ శివతపింగళాయ కృష్ణపింగళాయ, మధుపింగళాయ, మధుపింగళాయ నమః యని నియతితత్త్వమునందు పూజించవలెను. అనం లాయ ఆర్థాయ శుషాయపయో గణాయయని కాలతత్వమునందు కరాళాయ వికరాళయయని మాయాతత్వము నందు పూజి చవలెను. దక్షిణ దళము నందున్న విద్యాత త్వమన “సహస్ర శీరాయ” మొదలు “సహస్ర లింగాయ” వర కుచెప్పి పూజించ వలెను. అచటనే ఏక జటాయ మొదలు షడుద్రాయ వరకును షడ్విధ రుద్రుల పూజ చేయవలెను. ఆగ్నేయ దళమున వున్న ఈ శతత్వమున భూత పతయే పశుపతయే ఉమాపతయే కాలాధి పతయే యని చెప్పి పూజ చేయవలెను. పూర్వ దళమున నున్న సదా శివతత్వము నందున్న ఆరువురిని “ఉమాయై” మొదలు “విశ్వేశ్వరాయ నమః” వరకును వున్న మంత్రము లతో పూజించవలెను. కర్ణికలను నున్న శివతత్వము పై ఉమామహేశ్వరుని ఓం వ్యోమ వ్యాపినే మొదలు శివాయ వరకును వున్న మూలో క్త మంత్రముతో పూజించవలేను. శివతత్వమున వ్యోమ వ్యాపి యను పేరు గల శివుని నవ పదముని పూజ చేయవలెను. పిదప యోగ పీఠముపై నున్న శివుని నవ పద యు క్త నామములు చెప్పుచు పూజించవలెను. “శాశ్వతాయ” మొదలు పంచ వక్త్రాయ వరకును వున్న మూలో క్షము మంత్రము. పిదప “సత్” యను పేరు గల పూర్వ దళము నందు “ఆ ఘోర హృదయాయ” మొదలు “జోతీ రూపాయ” వరకును మూలో క మంత్రముతో శివుని పూజించవలెను. ఆగ్నే యము నందున్న ఈ శతత్వము నందును దక్షిణము నందున్న విద్యాతత్వము నందును “పర మేశ్వరాయ” మొదలు “తేజ” వర కును వున్న మూలోక్త మంత్రముతో పరమేశ్వరుని పూజించవలెను. నై ఋతి యందున్న కాలతత్త్వము నందును పశ్చిమ దిక్కు నందున్న కాలతత్వము నందును “ఓం ధ్రు ధ్రు” మొదలు “సుఖప్రద” వరకును వున్న మూలోక్త మంత్ర ముతో పూజించవలేను. వాయవ్య ఉత్తరదళములందున్న నియతి పురుషులను సర్వసాన్ని ధ్యకర” మొదలు “నమోన్నమః” వరకును వున్న మూలోక్త మంత్రముతో పూజ చేయవలెను. ఈశాన్యము నందున ప్రాకృత తత్త్వము నందు కూడ జప హోమములు చేయవలెను. ఈ రుద్ర శాంతి గ్రహ బాధను రోగాది త్రివిధ పీడలను నశింప చేయును.

ఆగ్ని మహా పురాణమున రుద్ర శాంతి వర్ణన మను మూడు వందల ఇరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.