అగ్ని మహా పురాణము

Table of Contents

362 - అథ నానార్థ వర్గః

 అగ్ని రువాచః

అగ్ని పలికెను. “నాకః = ఆకాశము, స్వర్గము, “లోకః = లోకము, జనులు, శ్లోకః” = పద్యము, కీర్తి, “సాయక” = బాణము, ఖడ్గము, “ఆనక” = పటహము, ఖేరి. “కలంక” = మచ్చ, ఆపవాదము “కః” = (పుం) = వాయువు, బ్రహ్మ, సూర్యుడు, కం = (వ) = శిరస్సు, జలము. “పలాకః” = తుచ్చ ధాన్యము, సంపమ, అన్నపు మెరుకు, “కౌశికః” = మహేంద్రుడు, గుగ్గులు, గుడ్లగూబ, పాములపాడు, “శలా వృకః” = వానరము, శునకము, “మానమ్” = కొలుచు సాధనము. “సర్గః” = స్వభావము, నిరోషము, నిశ్చయము, ఆధ్యాయము, సృష్టి, “యోగి” = కట్టుట, ఉపాయము, ధ్యానము. సంగతి, యుక్తి, “భోగః” = సుఖము, వేశ్యా లను, మొదలగు వారికి ఇచ్చుకృతి “అబ్దః” = శంఖము, చంద్రుడు, “కరట!” = కాకి, ఏనుగు గండస్థలము “శిపివిష్టః” = దుష్ట చర్మకలవాడు, ఊరిష్టం” = క్షేమము, ఆశు కము, అభావవ, “ఆరిష్టం” = శుభము, అశుభము “వ్యష్టిః” = ప్రభా తము, సమృద్ధి “దృష్టిః” = జ్ఞానము, నేత్రము, దర్శవము “నిష్ణా= నిష్పత్తి , నాశము, అంతము “కాష్ఠ” = ఉత్కర్షము, స్థితి, దిక్కు, “ఇడా”, “ఇలా” = భూమి, గోవు. “ప్రగాఢః” = ఆత్యంతము, కఠినము, “బాడం” = మిక్కిలి ప్రతిజ్ఞ, “దృఢః” = సమర్థుడు, స్థూలమైనది. “వ్యూఢః” = ఏర్పరుపబడినది. కలిసియున్నది. “కృష్ణః = వ్యాసుడు అర్జునుడు, హరి, “పణః” = జూదా దుల యందు పండెము, భృతి మూల్యము, ధనము, “గుణః” = సారి, గుణము. సత్త్వాదులు, శుక్లాదులు, సంధి మొదలగునవి. “గ్రామణీః” = శ్రేష్ఠుడు, గ్రామాధిపతి. “ఘృణా” = జుగుప్స కరుణ, “తృషా” = ఆసక్తి, దాహము “విపణిః” = వర్తకుల వీథి, “తీక్ష్ణమ్” = విషము, యుద్ధము, లోహము, తీక్షమైనది. అను ఆర్థమున ఇది త్రిలింగము, “ప్రమాణమ్” = హేతువు, మర్యాద, శాస్త్రము, ఇంత ఆను నిశ్చయము. ప్రామాణీకుడు. “కరణమ్” = క్షేత్రము, శరీరము, మొదలగునవి, ఈరిణమ్ = శూన్యము ఊషరక్షేత్రము.

“యంతా” = మావటివాడు, సారథి. “హేతి” = అగ్నిజ్వాల. “శ్రుతమ్” = శాస్త్రి నిర్ణయము, శాస్త్రము. “కృతం” = కృతయుగము, ప్యూ ప్తమ, “ప్రతీతః” = ప్రసిద్దము, చూడ బడినది. “అభిజతః” = సతులీనుడు, పండితుడు “వివిక్త = పవిత్రమైనది. ఏజనము, “మూర్ఛితః” = మూర్చ పొందినవాడు, ఆంతట వ్యాపించినది, “ఆర్థః” = ఆర్థము, ధనము, వస్తువు, ప్రయోజనము, నివృత్తి “తీర్థం” = మూల కారణము, ఆగమము, మహర్షులు సేవించిన జలము, గురువు. “కకుద్” = ప్రధానము, రాజచిహ్నము, ఎద్దుమూపురము, “సంవిత్” = జ్ఞానము, సంభాషణము, క్రియా నియమము, యుద్ధము, నామము “ఉపనిషత్” = ధర్మము, రహస్యము, “శరత్” = శరదృతువు, సంవత్సరము, “పదం” = నిశ్చయము, రక్షణము స్థానము, చిహ్నము, పాదము, వస్తువు, “స్వాదు” = ఇష్టము, మధురము “మృదు” = తీర్ఘము కానిది, కోమలము. “సత్” = సత్యము సాధువు, వున్నఁ, ప్రశస్తము, పూజ్యము, విధికి = విధానము, దైవము. “ప్రణిధి:” = పార్థన, గూఢచారి. “వధూః” = భార్య, కోడలు, శ్రీ “సుధా” = సున్నము, అమృతము, “శ్రద్ధా” = ఆసక్తి, విశ్వాసము, పండి తం మన్య, గర్విత = పండితువని గర్వించిన వాడు, బ్రహ్మ “బంధుః” = బ్రాహ్మణుని అధిక్షేపమును తెలుపును. “భానుః” = సూర్యుడు, కిరణము. “గ్రావా” పర్వతము, శిల. “పృథక్ జనోజ్ఞమూర్ఖుడు, నీచుడు. “శిఖరీ” = వృక్షము, పర్వతము. “తనుః” = చర్మ, దేహము. “ఆత్మా” =యత్నము, ధృతి, బుద్ధి, స్వభావము, బ్రహ్మ, శరీరము. “ఉత్థావమ్” = పౌరుషము, తంత్రమా. “వ్యుత్థావమ్”= ఎదిరించుట. “నిర్యాతవం” = వైరము తీర్చుకొనుట. దానము, న్యాసము తిర్గి ఇచ్చుట. “వ్యసనం”  = ఆపద, క్రింద పడుట, కామ క్రోధముల వలన కలిగిన దోషము, వేట జూదము, పగటి నిద్ర, ఇతరులను నిందించుట, శ్రీ సత్తి, మద్యపానము, నాట్యము, గానము, వాద్యములు, వ్యర్థముగా, తిరుగుట. ఇవి కామము వలన కలిగిన పది వ్యసనములు; చాడీలు చెప్పుట, సాహసము, ఈర్ష్య, అసూయ, ఆర్ద్ర దూషణము, పరుషవాక్, పరుష పండము. ఇవి క్రోధము వలన కలిగిన ఎనిమిది వ్యసనములు.

         “కౌపీనం” = చెడ్డపని, గుహ్యము. “మైథునం” = సంగతి, రతి. “ప్రధానం” = పరమార్థ బట్టి. “ప్రజ్ఞానం”=చిహ్నము, బుద్ధి. “క్రందనం” = ఏడ్పు, పిలుచుట. “వర్ష” = దేహము, ప్రయాణము. “ఆరాధనం” = సాధనము, ప్రాప్తి, సంతోష పెట్టుట . “రత్నం” = స్వజాతి శ్రేష్ఠమ. “లక్మ” = చిహ్నము, ప్రధానమా. కలాపః = భూషణము, నెమలి పింఛము, అంబులపొది, సంఘటితము. “తల్పం” = శయ్యా, ఆట్టాలిక, భార్య. “డింభ” = శిశువు, మూర్ఖుడు. “స్తంభ” = స్తంభము, కొయ్యబారుట. “నడా” = సమితి, సదస్సులు. “రశ్మి” = కిరణము, కళ్ళేము. “ధర్మః” = పుణ్యము యమాదులు, లలామం, పుచ్ఛము, పుండ్రము, అశ్వము, అలంకారము, ప్రాధాన్యము, ధ్వజము , “ప్రత్యయః” = అధీనము, శపథము, జ్ఞానము, విశ్వాసము, హేతువు. “సమయః” = శపథము, ఆచారము, కాలము, సిద్ధాంతము, ఒడబాటు. “అత్యయః” = అతిక్రమణము, కాఠిన్యము. “సత్యం” = శపథము, తథ్యము. “వీర్యం” = ఐలము, ప్రభావము. “రూప్యం” = రూపము, పశ స్తము “దురోదరః” = (పుం) జూదరి (నపుం) పందెము, జూదము. “కాంతారః” = మహారణ్యము, దుర్గ మార్గము. “హరిః” = యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు విష్ణువు, సింహాదులు. “దరః” = (పుం. న ) భయము, గొయ్యి.”జఠరః” = ఉదరము, కఠినము. “ఊదారః” “దాతా, మహా పురుషుడు, “ఇతరః” = ఆన్యుడు, “ నీచుడు, “మౌళిః” = శిఖ, కిరీటము, ముడి వేసిన జుట్టు, “బలి”=పన్ను, ఉపహరము, “బలం” = సైన్యము, సైర్యము మొదలగునవి. “నీవీ” = స్త్రికటి వస్త్రబంధము, మూల ధనము, “వృషః” = అధిక వీర్యవంతుడు, ఎలుక, శ్రేష్ఠము, పుణ్యము, వృషభము, అకర్షః” = జూడము వండుపయోగించు పాచికా, సారి ఫలకము ‘అక్షం” - ఇంద్రియము, “ ఆష” = పాచికా, కర్షము, వ్యవహారము, కలిద్రుమము. “ఉషీకః' = ' కిరీటాదికము, “కర్పూ” = చిన్ననది. “ అధ్యక్ష” = ప్రత్యక్షము అధికారి, “విభావసుః” = సూర్యుడు, అగ్ని “సం” = శృంగారాదిర సము, విషము, వీర్యము, గుణము, రాగము, ద్రవము, “వర్చన్” = తేజస్సు, పురీషము. “ఆగః” = పాము, ఆపరాధము, ‘ఛందస్’ =పడ్యము, అభిలాష, ‘సాధీయన్’ = ఉత్తమము, నిశ్చితము, ‘వ్యూహః’ = సమూహము, ‘అహః’ = వృలాసురుడు, . ‘తమోపహ’ = అగ్ని , చంద్రుడు, సూర్యుడు.

అగ్ని మహా పురాణమున శబ్ద కోశము నందు నానార్థ వర్గ నిరూపణ మను మూడు వందల ఆరువది రెండవ అధ్యాయము సమాప్తము.