అగ్ని మహా పురాణము

Table of Contents

108 - అథ భువనకోశనిరూపణమ్

ఆగ్నీరువాచః-

అగ్నిదేవుడు పలికెను. వసిష్ఠా! జంబూ - ప్లక్ష - శాల్మలి - కుశ - క్రౌంచ - శాక పుష్కరము లనెడు ఏడు ద్వీపములు నలుమూలల లవణ జల - ఇక్షురస - మద్య - మృత - దధి - క్షీర - మధుర జలములు గల ఏడు సముద్రముచే చట్టబడి యున్నవి. జంబూ ద్వీపము అన్ని ద్వీపముల మధ్యనున్నది. దాని మధ్య ఎత్తైన మేరు పర్వత నున్నది. దీని విస్తారము ఎనుబది నాల్గువేల యోజనములు ఈ పర్వతరాజము పదహారు వేల యోజవములు, భూమిలో డిగి యున్నది. పై భాగమునంద దీని విస్తారము ముప్పది రెండు వేల యోజనములు. క్రింద దీని విస్తారము పదునారువేల యోజనములు, ఇట్లు ఈ పర్వతము ఈ పృథ్వీరూపక మలమునకు కర్ణిక వలె నున్నది. దీని దక్షిణమున హిమవత్ హేమ కూట - నిషధ పర్వతములును, ఉత్తరమున నీల - శ్వేత - శృంగి పర్వతములును వర్ష పర్వతముగా నున్నవి. మధ్య నున్న రెండు పర్వతములు (నిషధ - నీలములు) ఒక్కొక లక్ష యోజనముల వరకు వ్యాపించియున్నవి ఇతర పర్వత మణ వాటికంటె పదేసి వేల యోజనములు తక్కువ. అవి అన్నియు రెండేసి వేల యోజనములు ఉన్న తములు, అతిథైవెడల్పు, ద్వి శ్రేష్టా! దక్ష్మి వరములలో మొదటిది భారతవర్షము, రెండవది కింపురుషవరము. మూడవది హరివర్షము, ఉత్తరము వైపు రమ్యక - హిరణ్మయ - ఉత్తర కురువర్షము లున్నవి. అవి భారతవర్షముతో సమానములు మునివరా! నీటిలో ఒక్కొక్క దాని విస్తారము తొమ్మిదేసి వేల యోజనములు. వీటి అన్నింటి మధ్య ఇలావృతవర్షమున్నది. దాని యందు మేరు పర్వతము నిలచి యున్నది. ఇలావృతవర్షము సుమేరు పర్వతమునకు నలువైపు, తొమ్మిదేవేం యోజన నుల వరకు విస్తరించియున్నది. దీని నాలుగు వైపుల నాలుగు పర్వతము లున్నవి. ఇవి సుమేరు పర్పమును నిల బెట్టుటకై ఈశ్వరుడేర్పరచీన ఆధార స్తంభములా అన్నట్లు ఉన్నవి. వీటిలో మందరాచలము తూర్పునను, గంధమాదనము దక్షిణమునను, విపులము పశ్చిమ పార్శ్వమునందును, సుపార్శ్వము ఉత్తరమునందును ఉన్నవి. ఈ పర్వతముల విస్తా రఘు పదేసి వేల యోజనములు. ఈ పర్వతముల పై నున్న పదకొండేసి యోజనముల విస్తారముగల  కదంబి – జంబూ-ఆశ్వత్థ - వటవృక్షములు ధ్వజములవలె ప్రకాశించుచున్నవి. వీటిలో జంబువృక్షము జంబూద్వీపమను పేరునకు కారఇను. దీని పండ్లు ఏనుగంత ప్రమాణములో నుండును వీడి రసము జంబూనదిగా ప్రవహించుచున్నడి. దీది నుండి పాత్ర ఉత్తమమైన జాంబూనదము (బంగారము) ఉత్పన్నమగుచున్నది. మేరువునకు తూర్పున భదానిక ఆవర్షము పశ్చిమమున కేతు మాలము ఉన్నది. దానికి తూర్పున చైతరథమ దక్షిణమున గంధమాదనము, పశ్చిమమున భ్రాజము, ఉత్తరమున నందవము అను వనములు ఉన్నవి. అట్లే దీనికి పూర్వాడి డిక్కులండు ఆరుణోదయ - మహాథీద - శీతోదమానపద లను సరస్సు లున్నవి. సిరాంథస్సు, చకిముంజము మొదలగునవి (భూపద్మ కర్ణిక యగు) మేరువు యొక్క పూర్వదిశ యందున్న కేసరములవంటి పర్వతములు, దక్షిణమున తికూటాదులు, పశ్చిమమున శిఖివాసాదులు ఉత్తర వలన శంఖ కరాటాలును కేసర పర్వతములు. సుమేరవు బ్రహ్మపురి యున్నది.

దాని విస్తారము పదునాలుగు వేల యోజనములు. బ్రహ్మపురికి నాలుగు వైపుల అన్ని దిక్కులందును ఇంద్రాది లోకపాలకుల నగరము లున్నవి. ఈ బ్రహ్మపురినుండియే, విష్ణుపాదోద్ధత యగు గంగానది చంద్రమండలమును నడుపుచు స్వర్గమునుండి క్రిందికి దిగుచున్నది. తూర్పున శీలానది భద్రాశ్వపర్వతమునుండి బయల్వెడలి ఒక పర్వతమునుండి మరొక పర్వతమునకు వెళ్లుచు సముద్రములో కలియుచున్నది. ఇట్లే అలకనంద కూడ దక్షిణము వైపు భారతవర్షమునకు వచ్చి, ఏడు భాగములలో విభక్త యై సముద్రములో కలిసి పోవుచున్నది. వస్తునది వశ్చిమసమద్రమునందును, భద్ర ఉత్తరకురువర్షమును దాటి సముద్రమునందును కలియుచున్నది. మాల్యవల్-గంధమాదనపర్వతములు ఉత్తర దక్షిణముల వైపు నీలాచల-నిషధపర్వతముల వరకును విస్తరించి యున్నవి. ఆ రెండిటి మధ్య కర్ణికాకార మైన మేరుపర్వత మున్నది. మర్యాదా పర్వతమ బైట నున్న భారత.కేతుమాల.భద్రాశ్వ-ఉత్తరకువర్షములు ఈ లోక పద్మము దళములు, జఠర దేవ కూటమలు మర్యాదపర్వతములు. ఇవి ఉత్తర-దక్ష్మి అమల వైపు- నీలనిషధపర్వతముల వరకును వ్యాపించియున్నవి పూర్వ-పశ్చిమమాల వైపు విస్తృతము లైన గంధమాదన-g,లాసములు, ఎనుబది వేల యోజనములు విస్తృత మైనవి. తత్పనందు వలె పశ్చిమము వైపు గూడ నిషధపారియాత్రము లను రెండు మర్యాదపర్వతము లున్నవి. వాటి మూలములు సముద్రము లోపల చొచ్చుకొని యున్నవి. ఉత్తరము వైవున త్రిశృంగము, రుధిరము, వర్షపర్వతములు పూర్వపశ్చిమ సహద్రములంద చొచ్చుకొని యున్నవి. ఈ విధముగ జఠరము మొదలగు మర్యాదపర్వతములు మేరుపర్వతమునకు నలు వైవురి ప్రకాశించుచున్నవి. మునిశ్రేష్ఠా! కేసరపర్వతములమధ్య నున్న శ్రేణులలో లక్ష్మీ-విష్ణు-అగ్ని-హర్యాదిదేవతల వగరు లున్నవి. ఇవి భూలోక సంబద్ధములే యైనను స్వర్గముతో సమానమైనవి. పాపాత్ములు ఈ నగరములలో నివసించజాలరు. శ్రీమహావిష్ణువు భద్రాశ్వవర్షమునందు హయగ్రీవరూపమునను, కేతుమాలవర్షమునందు వరాహరూపమునను, భారతవర్షమునందు కూర్మరూపమునను, ఉత్తరకురువర్షమునందు మత్స్యరూపమునమనివాసము చేయుచున్నాడు. శ్రీమహావిష్ణువు విశ్వరూపముతో సర్వత్ర పూజింపబడుచున్నాడు. కింపురుషాదివర్షములు ఎనిమిదింటియందును ఆకలి భయము శోకము మొదలగునవి ఏమియు ఉండవు. అచటి ప్రజలు ఇరువదినాల్గువేల సంవత్సరముల పాటు రోగశోకాదు లేమియు లేకుండ జీవనము గడుపుచుందురు. అచట కృతవ్రేతాదికల్పవ ఉండదు. వరములు కురియవు. కేవలము పార్థివజలమే లభ్యమగును. ఈ అన్ని వర్షములందును ఏడేసి కుల పర్వతము లున్నవి. వాటినుండి వందలకొలది తీర్థరూపము లగు వదులు ప్రవహించచున్నవి. ఇపుడు భారకపర్షమునందున్న తీర్థములను గూర్చి చెప్పెదను.

ఆగ్ని మహాపురాణమునందు భువనకోశ నిరూపణ మను నూటఎనిమిదవ అధ్యాయము సమాప్తము.