అగ్ని మహా పురాణము

Table of Contents

290 - అథాశ్వ శాంతిః

శాలిహోత్ర ఉవాచః

శాలిహోత్రుడు చెప్పెను : ఓ సుశ్రుతా! ఇపుడు అశ్వరోగములను తొలగించునదియు నిత్యనైమిత్తిక కామ్య రూపమున మూడు విధములై నదియగు ఆశ్వశాంతిని చెప్పెదను వినుము. శుభ దివసమున విష్ణువునకును లక్ష్మికిని ఉచ్చైశ్రవ పుత్రుడగు హయరాజునకును పూజ చేసి సావిత్ర ముత్రములతో మృత హోనుముచేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చినచో అశ్వవృద్ధి కలుగును. ఆశ్వీయుజ శుక్ల పౌర్ణమి దివసమున నగర బహిః ప్రదేశమున శాంతికర్మ చేయవలయును. విశేషించి అశ్వినీ వరుణపూజ చేయవలయును పిదప దేవీ చిత్రముగీసి నాల్గు వైపుల నుండియు వృక్ష శాఖ లతోకప్పి సమస్త రస పూరితములగు వస్త్ర సహితములయిన కలకలను స్థాపించవలెను. పిదప శ్రీదేవిని పూజించి యవాజ్యహోమము చేయవలయును. పిదప అశ్వినీ దేవతలను ఆశ్వములను పూజించి బ్రాహ్మణులకును దక్షిణ ఇవ్వవలెను. ఇపుడు నైమిత్తిక శాంతిని వినుము. మకర సంక్రాంత్యాదులయందు అశ్వములను పూజించవలయును. విష్ణులక్ష్మి బ్రహ్మశివ చంద్రసూర్య రేవంత ఉచ్చైశ్రవస్సులను పద్మములతో పూజించవలెను. కమల దళి మురిపై దిక్పాలులను పూజించవలెను. పూజింపదగిన ఒక్కొక్క దేవత కొరకు వేదిక పై జలపూర్ణ కలళలు స్థాపించవలెను. ఈ దేవతల ఉత్తరమున తిల, అక్షత, ఆజ్య, సిద్ధార్థ ములను హోమము చేయవలయును. ఒక్కొక్క దేవతకు నూరుహోమములు చొప్పున చేయవలయును, ఆశ్వశాంతి నివారణమునకు ఉపవాస పూర్వకముగ శాంతికర్మ చేయవలయును. 

అగ్ని మహాపురాణమున అశ్వశాంతికథనమను రెండువందల తొంబదవ అధ్యాయము సమాప్తము.