అగ్ని మహా పురాణము

Table of Contents

182 - అథ సప్తమీవ్రతాని

అగ్ని రువాచః -

అగ్ని దేవుడు చెప్పెను: అందరికిని భుక్తిముక్తిప్రద మగు సప్తమీ వ్రతమును చెప్పెదను. మాఘశుక్ల సప్తమీతిథియందు కమలమును నిర్మించి దాని పై సూర్యుని పూజించినవాడు శోకరహితు డగును. భాద్రపదశుక్ల సప్తమి యందు సూర్యుని పూజించినచో సకలాభీష్టవస్తువులు లభించును. పౌషశుక్ల సప్తమియందు ఉపవాసము చేసి సూర్యుని ఆరాధించినచో సకలపాపములను నశించును. మాఘకృష్ణసప్తమినాడు ‘సర్వాప్తిసప్తమీ’ వ్రతము చేసినచో అభీస్ట-వస్తువులు లభించును. ఫాల్గునకృష్ణపక్షమునందు నందస ప్తమీవ్రతమును చేయవలెను. మార్గశీర్ష శుక్ల పక్షమున పుత్రీయసప్తమీ వ్రతము ఒక సంవత్సరము పాటు చేయు స్త్రీలకు పుత్రులు కలుగుదురు.

            అగ్ని మహాపురాణమునందు సప్తమీవ్రతవర్ణన మను నూటఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.