అగ్ని మహా పురాణము

Table of Contents

335 - అథ ప్రస్తార నిరూపణమ్

ఆగ్ని రువాచః

ఆగ్ని దేవుడు పలికెను. పేరు చెప్పని ఛందస్సులన్నియు గాథా ఛందస్సులో ఆంతర్గతములు. ఇపుడు ప్రస్తారము చెప్పబడుచున్నది. అన్ని అక్షరములును గురువు లైన పాదములో ఆది గ రువుకు క్రింద లఘువు వ్రాయవలెను. దాని పిమ్మట అదే క్రమమున వర్ణములను కూర్చవలెను. నష్ట సంఖ్యను సగ ము చేయగా ఒక లఘువు ప్రాయవలెను. సగము చేసినవుడు ఆది విషమమైనచో దానికి ఒకటి చేర్చి సమము చేసి మరల దానిని సగ ము చేయవలెను. ఇప్పుడు ఒక గుర్వక్ష రము లభించును. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క భేదము తెలియవలెనో అన్ని అక్షరములు పూర్తి యగు వరకు గురు లఘువులను వ్రాయుచు పోవలెను. ఉద్దిష్ట సంఖ్యను చెప్పుటకు గురు, లఘు వర్ణములను క్రమముగ , ఒక పంక్తిలో  వ్రాసి వాటి పైన క్రమముగ ఒకటి నుండి రెట్టించుచు, అంకములు వుంచవలెను. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క తెలియవలెనో దాని అర్ధ భాగము తీసివేయబడును. అప్పుడు రెండు లభించును. దానిని వేరుగా వుంచవలెను. విషమ సంఖ్య నుండి ఒకటి తగ్గించగ, శూన్యము లభించును. దానిని రెండుకు క్రింద వ్రాయవలెను. శూన్య స్థానమున రెట్టింపు చేయవలెను. అట్లు చేయవచ్చిన అంకమున పైనున్న ఆర్థస్థానము నందుంచి దానిచే గుణంచవలెను. మేరు ప్రస్తార ముచే ఒక ఛందస్సులో ఎన్ని లఘువులు ఎన్ని గురుపులు వుండునో, ఎన్ని వృత్తములు ఏర్పడునో తెలియును. మేరు ప్రస్తారమున క్రింది నుండి పైకి, ఆర్ధాం గుళము చొప్పున విస్తారము తగ్గుచుండును, ఛందసంఖ్యను రెట్టించి, ఒక్కొక్కటి తగ్గించినచో అన్ని అంగుళముల ప్రస్తార దేశము ఏర్పడును. ఈ విధముగా ఛందస్సారము చెప్పబడినది.

అగ్ని మహాపురాణమున ప్రస్తార నిరూపణమను మూడువందల ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.