అగ్ని మహా పురాణము

Table of Contents

26 - అథ ముద్రాలక్షణమ్

నారదుడు పలికెను :-

దేవతాసాంనిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్టబడిన ఆంజలి మొదటి ముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ.

ఎడమచేతి పిడికిలిని బొటనవేలు పైకినిలచి ఉండునట్లును, (అంజలి) కుడిచేతి బొటనవ్రేలు వంచిబంధించినట్లును (వందని) ఉంచవలెను. అట్లే. రెండు పిడి కెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉండవలెను (హృదయానుగ). ఈ మూడును వ్యూహమునందు సాధారణము చలు. పరుసగా కనిష్ఠిక మొద లైన వాటిని విడువగా ఏర్పడిన ఎనిమిది ముద్రలు అసాధారణములు.

ఈ ఎనిమిది ముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను. కనిష్టిక వరకును ఉన్న మూడు వేళ్ళను అంగుష్ఠముచేత వంచి, పైకి ఉండునట్లును, సంముఖముగాను చేసి నవమబీజమునకు వినియోగించవలెను. వామహస్తమును తిరగదీసి మెల్లగా పైకి వంచవలెను. ఆది వరాహముద్ర. అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను. వామముష్టియందు ఒక్కొక్క వేలిని . ముణిచి చూపవలెను. పూర్వముద్రను వంచవలెను. దక్షిణహస్తమునందు కూడ ఇట్లే చేయవలెను. వామముష్టియందలి అంగుష్ఠము నిలచి. ఉండును. ఈ విధముగా చేసినచో ముద్రసిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమునందు ముద్రాలక్షణ మను షడ్వింశాధ్యాయము సమాప్తము.