అగ్ని మహా పురాణము
- 1 - ప్రశ్నము
- 2 - అథ మత్స్యావతార వర్ణనమ్ - మత్స్యావతార వర్ణనము
- 3 - అథ కూర్మావతార వర్ణనమ్.
- 4 - అథ వరాహాద్యవతార వర్ణనమ్.
- 5 - అథ శ్రీ రామావతారవర్ణనమ్.
- 6 - అథ అయోధ్యాకాణ్డవర్ణనమ్.
- 7 - అథ అరణ్యకాణ్డ వర్ణనమ్.
- 8 - అథ కిష్కిందాకాణ్డ వర్ణనమ్
- 9 - అథ సున్దరకాణ్డ వర్ణనమ్.
- 10 - అథ యుద్ధకాణ్డ వర్ణనమ్.
- 11 - అథోత్తరకాణ్డవర్ణనమ్.
- 12 - అథ శ్రీహరివంశ వర్ణనమ్.
- 13 - అథ భారతాఖ్యానమ్.
- 14. మహాభారతాఖ్యానము.
- 15 - అథ పాణ్డవ చరిత వర్ణనమ్.
- 16 - అథ బుద్ధాద్యవతార కథనమ్.
- 17 - అథ సృష్టివర్ణనమ్
- 18 - స్వాయమ్భువవంశ వర్ణనమ్
- 19 - అథ కశ్యపవంశ వర్ణనమ్
- 20 - పునః జగత్సర్గ వర్ణనమ్
- 21 - అథ సామాన్యతో దేవపూజానిరూపణమ్
- 22 - అథ స్నానవిధిశథనమ్
- 23 - అథాదిమూర్త్యాదిపూజావిధికథనమ్
- 24 - అథ కుణ్డనిర్మాణాగ్ని కార్యాదివిధిః
- 25 - అథ వాసుదేవాదిమంత్ర ప్రదర్శనమ్
- 26 - అథ ముద్రాలక్షణమ్
- 27 - అథ దీక్షా విధిః
- 28 - అథాచార్యాభిషేక విధానమ్
- 29 - అథ సర్వతోభద్రమణ్డలవిధిః
- 30 - అథ మణ్డలవిధిః
- 31 - అథ కుశాపామార్జన విధానమ్
- 32 - అథ సంస్కార కథనమ్
- 33 - అథ పవిత్రారోపణ విధానమ్
- 34 - అథ హోమాది విధిః
- 35 - అథ పవిత్రాధివాసనాది విధిః
- 36 - అథ విష్ణుపవిత్రారోపణ విధిః
- 37 - అథ సర్వదేవపవిత్రారోపణ విధిః.
- 38 - అథ దేవాలయ నిర్మాణఫలమ్
- 39 - అథ భూపరిగ్రహ వర్ణనమ్
- 40 - అథార్ఘ్యాదిదానవిధిశల్యకథనే.
- 41 - అథ శిలావిన్యాసవిధిః
- 42 - అథ ప్రాసాదలక్షణమ్.
- 43 - అథ ప్రాసాద దేవతాస్థాపన భూతశాంత్యాదికథనమ్.
- 44 - అథవాసుదేవాది ప్రతిమలక్షణాని.
- 45 - అథపిణ్డికాది లక్షణమ్
- 46 - అథశాలగ్రామాది మూర్తిలక్షణమ్
- 47 - అథ శాలగ్రామాఽఽది పూజాకథనమ్
- 48 - అథ చతుర్వింశతిమూర్తి స్తోత్రమ్
- 49 - అథ మత్స్యా ది లక్షణ వర్ణనమ్
- 50 - అథదేవీప్రతిమా లక్షణమ్
- 51 - అథ సూర్యాది ప్రతిమాలక్షణమ్
- 52 - అథ చతుష్టష్టి యోగిన్యాదిలక్షణమ్.
- 53 - అథ లిజ్గాది లక్షణమ్ :
- 54 - అథ నానాలిజ్గామానాదిలక్షణమ్ :
- 55 - అథ పిణ్డికా లక్షణమ్.
- 56 - అథ దిక్పాలయాగ కథనమ్ :
- 57 - అథ కుంభాధి వాసవిధి
- 58 - అథ స్నపనాది విధిః
- 59 - అథాధివాసకథనమ్
- 60 - అథ వాసుదేవప్రతిష్ఠావిధిః
- 61 - అథ ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః
- 62 - అథ లక్ష్మీ ప్రతిష్ఠావిధిః
- 63 - అథ సుదర్శనచక్రాదిప్రతిష్ఠాకథనమ్.
- 64 - అథ కూపాది ప్రతిషా కథనమ్
- 65 - అథ సభాది స్థాపన కథనమ్
- 66 - అథ సాధారణప్రతిష్ఠావిధానమ్.
- 67 - అథ జీర్ణోద్ధార విధానమ్.
- 68 - అథ యాత్రోత్సవ విధి కథనమ్
- 69 - అథ స్నానవిధానమ్
- 70 - అథ వృక్షాది ప్రతిషాకథనమ్
- 71 - అథ గణేశపూజావిధిః.
- 72 - అథ స్నాన విశేషాదికథనమ్
- 73 - అథ సూర్యపూజావిధిః.
- 74 - శివ పూజావిధిః.
- 75 - అథ అగ్నిస్థాపనాదివిధిః.
- 76 - చండపూజవర్ణన
- 77 - అథ కపిలాపూజాది విధానమ్
- 78- పవిత్రారోహణవిధి
- 79 - పవిత్రారోహణవిధి
- 80 - దమనకారోపణవిధివర్ణన
- 81 - అథ సమయదీక్షా విథానమ్
- 82 - అథ సంస్కార దీక్షావిధిః.
- 83 - అథ నిర్వాణదీక్షాః
- 84 - అథ నిర్వాణదీక్షావిధానమ్:
- 85 - అథ ప్రతిష్ఠాకలాశోధనమ్.
- 86 - అథ విద్యాశాదినవిధానమ్.
- 87 - అథ నిర్వాణదీక్షాయాం శాంతిశోధనమ్.
- 88 - అథ నిర్వాణదీక్షావిధిః.
- 89 - ఏకత త్త్వ దీక్షావి ధిః.
- 90 - అథ అభిషేకాది.
- 91 - అథ వివిధ మంత్రాదయః.
- 92 - అథ వాస్తు ప్రతిష్ఠావిధిః
- 93 - అథ వాస్తుపూజావిధానమ్.
- 94 - అథ శిలాన్యాస విధానమ్.
- 95 - అథ ప్రతిష్టామాసాది సామగ్ర్యాది:
- 96 - అథ అధివాసనవిధిః
- 97 - అథ శివప్రతిష్టావిదానమ్
- 98 - అథ గౌరీప్రతిష్టావిధానమ్
- 99 - అథ సూర్య ప్రతిష్టా విధానమ్.
- 100 - అథ ద్వారప్రతిష్ఠా విధానమ్
- 101 - అథ ప్రాసాదప్రతిష్ఠా విధిః
- 102 - అధ ధ్వజారోపణాదివిధిః
- 103 - అథ జీర్ణోద్ధారవిధిః.
- 104 - అథ ప్రాసాదలక్షణమ్.
- 105 - అథ నగరాధివాస్తునిరూపణమ్.
- 106 - అథ నగరాదికవాస్తుకథనమ్
- 107 - అథ స్వాయమ్భువసర్గకథనమ్.
- 108 - అథ భువనకోశనిరూపణమ్
- 109 - అథతీర్థమాహాత్మ్యమ్,
- 110 - అథ గజ్గామాహాత్మ్యమ్
- 111 - అథ ప్రయాగమాహాత్మ్యమ్
- 112 - అథ వారాణాసిమాహత్మ్యం
- 113 - అధ నర్మదాదిమాహాత్మ్యమ్
- 114 - అథ గయామాహాత్మ్యమ్.
- 115 - అథ గయాయాత్రావిధిః.
- 116 - గయాశ్రాద్ధర్థవిధి
- 117 - అథ శ్రాద్ధకల్పః
- 118 - అథ భారతవర్ష వర్ణనమ్
- 119 - అథ మహాద్వీపాదివర్ణనమ్.
- 120 - అథ భువనకోశవర్ణనమ్.
- 121 - అథ జ్యోతిః శాస్త్రసారః.
- 122 - అథ కాలగణనమ్
- 123 - అథ యుద్ధజయార్ణవే నానాయోగాః.
- 124 - అథ యుద్ధజయార్జనే జ్యోతిఃశాస్త్రసారః.
- 125 - అథ యుద్ధ జయార్ణవే నానాచక్రాణి
- 126 - అథ నక్షత్ర నిర్ణయః
- 127 - అథ నానాబలాని.
- 128 - అథ కోటచక్రమ్.
- 129 - అథార్ఘకాణ్డమ్.
- 130 - అథ మణ్డలవర్ణనమ్
- 131 - అథ ఘాతచక్రాదివర్ణనమ్.
- 132 - అథ సేవాచక్రమ్.
- 133 - అథ నానాబలాని.
- 134 - అథ త్రైలోక్యవిజయవిద్యా.
- 135 - అథ సంగ్రామవిజయవిద్యాః.
- 136 - అథ నక్షత్రచక్రమ్
- 137 - అథ మహామారీవిద్యా
- 138 - అథ షట్కర్మాణి.
- 139 - అథ షష్టిసంవత్సరఫలం
- 140 - అథ వశ్యాదియోగాః
- 141 - అథ షట్త్రింశత్పదకం
- 142 - అథ మంత్రౌషధాదిః.
- 143 - అథ కుబ్జికాపూజా.
- 144 - అథ కుబ్జికాపూజా
- 145 - అథ మాలినీనానామః
- 146 - అథ అష్టాష్టక దేవ్యః.
- 147 - అథ త్వరితాపూజాదిః.
- 148 - అథ సంగ్రామవిజయపూజాః.
- 149 - అథ లక్షహోమకోటిహోమః
- 150 - అథ మన్వంతరాణి.
- 151 - అథ వర్ణాశ్ర మేతరధర్మాః
- 152 - అథ గృహస్థవృత్తి:
- 153 - అణ బ్రహ్మచర్యాశ్రమధర్మః
- 154 - అథ వివాహః
- 155 - అథాచారః
- 156 - అథ ద్రవ్యశుద్ధిః
- 157 - అథ శావాశౌచాధికమ్.
- 158 - అథ స్రావాద్యాశౌచమ్
- 159 - అథ అసంస్కృతాశౌచమ్.
- 160 - అథ వానప్రస్థధర్మ నిరూపణమ్.
- 161 - అథ యతిధర్మ నిరూపణమ్
- 162 - అథ ధర్మశాస్త్రనిరూపణమ్.
- 163 - అథ శ్రాద్ధకలనిరూపణమ్
- 164 - అథ నవగ్రహహోమ నిరూపణమ్.
- 165 - అథ నానాధర్మనీరూపణమ్
- 166 - అథ వర్ణధర్మాదికథనమ్
- 167 - అథ పునరయుతలక్ష కోటిహోమాః
- 168 - అథ మహాపాతకాదిప్రాయశ్చిత్తమ్.
- 169 - అథ పునః ప్రాయశ్చిత్తాని.
- 170 - అథ పునః ప్రాయశ్చిత్తాని.
- 171 - అథ పునః ప్రాయశ్చిత్తాని
- 172 - అథ పునః స్తోత్రప్రాయశ్చిత్తాని.
- 173 - అథ పునః ప్రాయశ్చిత్తాని
- 174 - అథ పునః ప్రాయశ్చిత్తాని
- 175 - అథ వ్రతపరిభాషాః.
- 176 - అథ ప్రతిపద్వ్రతాని
- 177 - అథ ద్వితీయావ్రతాని
- 178 - అథ తృతీయావ్రతాని.
- 179 - అథ చతుర్ధీవ్రతాని
- 180 - అథ పఞ్చమీవ్రతాని.
- 181 - అథ షష్ఠీవ్రతాని
- 182 - అథ సప్తమీవ్రతాని
- 183 - అథ అష్టమీవ్రతాని
- 184 - అథాష్టమీవ్రతాని
- 185 - అథ నవమీవ్రతాని.
- 186 - అథ దశమీవ్రతాని.
- 187 - అథ ఏకాదశీవ్రతాని
- 188 - అథు ద్వాదశీవ్రతాని
- 189 - అథ శ్రవణద్వాదశీవ్రతమ్
- 190 - అథ అఖణ్డద్వాదశీవ్రతమ్
- 191 - అథ త్రయోదశీవ్రతాని
- 192 - అథ చతుర్దశీ వ్రతాని
- 193 - అథ శివరాత్రివ్రతమ్
- 194 - అథ అశోకపూర్ణిమాదివ్రతాని
- 195 - అథ వారవ్రతాని
- 196 - అథ నక్షత్రవ్రతాని
- 197 - అథ దివసవ్రతాని.
- 198 - అథ మాసవ్రతాని
- 199 - అథ నానావ్రతాని
- 200 - అథ దీపదానవ్రతమ్
- 201 - అథ నవవ్యూహార్చనమ్.
- 202 - అథ పుష్పాధ్యాయ కథనమ్.
- 203 - అథ నరకస్వరూపమ్
- 204 - అథ మాసోపవాసవ్రతమ్
- 205 - అథ భీష్మపఞ్చకవ్రతమ్
- 206 - అథ అగస్త్యపూజా
- 207 - అథ కౌముదవ్రతమ్
- 208 - అథ వ్రతదానసముచ్చయః.
- 209 - అథ దానపరిభాషాకథనమ్.
- 210 - అథ షోడశమహాదానాద వర్ణనమ్
- 211 - అథ నానాదానవర్ణనమ్.
- 212 - ఆథ కామ్య - మేరుదానవర్ణనమ్
- 213 - అథ పృథ్వీదానాని
- 214 - అథ మంత్ర మాహాత్మ్య కథనమ్
- 215 - అథ సన్ధ్యావిధిః
- 216 - అథ గాయత్రీ నిర్వాణమ్
- 217 - పునర్గాయత్రీ నిర్వాణమ్
- 218 - అథ రాజాభిషేక కథనమ్.
- 219 - అథాభిషేకమన్త్రాః.
- 220 - అథ రాజ్ఞః సహాయసమ్పత్తిః
- 221 - అథానుజీవివృత్తమ్.
- 222 - అథ దుర్గసంపత్తిః.
- 223 - అథ రాజధర్మాః
- 224 - అథ స్త్రీరక్షాది-కామశాస్త్రమ్.
- 225 - అథ రాజధర్మాః
- 226 - అథ సామాద్యుపాయకథనమ్
- 227 - అథ దండప్రణయనమ్
- 228 - అథ యుద్ధయాత్రా
- 229 - అథ స్వప్నాధ్యాయః
- 230 - అథ శకునాని
- 231 - పునః శకునాని
- 232 - పునః శకునాని
- 233 - అథ యాత్రామండల చింతాదిః
- 234 - అథ షాడ్గుణ్యమ్
- 235 - అథ రాజ్ఞో దినచర్యా
- 236 - అథ రణదీక్షా
- 237 - అథ శ్రీస్తోత్రమ్
- 238 - అథ రామోక్తనీతిః
- 239 - అథ పునః శ్రీరాజధర్మాః
- 240 - అథ పునః షాడ్గుణ్యమ్
- 241 - అథ పునః సామాదికమ్
- 242 - అథ పునః రాజనీతిః
- 243 - అథ పురుషలక్షణమ్
- 244 - అథ స్త్రీ లక్షణమ్
- 245 - అథ చామరాది లక్షణమ్
- 246 - అథ రత్న పరీక్షా
- 247 - అథ వాస్తులక్షణమ్
- 248 - అథ పుష్పాది పూజాఫలమ్
- 249 - అథ ధనుర్వేదః
- 250 - పునః ధనుర్వేద
- 251 - పునః ధనుర్వేదః
- 252 - పునః ధనుర్వేదః
- 253 - అథ వ్యవహార నిరూపణమ్
- 254 - పునర్వ్యవహార నిరూపణమ్
- 255 - పునర్వ్యవహారే దివ్యప్రమాణం
- 256 - అథ దాయవిభాగః
- 257 - అథ సీమా వివాదాది నిర్ణయః
- 258 - అథ వాక్పారుష్యాదిప్రకరణమ్
- 259 - అథ ఋగ్విధానమ్
- 260 - అథ యజుర్విధానం
- 261 - అథ సామవిధానమ్
- 262 - అథాథర్వవిధానమ్
- 263 - అథోత్పాత శాంతిః
- 264 - పునరుత్పాత శాంతయః
- 265 - అథ దిక్పాలాది స్నానమ్
- 266 - అథ వినాయక స్నానమ్
- 267 - అథ మహేశ్వరస్నానలక్షకోటి హోమాదయః
- 268 - అథ నీరాజనవిధిః
- 269- అథ ఛత్రాదిమంత్రాదయః
- 270 - అథ విష్ణు పంజరమ్
- 271 - అథ వేదశాఖాది కీర్తనమ్
- 272 - అథ దానాదిమాహాత్మ్యమ్
- 273 - అథ సూర్యవంశవర్ణనమ్
- 274 - అథ సోమవంశవర్ణనమ్
- 275 - అథ యదువంశవర్ణనమ్
- 276 - అథ ద్వాదశ సంగ్రామాః
- 277 - అథ రాజవంశవర్ణనమ్
- 278 - అథ పురువంశవర్ణనమ్
- 279 - అథ సిద్ధౌషధాని
- 280 - అథ సర్వరోగ హరాణ్యౌషధాని
- 281 - అథః రసాదిలక్షణమ్
- 282 - అథ వృక్షాయుర్వేదః
- 283 - అథ నానారోగ హరాణ్యౌషధాని
- 284 - అథమంత్ర రూపౌషధ కథనమ్
- 285 - అథ మృతసంజీవనకర సిద్ధయోగః
- 286 - అధ మృత్యుంజయ కల్పాః
- 287 - అథ గజ చికిత్సా
- 288 - అశ్వవాహనసారః
- 289 - అథాశ్వలక్షణ చికిత్సకమ్
- 290 - అథాశ్వ శాంతిః
- 291 - అథ గజశాంతిః
- 292 - అథ గవాయు ర్వేదః
- 293 - అథ మంత్ర పరిభాషా
- 294 - అథ సర్పలక్షణాని
- 295 - అథ దష్ట చికిత్సా
- 296 - అథ పంచాంగరుద్రేణ దష్ట చికిత్సా
- 297 - ఆథ విషహృన్మంత్రౌషధమ్
- 298 - అథ గోనసాదిచికిత్సా
- 299 - అథ బాలగ్రహహరణాల తంత్రమ్
- 300 - అథ గ్రహహృన్మంత్రాదికమ్
- 301 - అథ సూర్యార్చనమ్
- 302 - అథ నానా మంత్రౌషధ నిరూపణమ్
- 303 - అథాంగాక్షరార్చనమ్
- 304 - అథ పంచాక్షరాది పూజాదికమ్
- 305 - పంచాశద్విష్ణునామాని
- 306 - అథ షట్ ప్రయోగతన్నివారణమంత్రాః
- 307 - అథ త్రైలోక్య మోహన మంత్రాః
- 308 - అథ లక్ష్మ్యాదిపూజ
- 309 - అథ త్వరితా పూజా
- 310 - అథ త్వరీతామంత్రాది
- 311 - అథ త్వరితా మూలమంత్రాది
- 312 - అథ త్వరితావిద్యా
- 313 - అథ నానామంత్రాః
- 314 - అథ త్వరితాజ్ఞానమ్
- 315 - అథ స్తంభనాది మంత్రాః
- 316 - అథ నాసామంత్రాః
- 317 - అథ సకలాది మంత్రోద్ధారః
- 318 - అథ గణపూజా
- 319 - అథ వాగీశ్వరీ పూజా
- 320 - అథ మండలాని
- 321 - అథా ఘోరాస్త్రాది శాంతికల్పః
- 322 - అథ పాశుపతశాంతిః
- 323 - అథ షడంగాన్య ఘోరాస్త్రాణి
- 324 - అథ రుద్ర శాంతిః
- 325 - అథ అంశకాదిః
- 326 - అథ గౌర్యాదిపూజా
- 327 - అథ దేవాలయాది మాహాత్మ్యమ్
- 328 - అథ చ్ఛందస్సారః
- 329 - అథ ఛందః సారః
- 330 - అథ ఛందః సారః
- 331 - అథ ఛందోజాతి నిరూపణమ్
- 332 - అథ విషమకథనమ్
- 333 - అథ అర్ధసమనిరూపణమ్
- 334 - అథ సమవృత్త నిరూపణమ్
- 335 - అథ ప్రస్తార నిరూపణమ్
- 336 - అథ శిక్షా నిరూపణమ్
- 337- అథ కావ్యాది లక్షణమ్
- 338 - అథ నాటక నిరూపణమ్
- 339 - అథ శృంగారాది రస నిరూపణమ్
- 340 - అథ రీతి నిరూపణమ్
- 341 - అధ నృత్యాదావంగకర్మ నిరూపణమ్
- 342 - అథాభినయాది నిరూపణమ్
- 343 - అథ శబ్దాలంకారాః
- 344 - అథః అర్థాలంకారాః
- 345 - అథ శబ్దార్థయోరలంకారాః
- 346 - అథ కావ్యగుణవివేకః
- 347 - అథ కావ్యదోషవివేకః
- 348 - అథై కాక్షరకోశః
- 349 - అథ కౌమార వ్యాకరణమ్
- 350 - అథ సంధి సిద్దరూపమ్
- 351 - అథ సుబ్విభక్తి సిద్దరూపమ్
- 352 - అథ స్త్రీలింగ శబ్ద సిద్ధరూపమ్.
- 353 - అథ నపుంసక శబ్దసిద్ధరూపమ్
- 354 - అథ కారకమ్
- 355 - అథ సమాసః
- 356 - అథ తద్దితమ్
- 357- ఆది సిధ్ధరూపకమ్
- 358 - అథ తిజ్విభక్తి సిద్ధరూపమ్
- 359 - అథ కృత్సిద్ధరూపమ్
- 360 - అథ కోశేషు స్వర్గపాతాలాదివర్గాః
- 361 - అథావ్యయవర్గః
- 362 - అథ నానార్థ వర్గః
- 363 - అథ భూమి వనౌషధ్యాది వర్గాః
- 364 - అథ మనుష్య వర్గః
- 365 - అథ బ్రహ్మవర్గః
- 366 - అథ క్షత్రవిట్ శూద్రవర్గాః
- 367 - అథ సామాన్య నామలింగాని
- 368 - అథ నిత్య నైమిత్తికప్రాకృతప్రలయాః
- 369 - అథాత్యన్తిక ప్రళయగర్భోత్పత్తి నిరూపణమ్
- 370 - అథః నరక నిరూణనమ్
- 371 - అథ నరక నిరూపణమ్
- 372 - అథ యమనియమాః
- 373 - అథాసన ప్రాణాయామ ప్రత్యాహారాః.
- 374 - అథ ధ్యానమ్
- 375 - అథ ధారణా
- 376 - అథ సమాధిః
- 377 - అథ బ్రహ్మ విజ్ఞానమ్
- 378 - పునః బ్రహ్మవిజ్ఞానమ్
- 379 - పునః బ్రహ్మవిజ్ఞానమ్
- 380 - అథాద్వైత బ్రహ్మవిజ్ఞానమ్
- 381 - అథ గీతాసారః
- 382 - అథ యమగీతా
- 383 - అథాగ్నేయపురాణ మాహాత్మ్యమ్
79 - పవిత్రారోహణవిధి
ఓ పద్మయోనిపాలితాత్మ తత్వ్వేరాయ ప్రకృతిలయాయ ఓం నమః శివాయ” అను మంత్ర ముచ్చరించి పవిత్ర కముతో శివుని పూజించవలెను. “విష్ణుకారణ పాలితవిద్యాత త్వేశ్వరాయ ఓం నమః శివాయ” అను మంత్రముచ్చరించి పవిత్రకమును సమర్పించవలెను. “రుద్రకరణపాలిత శివత త్వేశ్వరాయ ఓం నమః శివాయ” అను మంత్ర ముచ్చరించుచు శివునకు పవిత్రకమును నివేదించవలెను. సువ్రతుడైన ఉపాసకుడు సర్వకారణపొలాయ శివాలయ లయాయ ఓం నమః శివాయ.” అను మంత్రముచ్చరించుచు శివునకు గంగావతార మను సూత్రమును సమర్పింపవలెను, ముముక్షువులు ఆత్మతత్త్వ-విద్యాతత్వ-శివతత్వముల క్రమమున మంత్రోచ్చారణము చేయుచు పవిత్రకములను సమర్పించవలెను. బుభుక్షువులు (భోగేచ్చకలవారు) వరుసగ శివతత్వ-విద్యాతత్త్వ-ఆత్మతత్త్వములకు అధిపతియగు శివునకు మంత్రోచ్ఛారణ పూర్వకముగ పవిత్రకమును సమర్పించవలెను. ముముక్షువు స్వాహాంతమంత్రమును, భోగేచ్చగలవాడు నమోంతమంత్ర మును ఉచ్చరించవలెను. “ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే శివాయ స్వాహా “ఓం హాం, విద్యాతత్త్వాధిపతయే శివాయ స్వాహా” ఓం హోం శివతత్త్వాధిపతయే శివాయస్వాహా” అనునవి స్వాహాంతమంత్రములు (''స్వాహా”కు బదులు “నమః” చేర్చినచో నమోంతమంత్రములు). గంగావతారకమును సమర్పించిన పిదప శివునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థింపవలెను.
త్వం గతిః సర్వభూతానాం సంస్థితి స్త్వం చరాచరే.
“పరమేశ్వరా! నీవే సమ స్త్రప్రాణులకును గతివి. చరాచర జగత్తునకు ఆశ్రయమైన వాడవు నీవే. నీవు సమస్త ప్రాణులలోపల సంచరించుచు వారికి సాక్షిగా ఉన్నావు. మనోవాక్కాయములచే నీవు తప్ప నాకు వేరొక గతి లేదు. నీకు నేను ప్రతి దినము చేయు పూజలో మంత్ర - ప్రియా - ద్రవ్య - జప - హోమ - ఆర్చనాదులలో ఏ లోపము జరిగినవో శుద్దము లగు వాక్యములు లేని ఏ కర్మ చేసితినో ఆ లోపముల నన్నింటిని మన్నించి, నే చేసిన కర్మను పరిపూర్ణము చేయుము. పరమేశ్వరా! నీవు పరమ పవిత్రుడవు, నీకు సమర్పించిన ఈ పవిత్రకము సమ స్తపాపములను నశింపచేయు నది. నీవు ఆంతటను వ్యాపించి ఈ సకల చరాచర జగత్తును పవిత్రము చేసితివి. వ్యాకులత్వముచేత గాని, అంగ వైకల్యముచే, గాని నేను ఏ వ్రతమును ఖండితము చేసితినో, ఆది నీ ఆజ్ఞయనెడు సూత్రముచే గ్రుచ్చబడి ఆఖండము గాక.
ఎవని విషయమున గురువు పూర్తిగా సంతోషించునో ఆతని కాండ మంతయు సఫలమగును అనే పరమేశ్వరుడు చెప్పి యున్నాడు. ఈ విధముగ గురువును పూజించి ఆయనకు హృదయమువరకును వ్రేలాడు పవిత్రక ము సమర్పించి, బ్రాహ్మ ణాదులకు భోజనము పెట్టి, వస్తాదు లిచ్చి “దేవేశ్వరుడైన సదాశివుడు నేను చేసిన ఈ దానాదులచే సంతసించును గాక” అని ప్రార్థించవలెను.
ప్రాతఃకాలమున భక్తి పూర్వకముగ స్నానాదికము చేసి శివుని విగ్రహమునుండి పవిత్రకములను ప్రోగుచేసి, శివునకు ఆష్టపుష్పపూజ చేసి విసర్జన చేయవలెను. పిదప వెనుకటివలెనే సవిస్తరముగ నిత్యనై మిత్తి క పూజ చేసి పవిత్రక ములు సమర్పిలచి, నమస్కరించి, ఆగ్నిలో శివపూజ చేయవలెను. పిమ్మట అస్త్రమంత్రముతో ప్రాయశ్చిత్త హోమము చేసి పూర్ణాహుతి ఈయవలెను. భోగేచ్చ కలవాడు తాను చేసిన కర్మ నంతను శివునకు సమర్పించి “ప్రభో! నీ అను గ్రహముచే ఈ కర్మవలన నాకు మనోవాంచిత ఫలములు లభించుగాక” అని ప్రార్ధించవలేను మోక్షకాముడు – “ఓనాధా నా కర్మ బంధ హేతువు కాకుండుగాక” అని పార్ధించవలేను. పిదప అగ్నిలో నున్న శివునకు నాడీయోగముచే అంత రాత్మల నున్న శివునితో ఐక్యమును కల్పింపవలెను, ఆణుసముదాయమును హృదయముగ న్యసించి ఆగ్నిని విసర్జించి, ఆచమనము చేసి, పూజామండపమును ప్రవేశించి, కలశములోని జలమును నలుమూలల చల్లుచు, శివునితో సంయుక్త మగు నట్లు చేసి - ప్రభూ! నా లోపములను క్షమించుము అని ప్రార్ధించి విసర్జించవలెను. పిమ్మట లోకపాలాదులను విసర్జించి, శివుని విగ్రహమునుండి పవిత్రకములను తీసి, చండేశ్వర పూజానంతరము, వాటిని శివనిర్మాల్యాదులతో పాటు ఆయనకు సమర్పించవలెను. లేదా వీరి మీద, వెనుకటి వలే, చండేశ్వరుని పూజ చేసి - “చండనాథా! నేను చేసిన వార్షిక కర్మయందు న్యూనత్వరూప దోషము గాని ఆధిక త్వరూపదోషముగాని ఉన్న చో దానిని తొలగించి, ఆకర్మ సాంగో పాంగముగ సంపూర్ణమగు నట్లు చేయుము” అని ప్రార్ధించవలెను. పిదప చండేశ్వరుని స్తుతించి, నమస్కరించి, విసర్జించ వలేను. నిర్మాల్యమును తొలగించిన పిమ్మట శుద్దుడై, శివునకు స్నానము చేయించి, పూజించవలెను. గురుపు ఐదు యోజనముల దూరమున నున్నను ఆయనవద్దకు వెళ్ళి పవిత్రారోహణకర్మ చేయవలెను.
ఆగ్ని మహాపురాణమునందు పవిత్రారోహణవిధి యను డెబ్బదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
