అగ్ని మహా పురాణము

Table of Contents

102 - అధ ధ్వజారోపణాదివిధిః

ఈశ్వర ఉవాచః-

శ్రీ పరమేశ్వరుడు పలికెను. స్కందా! దేవాలయములో శిఖరమును ధ్వజదండమును, ధ్వజమును ప్రతిష్ట చేయవలసిన విధావమును చెప్పుచున్నాను. వినుము. శిఖరము సగము భాగమునందు శూలమును ప్రవేశ పెట్టి లేదా రూలము సగముభాగము ను శిఖరమందు ప్రవేశ పెట్టి ప్రతిష్ట చేయవలెను. ఇటుకలతో నిర్మించిన దేవాలయమందలి శూలమును దారువుతో నిర్మించ వలెమ. ఆలయము శిలానిర్మితమైనచో శూలము కూడ శిలానిర్మితము కావలెను. విష్ణ్వాది దేవాలయములందు కలశమును చక్ర సంయు క్షము చేయవలెను. ఆ కలశము దేవతామూర్తిప్రమాణమునకు అనురూపముగా ఉండవలెను, కలశము త్రిశూలయుక్త మేనచో దానికి “ఆగ్రచూలము” అని పేరు. దాని శిరోభాగమునందు శివలింగ మున్నచో దానికి  “ఈశ స్థలము” అని పేరు. శిరోభాగము బీజపూరకయుక్త మైనను. ఇదియే పేరు. అని వస్త్రములలో చెప్పబడినది. జంఘావేదితో సమానమైన విత్తు గలది లేదా జంఘావేది ఎత్తులో సగము ఎత్తుగల ఊచిత్రధ్వజము” లేదా దాని మానదండమను అనుసరించి గాని, తమ ఇచ్చననుసరించి గాని, ఉంచవచ్చును. పీఠమును ఆవేష్టించి యున్నది “మహాధ్వజము” పదునాలుగు హస్తమణల దండము, ఉత్తమము తొమ్మిది హస్తముంది మధ్యమము, ఆరు హస్తముంది ఆధమము అని విద్వాంసుల నిర్ణయము. ధ్వజదండము లేదు రైనను, సాలవృక్ష సంబంధమైన దై నను సకల కామపూరక ము; ఆపవాసమ యమున ఈ ధ్వజము విరిగిపోయినచో రాణ నకు గాని, యజమానులకు గాని హాని కలుగునని తెలియవలెను. అపుడు బహరూప మంత్రముతో వేనుక చెప్పిన విధవగ శాంతి చేయవలెను. ద్వారపాపూజ, మంత్రపర్పణము చేసి, ధ్వజమును, దానిదకమున అస్త్రను త్రముతో స్నానము చేయించవలెను. గురువు ఈమత్రముతో ధ్వజప్రోక్షణము చేసి, మట్టికషాయోదకము మొదలగు వాటితో దేవారియమును. కూడ స్నానము చేయించవలెను. ధ్వజము పై గమున గంధామ: పూసి, వస్త్రముచే ఆచ్చాదించి, మరల వెనుకటి .వలెనే దానిని శయ్య పై ఉంచి, లింగమునకు వలె కే న్యాసము చేయవలెను. కాని జ్ఞానశక్తి క్రియాశ క్తుల వ్యాసము మాత్రము చేయరాదు. విశేషారబోధిక యగు చతుర్థి కూడ వాంఛనీయము కాదు. కుండకుండాదుల ఏర్పాటు కూడ అనావశ్యకము. దండముపై, విద్యాతత్త్వమును, సద్యోజాతాదీముఖపంచకమును న్యాసము చేయవలెను, పిదప ధ్వజముపై శివతత్వన్యాసము చేసి, నిషలశివుని న్యాసము చేసి, హృద యాద్యంగపూజ చేయవలెను. పిదప, ముత్రజ్ఞు డైన గురువు, ధ్వజమునందును ధ్వజాగ్రభాగము నందును, సునిధీకరణము కొరకై ఫడుతసంహికాముత్రము తో, ప్రత్యేకభాగమునందు హోమమ చేయవలెను. మరి యే ఇతర సంస్కారము చేసినను, ఈ విధముగ అస్త్రయాగము చేసి యే చేయవలెను. ఈ విషయములను పండితులు చేసి చూపించి యున్నారు.

దేవాలయమును కడిగి, పుష్పమాలావస్త్రాదులచే అలంకరించి, జcఘవేది పై త్రితత్త్వాదిన్యాసము, హోమాదులు, శివ హజ వెనుక టివలెనే చేసి, సర్వతత్వమయ మగు ఆ శివుని వ్యాపక స్వరూపమును ధ్యానించవలేను. శివుని చరణారవిందము నందు ఆనంతకాలరుద్రులను, పీఠమున కూష్మాండ.హాటక.పాతాల-నరకములను భావన చేయవలెను. పిదప భువనములచేతను, లోకపాలులచేతను, శతరుద్రాదులచేతను పరివేష్టితమగు ఈ బ్రహ్మాండి మను ధ్యానీంచి, జంఘావేది పై స్థాపించవలెను. పృథ్వీజల-తేజో వాయుఆకాశ రూపపంచాష్టకములను, సర్వావరణసంజ్ఞకములను, బుద్ధియోన్యష్టకమను, యోగాక మును, ప్రల యము వరకును ఉండు త్రిగుణములను, తటస్థవురుషుని, వాతసింహమును కూడ జంఘావేదిపై భావన చేయవలెను. కానీ మళీజరీ వేదిక పైవిద్యానిత త్వచతుష్టయము తావన చేయవలెను. కంఠమున తయారుద్రులు, ఆమలసారమున విద్యలను, కల శమున ఈశ్వర బిందు-వీడ్యేశ్వరులను భాశన చేయవలెను. చంద్రార్ధస్వరూప మగు త్రిశూలమున తటాజూటభావన చేయవలెను. ఆ శూలముమీదనే త్రివిధశ క్తులను, దండమునందు బాబిని భావన చేసి, ధ్వజముపై కుండలినీశ క్తిని భావన చేయవలెను. ఈ విధముగ ఆలయావయవములపై విభిన్నతత్వముల భావన చేయవలెను. జగతితో ప్రాసాదసంధానముమ, పిండికలో లింగసంధానమను భావన చేసి మిగిలిన విధానము నంతను వెనుకటి వలె చేయవలెను. పిదప గురువు మంగళవాద్య ఘోషముతో, వేదధ్వనితో, మూర్తిధరులతో కలిసి, శివరూప మగు మూలము గల ధ్వజదండమును ఎత్తి మంత్రోచ్చారణపూర్వకముగ శక్తిమయకమలన్యాసము ఎచట చేయబడెనో, రత్నాదిపంచకము ఉంచబడెనో అట్టి ఆధార భూమి పై ఆ ధ్వజములు స్థాపించవలెను. ప్రాసాదశిఖరముపై ధ్వజారోపణ మైన పిదప, యజమానుడు బంధుమిత్రాదులతో ఆలయప్రదక్షిణము చేసినచో సకలాభీష్టఫలములను పొందును. గురువు, అస్త్రాదులతో పాశుపతమును చాల సేపు ధ్యానించి, శస్త్రయుక్తు లగు ఆ ఆధిపతుల నందరిని, దేవాలయరక్షకై ప్రార్థించవలేను. న్యూనతాదిదోషపరిహారార్థమై హోమ-దాన. దిగ్బల్యాదులు, పూర్తిచేసినపిదప యజమానుడు గురువునకు దక్షిణ ఈయవలేను. ఆలయనిర్మాణప్రతిష్టలు చేసిన యజమానుడు ప్రతిమా లింగ వేదులలో ఎన్ని పరమాణువు లుండునో అన్ని వేల యుగముల పాలు, దివ్యలోకమునందు ఉత్తమభోగములను అనుభవించును. ఇది అతడు పొందు ఫలము.

 అగ్నిమహాపురాణమునందు ధ్వజారోపణాది విధివర్జన మను నూట రెండవ అధ్యాయము సమాప్తము.