అగ్ని మహా పురాణము

Table of Contents

166 - అథ వర్ణధర్మాదికథనమ్

పుష్కర ఉవాచః-

పుష్కరుడు పలికెను : ఇపుడు శ్రాతస్మార్తధర్మములను గూర్చి చెప్పెను. ఆది ఐదు విధములు. కేవలము వర్ణమును మాత్రమే నిమిత్తముగా చేసి కొని చేప్పిన ధర్మము- ఉదా: పై మూడువర్ణముల వారికి ఉపనయన సంస్కారము ఆవశ్యకము. ఇది వర్ణధర్మము. ఆశ్రమమును బట్టి విధించిన ధర్మము ఆశ్రమధర్మము. ఉదా భిన్న పిండాది విధాన ము. రెండింటిని పట్టి విధించినది నైమిత్తికము. ఉదా ప్రాయశ్చిత్తవిధానము. నరుడు బ్రహ్మ దారి యైనను, గృహస్థు డై నను, వానప్రస్థు డైనను, సంన్యాసి యైనను విధింపబడిన ధర్మము ఆశ్రమ ధర్మము. మరొక విధమున గూగ ధర్మము ఐదు విధములు. సంధివిగ్రహాడిషాఢుణ్య విధానము కృష్టఫలము; మంత్రయజ్ఞాదులు ఆదృష్ట ఫలములు. అని మనువు చెప్పెను. ఇవి కాక ఉభయప్రయోజనములు గ వ్యవహారము, దండధారణము, తుల్యార్థ ఏకల్పము ఇవి కూడ యజ్ఞమూలక మగు ధర్మమునకు ఆంగములు. వేదములో చేప్పిన ధర్మమునే స్మృతులు కూడ బోధించుచు స్నవి. కార్యము కొరకై స్మృతి వేదో కధర్మమును ఆనువంచుచున్న అని మన్వాదుల అభిప్రాయము. అందుచే స్మృతులో చెప్పిన ధర్మము క్తధర్మమునకు గుణము, పరిసంఖ్య, విశేషతః అనువాదము, లేదా విశిష్టదష్ట ఫము నిరూపించకై ఉద్దిష్ట మైనది. ఇది మనుసిద్ధాంతము.

ఈ క్రింద చెప్పిన నలుబది. ఎనిమిది సంస్కారములు చేసికొనిన మానవుడు బ్రహ్మలోకమును పొందును. గర్భాధానము, పుంసవము, సీమంతోన్నయనము, జాతకర్మ, వామకరణము, ఆన్న ప్రాశసము, చూడాకర్మ  ఉపన మదగ్ని మహాపురాణము యనము, నాలుగు వేదవతములు, స్నానము, వివాహము, దేవయజ్ఞ-పితృయజ్ఞమనుష్యయజ్ఞ- భూతయజ్ఞ-బ్రహ్మయజ్ఞము లను పంచయజ్ఞములు, ఏడుపాకయజ్ఞసంస్థలు, అష్టకాసహితము లగు మూడు పార్వణశ్రాద్ధములు, శ్రావణి, ఆగ్రహాయణి, చైత్రి, ఆశ్వయుజ, అగ్న్యాధేయ- అగ్నిహోత్ర-ధర్శపౌర్ణమాస- చాతుర్మాస్య-ఆగ్రహాయణేష్టి-నిరూఢపశుబంధ సౌత్రామణులు ఏడు హవిర్యజ్ఞములు, అత్యగ్నిష్టోమ-ఉర్థ్య-షోడశి-వాజపేయ_అతిరాత్ర-ఆప్తోర్యామము లను సప్తసోమసంస్థలు ఇవి నలు బదిఎనిమిది సంస్కారములు, దయ, క్షమ, అనసూయ, అనాయాసము, మాంగల్యము, ఆకార్పణ్యము, అస్పృహ, శౌచము అనునవి ఎనిమిది ఆత్మగుణములు. ఈ ఎనిమిది ఆత్మగుణములు కలవాడు స్వర్గమును పొందును. మార్గగమనము, మైథునముమలమూత్రోత్సర్గము, దంతధావనము, స్నానము, భోజనము– ఈఆరు పనులు చేయునపుడు మౌనము పాటింప వలెను.సక్తువులవిషయమున మరల దానము చేయుట, నేయి కలిపి, పాలు కలిపి వేరు వేరుగా త్రాగుట, రాత్రి త్రాగుట, దంతము లతో కొరకుట, చాలవేడిగా త్రాగుట - ఈ ఏడు పనులు త్యజించవలెను. స్నానానంతరము పుష్పములు కోయగూడదు. అవి దేవతాపూజకు పనికిరావు. ఆన్యగోత్రీయుడు ఎవరి కైన అగ్ని సంస్కారము చేసినచో, పది దినముల వరకును పిండోదక దానములు ఆతడే చేయవలెను. జలము, తృణము, భస్మము, ద్వారము, మార్గము ఇవి మధ్యలో ఉన్న చో పంక్తిదోషము లేదు. అనామికా-అంగుష్ఠములను కలిపిపట్టి ప్రాణాహుతులు తీసికొనవలెను.

అగ్ని మహాపురాణమునందు వర్ణాశ్రమాదిధర్మవర్ణన మను నూటఆరువది ఆరవ అధ్యాయము సమాప్తము.