అగ్ని మహా పురాణము

Table of Contents

21 - అథ సామాన్యతో దేవపూజానిరూపణమ్

నారదుడు పలికెను. విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వఫలములను ఇచ్చు మంత్రములను గూర్చి చెప్పెను సకల పరివార సమేతు డైన ఆబ్యుతునికి నమస్కరించి పూజించవలెను.

విష్ణుపూజాంగముగ ద్వార దక్షిణ భాగమున ధాతను, విధాతను, వామభాగమున గంగను యమునను రెండు నిధులను, ద్వార లక్ష్మిని, వాస్తు పురుమని, శక్తిని, కూర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్య మును, ఐశ్వర్యమును, ఆధర్మాదులను, పద్మభావన చేసి దాని కందము ను, నాళమును, పద్మకేసరములను పద్మవర్ణిక (మధ్యభాగము ను, ఋగ్వేదాదులను, కృతయుగాదులను, సల్వాగుణ ములను, సూర్యాచి మండలములను పూజిచ వలెను. విమల, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, యోగాది శక్తులను పూజించవలెను. ప్రహ్వ, సత్య, ఈశ , అను గ్రహి, అమలమూర్తి యగు దుర్గ, గిరే), గణము, గణాధిపతి క్షేత్రము, క్షేత్రపాలుడు వాసుదేవాదులు వీరిని కూడ పూజింపవలెను. హృదయమును, శిరస్సును, కేశ శిఖను, కవచమును, అస్త్రమును, శంఖమును. చక్రమును గదను. పద్మమును, శ్రీవత్సమును. కౌస్తుభమును, వనమాలను, లక్ష్మిని పుషిని, గరుత్మంతుని, గురువును, ఇంద్రుని, ఆగ్ని ని యముని, రాక్షసుని, జలమును, వాయువును, కుబేరుని, ఈశ్వరుని, బ్రహ్మను. అస్త్రమును, వాహనమును, కుముదాదులను విష్వక్సేనుని పూజింపవలేను. ఈ విధముగా పూజ మండలాదులలో చేసినచో సిద్ది లభించును.

ఇపుడు సానూన్య శివపూజ చెప్పబడుచున్నది. ప్రారంభమున నందిని పూజించవలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గిర్దేవిని, లక్ష్మిని, గురువును, వాస్తుపురుషుని, ఆధార శ క్త్యాదులను, ధర్మాదులను పూజించ వలెను.

వామ, జ్యేష్ట, రౌద్రి, కాలి, క ల వికరిణి, బలవిక రిణి, బలప్రమథని, నర్వభూతద మని, మనోన్మని, శివ అను తొమ్మండుగురు శకులను పూజింపవలెను.

            “హాం, హూం. హాం శివమూర్తయే నమః” ఆరు మంత్రముతో ఆయా అవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించవలెను. “హౌం శివాయ హో,” అని శివుని, 'సం' అను బీజాక్షరముతో ఈశానముఖమును పూజింపవలెను. “హీం” అను బీజాక్షరముతో గౌరిని. “గం' అను బీజాక్షరముతో గణమును గణాధిపతిని పూజింప వలైను. ఇంద్రుడు మొదలగు వారిని చండునీ, హృదయము మొదలగు వాటిని క మముగ పూజించవలెను. ఇపుడు సూర్యార్చన మంత్రములు చెప్పబడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను.

ఉచ్చైః శ్రవస్సును, ఆరుణుని పూజించి ప్రభూతుని, విదులు.ని, సోముని, సంధ్యలను,వర సుఖుని, నందాదులను మధ్యయందు పూజింపవలెను.

దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, వీభూతి, విమలా, ఆ మోమా, విద్యుతా, సర్వతోముఖీ అను నవశ క్తులను పూజింప వలెను.

“హం” “అం” “ఖం” అను బీజాక్షరముల చే ఆరాసనము ను “స్కో యనమః అని మూర్తి ని “హాం హీం సః సూర్యాయ నమః” అని సూర్యుని, “ఆం నమో హృదయాయ” అని హృదయ మును పూజింపవలెను.

 “ఓం ఆర్కాయా నమః అని శిరస్సును పూజించవలెను. అట్లే అగ్ని - ఈశ - అసుర - వాయువులను అధిష్టించి యున్న సూర్యుని పూజింపవలెను. “భూః “ “భువః స్వః జ్వాలనై శిఖాయెన మః అని శిఖయు. “హు” అని కవచ మును “భాం” అని నేతములను, హః, అని ఆరాసమును పూజించవలెను. రాజీయను సూర్యశక్తిని, దానినుండి ప్రకటితయగు ఛాయా దేవిని పూజించవలెను. పిమ్మట సోమ - అంగారక - బుధ, గురు - శుక్ర - శని - రాహు - కేతువులను, తేజశ్చండుని పూజించవలెను. పిమ్మట సం షేపముగ పూజ చెప్పబడు చున్నది. ఆసనము, మార్తులు, మూలము, హృదయాదులు. పరిచార కులు. వీరి పూజ చేయవలెను. విష్ణ్వాసనమును పూజించవలెను. విష్ణువు యొక్క మూరి నీ పూజింపవలెను. “రాం శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమః” అనే మంత్రము. “పాం” అనునది సర్వ మూర్తులకు సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రము. “క్లీం” హృషీ హేళాయ నమః” “హూం విష్ణవే నమః” అను మంత్రము లుచ్చరించవలెను అని ధీర స్వరముల చే హృదయాదిక మును పూజించవలెను ఈ పంచమ పూజ యుద్ధాదు లలో జయము నిచ్చును.

 

చక్ర - గదా - శంఖ - ముసల - ఖడ్గ - శార్ణ - పాత - అంకుశ - శ్రీవత్స - కౌస్తుభ - వనమాలలను పూజించవలెను. “శ్రీం” అను బీజాక్షర ముతో శ్రీదేవిని, మహాలక్ష్మిని, తార్యుని, గురువును, ఇంద్రాదులను పూజించవలెను.

సరస్వతీ పూజయందు ఆసనమును, మూర్తిని పూజించవలేను. “రౌం హీం దేవ్యై సరస్వత్యై నమః” అని మంత్రము. హృదయాదులను పూజించవలెను. లక్ష్మి, మేధ, కల, తుష్టి, ప్రష్టి, గౌరి, ప్రభావతి, దుర్గ, గణము, గురువు క్షేత్రపాలుడు - వీరినందరిని పూజించవలెను.

“గం గణపతయే నమః” “ హీం గౌర్యై నమః”, శ్రీం శ్రియై నమః”, “హీం త్వరితాయై నమః”, “ఏం క్లీం సౌం త్రిపురాయై నమః” అని మంత్రములు. వీటికి ప్రారంభమున ప్రణవమును చేర్చి పేరాలోని మొదటి అక్షరమునకు బిందువు చేర్చవలేను. లేదా పూజాజపములందు అన్ని మంత్రములను “ఓం” కారముతో ప్రారంభింపవలేను.

ఈ మంత్రములతో నువ్వులు, నెయ్యి, మొదలైనవి హోమము చేసినచో ధర్మార్దకామమోక్షములు లభించును. పూజా మంత్రములను పఠించువాడు భోగముల నన్ని యు అనుభవించి స్వర్గమునకు వెళ్ళను.

అగ్ని మహాపురాణములో విష్ణ్వాది దేవతా సామాన్య పూజానిరూపణమను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.