అగ్ని మహా పురాణము

Table of Contents

165 - అథ నానాధర్మనీరూపణమ్

ఆగ్ని రువాచః-

అగ్నిదేవుడు చెప్పెను : సర్వశక్తు డైన ఏపరమాత్మ హృదయమునందు దీపము వలె ప్రకాశించుచున్నాడో ఆ పరమాత్మను అన్యవిషయముల సంబంధము లేని మనో బుద్ధి-స్మృతులతో ధ్యానించవలెను. ఆట్లు ధ్యానము చేయు బ్రాహ్మణునకే ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొదలగు పదార్థములను శ్రాద్దమ నిమిత్తము దానము చేయవలెను. ప్రియంగు మసూరము, వంకాయ, కొజ్జలు మాత్రము వడ్డించగూడరు. పర్వసంధులందు రాహువు సూర్యుని గ్రసించునపుడు అది “హ స్తిచ్చాయాయోగము.” అపుడు చేసిన శ్రాద్ధకర్మయు, శుభకర్మలును అక్షయ్యము లగును. చంద్రుడు మఘా-హస్త నక్షత్రములం దున్న పుడు ఆది “వైవస్వతీతిథి” ఆది కూడ “హ స్తిచ్చాయాయోగ మే”. బలివైశ్వదేవము చేయగా మిగిలిన అన్నము బలి వైశ్వదేవమండలమునందు ఉంచరాదు. అగ్ని లేనిచో దానిని బ్రాహ్మణుని కుడి చేతిలో హోమము చేయవలెను. వేదోక్తకర్మ చేయకపోవుటచే బ్రాహ్మణుడును, వ్యభిచారి పురుషునిచే శ్రీయు దూషితులు కారు. బలాత్కారముచే భోగింప బడిన స్త్రీని, శత్రువులకు వశ మైన స్త్రీని ఋకుకాలపర్యంతము పరిత్యజించవలెను. ఋతుదర్శనానంతరము ఆమె శుద్ధురా లగును. స్త్రీలు ముందుగ సోముడు, గంధర్వుడు, వహ్ని అను దేవతలచేత అనుభవింపబడుదురు. మనుష్యులు వీరిని తరువాత అనభవింతురు. ఆందుచే వీరు ఎవని చేతను దూషింపబడరు. అసవర్ణుడై నవానిచే శ్రీయోనియందు గర్భము ఉంచబడినచో ఆ స్త్రీ గర్భము లోపల నున్నంతవరకును ఆశుద్ధురాలు. ఆ గర్భము బైటకు వెడలినతరువాత రజస్సుచే శుద్ధురా లగును.

ఆత్మకంటే భిన్న మైస రెండవ వస్తువును చూడని వాడే బ్రహ్మభూతుడైన, ఆత్మరతు డైన నిర్మలుడైన యోగి. విషయములతో ఇంద్రియముల సంయోగ మే యోగ మని కొండ రందురు. ఆపండితు లైన వారు అధర్మమును ధర్మ మని సంగ్రహించుచున్నారు. ఆత్మ మనఃసంయోగము యోగ మని మరి కొంద రంగురు, మనస్సును వృత్తి హీనముగ చేసి, క్షేత్రజు డైన పరమాత్మునియందు ఏకము చేసి, బంధవిముక్తు డగును. ఇది ఉత్తమ మైన యోగము. ఐదు ఇంద్రియములనెడు కుటుంబములతో గ్రామ మేర్పడినది. అందు ఆరవ దగు మనస్సు చాల శ్రేష్టమైనది. ఆ మనస్సు దేవాసురమనుష్యులచేత గూడ జయింప శక్యము కానిది. బహిర్ముఖము లగు ఆన్ని ఇ:ద్రియమణలను అంతర్ముఖములుగ చేసి, మనస్సునందు నిలపవలెను. మనస్సును ఆత్మయందు నిలుపవలేను. సర్వభావశూన్యు డగు జీవుని బ్రహ్మయందు నిలుపవలేను. ఇదియేసము; ఇదియే ధ్యాసము. ఇంక ఏమి చెప్పినను గ్రంథవిస్తర మే. సకలలోకుల దృష్టిలో ఏది లేదో ఆది (బ్రహ్మ) ఉన్న డని చెప్పి తద్భిన్నము ని షేధింపబడు చున్నది. ఈ విధముగా చెప్పిన విషయము ఇతరుని హృదయమునందు నిలువదు. బాలికకు శ్రీసుఖము ఎట్లు అనుభవగోచరము కాదో అట్లే ఆ బ్రహ్మ తేయశ క్యము కాదు. పుట్టుకతో గ్రుడ్డి వాడు ఘటమనగా ఏదో ఎట్లు తెలుసుకొసజాలడో అట్లే యోగి కాని వాడు బ్రహ్మను తెలుసుకో జాలరు. బ్రాహ్మణుడు సన్యసించుట జూచి ఈతడు నామండమును భేదించుకొని పర బ్రహ్మను పొంగును అని భాస్కరుడు చలించును. సంన్యాసికి ఉపవాసవ్రతము, స్నానము, తీర్థము, ఫలము, తపస్సు, డ్వేజసంపానము ఇవన్నియు జ్ఞానికి జ్ఞానవల ఈపమాన సంపన్నము లగును. ఏకాక్షర (ఓంకార) రూప మైనది. ప్రాణాయామమే గొప్ప తపస్సు. సావిత్రికంటే పర మపావనమం మరొకటి గేదు. పాపకర్మలమ శశింపచేయుటకు ధ్యానసదృశో మైనది మాకటి లేదు. శ్వపాచలశ్రీమదగ్ని మహాపురాణమా ఇంటి భోజనము చేసినవారు కూడ ధ్యానముచే శుద్దుడగును. ఆత్మ ధ్యానము చేయువాడు. మనస్సుధ్యాన సాధనము. ధ్యానింపదగినవాడు విష్ణువు. ఫలము కూడ ఎష్ణువే. శ్రాద్ధ ముసుగు పం కీపావను తెన యతి అక్షయఫలము నిచ్చును.

నైష్ఠికధర్మమును (సంన్యాసాశ్రమమును) అధిరోహించి అచటినుండి పతితు డైన ఆత్మఘాతుకు డైన బ్రాహ్మణు నకు శుద్ధిని కలిగించు ప్రాయశ్చిత్తము లేదు. ఈ విధముగా ఆరూఢపతితులైన సంన్యసించినవారును, వారి భార్యయందు జనించిన సంతతియు, బిందులు లను చంశాలులుగా జనిఁతురు. సంశయము లేదు. అట్టి సంన్యాసి నూరు వత్సరముల ఆయుర్దాయము గల గృధ్రముగా పుట్టి మరణించును. పిదప పండ్రెండు సంవత్సరముల ఆయుపు గు శునకముగాను, పిదప పండ్రెండు సంవత్సరముల ఆయువు గల భాసపక్షిగాను, పది సంవత్సరములు సూకరముగాను, పినప పుష్పఫలరహిత మగు ముండ్ల చెట్టుగాను ఉండును. పిదప దావాగ్ని దగ్గుడై తన సహచరులతో గూడ డగును. పిదప వేయి సంవత్సరములు చైతన్యరహితుడుగు పడియుండును. వర్షసహస్రము నిండిన పిదప బ్రహ్మ రాక్షసుడగును. తారకమగు యోగ ము చేతగాని, కులమును నశింపచేయు: చేతగాని మోక్షమును పొందును. అందుచే యోగహనే సేవించవలేను. పాపవినాశక మగు ఏ యితర మంత్రమును సేవించినను ప్రయోజనము లేదు.

ఆగ్ని మహా పురాణమునందు నానాధర్మవర్ణనమను నూట అరువదియైనన ఆధ్యాయము సమాప్తము.