అగ్ని మహా పురాణము

Table of Contents

199 - అథ నానావ్రతాని

అగ్ని రువాచః-

అగ్ని దేవుడు పలికెను : ఇపుడు భుక్తిముక్తిప్రదము లగు ఋతువ్రతములను గూర్చి చెప్పెదను వర్షా - శరద్ - హేమంత - శిశిర ర్తవులందు కట్టెలు దానము చేసి, వతాంతమున మృతధేను దానముచేసి ఈ విధముగ అగ్ని వతమును పాలించినవాడు మరు జన్మలో బ్రాహ్మణుడై పుట్టును. ఒక మాసము సంధ్యాసమయమున మౌనవత మవలంబించి మాసాంతమున బ్రాహ్మణునకు మృతకుంభము, తిలలు, ఘంట, వస్త్రములు దానము చేయువాడు ఈ సారస్వతవత మాచరించి సుఖవంతు డగును. ఒక సంవత్సరము పంచామృతస్నానము చేసి గోదానము చేయువాడు రాజగును. చైత్రైకాదశినాడు నక్త భుక్త వతము చేసి చైత మాసాంతమున విష్ణుభక్తు డగు బ్రాహ్మణునకు సువర్ణమయవిష్ణు ప్రతిమను దానము చేయవలెను. ఇట్లే ఉత్తమ మగు విష్ణువ్రతము నాచరించినవాడు విష్ణపదమును పొందును. ఒక సంవత్సరము పాయసభోజనము చేసి రెండు గోవులను దానము చేసినవాడు ఈ దేవీవతమచే తీసంపన్ను డగును. ఒక సంవత్సరము పితృదేవతలకు సమర్పించిన అన్నము భుజించువాడు రాజ్యమును పొందును. ఇవి వరవతములు. ఇపుడు సంక్రాంతి. వతములను చెప్పెదను. సంక్రాంతినాడు జాగరణము చేసినవాడు స్వర్గమును పొందును. ఆమావాస్యనాడు సంక్రాంతి  వచ్చినపుడు శివసూర్యులను పూజించినవాడు స్వర్గము పొందును. మకర సంక్రాంతినాడు పాతస్నానము చేసి కేశవుని  అర్చించవలెను. ఉద్యావనమున ముప్పది రెండు పలముల స్వర్ణము దానము చేసినవాడు సకలపాపవిముక్తు డగును. విషవాడి యోగ ములందు శ్రీమహా విష్ణువునకు. మృ తమిశ్రదుర్గామలతో స్నానము చేయించినవాడు సర్వమును పొందును. స్త్రీలకు ఉమావతము లక్ష్మీ పదము వారు తృతీయా అష్టమీతిథులందు గౌరీశంకరుని పూజించవలెను. ఈ విధముగ శివపార్వతీ పూజ చేసిన శ్రీ అఖండ సౌభాగ్యము కల దగును. ఆమెకు ఎన్నడును పతివియోగము కలుగదు. ‘మూలవ్రత’ “ఉమేశ వ్రతములు” ఆచరించు స్త్రీ, సూర్యభక్తురాలగు స్త్రీ కూడ తరువాతి జన్మలో తప్పక పురుషత్వమును పొందును.

అగ్ని మహాపురాణమునందు నావావ్రతకథన మను నూట తొంబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.