అగ్ని మహా పురాణము
288 - అశ్వవాహనసారః
ధన్వ నరి రువాచః
ధన్వంతరి చెప్పెను. ఇపుడు ఆశ్వవాహనసారమును ఆశ్వచికిత్సను చేప్పెదను. ధర్మకర్మ అర్థ ముల సిద్దికై అశ్వ సంగ్రహణము చేయవలయును. తొలిసారి ఆశ్వారోహణము చేయుటకు, అశ్వినీ, శ్రవణ, హస్త ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద, ఉత్తర ఫల్గుణీ నక్షత్రములు, ప్రశస్తములు, ఆశ్వము నెక్కుటకు, హేమంత, శిశిర, వసంతములు, మంచివి. గ్రీష్మశరత్ వర్ష ఋతువులందు ఆశ్వము పై నెక్కుట నిషిద్ధము తీవ్రమైన దండములతో కాని ప్రదేశ్ మునందు గుఱ్ఱమును కొట్టకూడదు. అశ్వము యోక్క మనస్సు తెలుసుకొనజాలక ఉపాయములు తెలియక అశ్వముపై ఎక్కి దానిని మొలలు ఎముకలతో నిండిన దుర్గమమైన కంటక యుక్త మార్గము నందును ఇసుకతో వరదతో నిండిన మార్గము నందును, గోతులు మేరకలతో గూడిన మార్గము నందును నడిపించుచు కటిక (జీను) లేకుండ దాని వీపుపై ఎక్కిన మూర్ఖుడు అశ్వము వకే వాహన మగును. బుద్ధిమంతుడు శ్రేష్టుడగు ఏ ఒక్కడో ఆత్వ శాస్త్రమును చదువకుండగనే, కేవలము అభ్యాసము చేతను నిశ్చయ బుద్ధి చేతను ఆశ్వమునకు తనయభి ప్రాయము తెలుప గలుగును.
అశ్వమునకు స్నానము చేయించి పూర్వాభి ముఖముగా నిలబెట్టి ప్రారంభమున ఓం అంతమువ సమః, యను శబ్దములు చేర్చి “స్వ” బీజాక్షర యుక్తములగు మంత్రములు చెప్పుచు క్రమముగ దేవతా న్యాసము చేయవలయును. ఆశ్వము యొక్క చిత్తమున బ్రహ్మ, బలమున మహా విష్ణువు పరాక్రమమున గరుత్మంతుడు పార్శ్వ భాగమున రుద్ర గణము బుద్ధి యందు బృహస్పతి, మర్మ స్థానమున విశ్వ దేవులు, నేత్రావర్త నేత్రము లందు " చంద్ర సూర్యులు చెవు లందశ్వినీ కుమారులు జఠరాగ్ని యందు స్వధా జిహ్వపై సరస్వతీ, వేగమున వాయుదేవుడు, పృష్ఠ భాగమున స్వర్గ పృష్టము ఖురాగ్రము లందు సర్వ పర్వతములు రోమ కూపము నందు నక్షత్ర గణము హృదయము నందు చంద్ర కళ, తేజము నందు ఆగ్ని పిరుదులందు రతి, లకాటమున జగత్పతి, ప్రేషిత మున నవగ్రహములు వక్ష స్థలమున వాసుకి న్యాసము చేయబడవలెను. ఆ ఆశ్వము నెక్కువాడు ఆశ్వమును పూజించి దాని కుడి చెవిలో ఈ క్రింది మంత్రమును చెప్పవలెను.
“ఓ అశ్వమా! నీవు గంధర్వ రాజువు. నా మాట వినుము. నీవు గంధర్వ కులమున పుట్టిన దానవు, నీవు కులమును దూషితము చేయకుము. బ్రాహ్మణుల సత్యవచనముచే సోమ, గరుడ, రుద్ర, వరుణ, పవనముల, బలము ఆగ్ని తేజము, గ నీ జాతిని స్మరించుము నీవు రాజేంద్ర పుత్రుడవు అను సత్య వాక్యమును స్మరించుము. నీవు వారుణి కన్యను కౌస్తుభ మణిని స్మరించుము. దైత్య దేవతలచే క్షీర సముద్రము మథింపబడినపుడు, నీవు దేవ రులమున పుట్టి తెవి. నీ వాక్యమును నిలబెట్టుకొనుము. నీవు ఆశ్వ వంశమున పుట్టితివి నీవు నాకు శాశ్వతముగ మిత్రుడు వగుము ఓ మిత్రమా ! వా వాక్యమ్మ వినుము. నాకు వాహనము కమ్మ. నన్ను రక్షించుచు నాకు విజయమును సమకూర్పుము. పూర్వము దేవతలు నీ పృష్టమును అధిరోహించి దైత్యులను సంహరించిరి నేడు నీ పై ఎక్కి నేను శత్రు సేనను జయించెదను. “ఈ విధ ముగ ఆళ్వారోహకుడు అశ్వము చెవికో జపించి శత్రువులను మోహింప చేయుచు ఆశ్వమును యుద్ధ స్థలమునకు తీసుకొని వచ్చి దానిని అధిరోహించి జయము సంపాదింప వలెను ఉత్తమ ఆళ్వారోహకుడు అశ్వముల శరీరము నందు ఉత్పన్న ములగు దోష ములను ప్రయత్న పూర్వకముగ తొలగించి గుణములను వికసింప చేయును. ఉత్తముడగు అశ్వారోహకునిచే, అశ్వము నందు సమకూర్చబడిన గుణములు వాటికి సహజములు వలె కనబడును. కొందరు అశ్వారోహకులు వాటి సహజ గుణము:ను కూడ నళింప చేయుదురు. ఒకడు అశ్వ గుణములను గ్రహించును. మరియొకడు దోషములను గ్రహించు అశ్వ రహస్యము తెలుసుకొన గల్గి ధీమంతుడు ధన్యుడు మందబుద్ది గుణ దోషములు రెండింటిని తెలుసుకొన జాలడు. కర్మ, ఉపాయము తెలియని వాడును ఆశ్వమును వేగము నడిపీప ప్రయత్నించు వాడును కోపవంతుడును. చిన్న అపరాధమునకు కూడ కఠోర దండము నిచ్చు వాడును అగు ఆళ్వారోహకుడు కుశలుడై నను ప్రశంసనీయుడు కాదు. ఉపాయములు తెలిసిన వాడును చిత్తమును గట్రాంచ గల్గిన వాడును విశుదు కును దోషములు తొలగించు వాడును గుణములును సంపాదించు వాడును. అగు ఆళ్వారోహకుడు, నిత్యము సర్వ కర్మలందు నేర్పు కలవాడు అయి వుండును. అట్టి వాడు అశ్వమును క ళ్లెము పట్టుకొని బాహ్య భూమికి తీసుకోని వెళ్ళి దాని పృష్టము పై ఎక్కి కుడి వైపునకు ఎడమ వైపునకు నడిపించ వలెను. ఉత్తమ అశ్వ మును ఎక్కి వెంటనే దానిని కొరడాతో కొట్టకూడదు. అటు చేసినచో అని భయపడి పోవును మోహమును కూడ పొందును. అశ్వారోహకుడు ప్రాతః కాలమున క ళ్లేమును పట్టుకొని గుర్రమును లేవదీసి ప్లుత గతితో నడిపించవలెను. సంధ్యా కాలమున డెక్కలకు నాలములు లేని గుర్రమును కళ్లెము పట్టుకొని మెల్లగ నడిపించవలెను.
వెనుక చెప్పిన కర్ణ జపముచేతను అశ్వ సంచాలనమున అనుసరించవలసిన పద్దతుల చేతను, అశ్వమునకు ఆళ్వాసనము ఏర్పడును దాని విషయముశ సామ నీతిని అవలంబించ వలయును. కొరడా మొదలగు వాటితో దండము విధించవలెను. మరియొక అశ్వముతో కలిపి రథమునకుకట్టిన దాని విషయమున భేదము ఉపయోగించ వలయును. కామునకు వేచి యుంటయే దానము. పూర్వ పూర్వ ఉపాయములు సఫలము గానప్పుడు ఉత్తరోత్తరోపాయములను అను సరించవలెను. జిహ్వకు క్రింద యోగ ము లేకుండగ హయమునకు త్రాడు కట్టవలెను. నూరు పేటలు గల నూలుతో చేసిన కళ్లెమును చెలివిల దగ్గర కట్టవలెను. పిదప మెల్ల మెల్లగ వాహనమును విస్మరింప వేసి క ళ్లేమును శిథిలము చేయవలయును. గుర్రము నాలుక ఆహీనావస్థ పొందినపుడు జిహ్వా గ్రంధిని విప్పవలెను. ఆశ్వము స్థిరత్వమును విడువనంత వరకు క ళ్ళే మును ఎక్కువగా విడువ కూడదు, ఆశ్వ ముఖము నుండి లాలాజలము కారునంత వరకు ఉరస్త్రాణమును బిగించి వుంచ వలెను. స్వభావముచే ముఖమును పైకి ఎత్తి వుంచుచు అశ్వము యొక్క ఉరస్త్రాణమును గట్టిగా బిగించి వుంచి ఉత్తము డగు అశ్వారోహకుడు ఆ అశ్వమును తన కంటితో ఆవలీలగా నడిపింప గలుగును. మొదట అశ్వము యొక్క వెనుకటి కుడిపాదముతో కుడి వల్గను సంయోజితము చేసి ఆపాదమును తన వశము వందుంచు కొనవలెను. ఇదే విధముగ ఎడమ వర్ణితో ఎడమ పాదమును కట్టవలెను. దీనితో దాని ఎడమ పాదము కూడ నియంత్రణము లభించును. ఈ విధముగ ముందు పాదములు విడువబడినచో ఆసనము సుదృఢ మగును. దుష్క రమోటన కర్మ యందు పాదములు అపహృతము లైనను ఎడమ పాదమున హీనావస్థ వచ్చినను ఆట్టి స్థితికి' నాటకాయనముయని పేరు. హనన గుణన కర్మలచే ఖలీ కారము కలుగును. మాటి మాటికి ముఖ వ్యావర్తనము అశ్వ స్వభావము. ఇవన్నియు అశ్వముల పాద గ్రహణమునకు కారణము కావు. అశ్వము పూర్తిగా విశ్వాసము కలదియైన పిమ్మట ఆసనమును గట్టి వత్తి దొన పాదమును దాని ముఖముతో నొక్కి పట్టినచో దాని గ్రాహ్యత్వము హితకారి యగును. రాగములతో గట్టిగా నొక్కి పట్టి కళ్ళెము లాగి దాని బంధనముతో అశ్వము యొక్క రెండు పాదములను గ్రహించి ఆకర్షించినచో దానికి “ఉద్వక్కనము” యని పేరు. కళ్ళెము గుర్రము వాలుగు పాదములను కట్టి ఇష్టానుసారము శిథిలము చేయుచు మణ వలచే గుర్రమును కొట్టినచో దానికి మెట్టనం యని పేరు.
బుద్ధి మంతుడగు ఆశ్వారోహకుడు ఈ విధముగ ప్రళయ ఆవిప్లవములను తెలుసుకొనవలెను. మరల చతుర్థ మోట నముచే ఈ విధిని సంపాదించవలెను. మోటన ఉద్వక్కకములనే ఆ ఘుమండలముందు తన పాదములను ఉంచని ఆశ్వము సఫలమని గ్రహించవలయును. దానికి ఈ విధముగి పాదగతి నేర్పవలెను. ఆసనమువందు గట్టిగ బిగించి కట్టి శిక్షణ యిచ్చినను మంద మతితో నడచుదానిని మరల మట్టికష్టమగు విధమున నడిపించవలెను. ఈ శిక్షణా పద్ధతికి సుగ్రహణము యని పేరు. స్థానస్థితమైనను వ్యగ్రచిత్తమగు అశ్వమును పార్శ్వభాగమువ కళ్లెముతోలాగి కళ్లెమునందలి ఇమపగొళ్లెమును నములునట్లు చేసి, ఈ విధముగా పాదప్రహారముచే ఖలీకృతమై యది నడక నేర్చుకొషనట్లు చేసినచో ఆట్టి శిక్షణమునకు ఖలీకారమని పేరు. త్రివిధ గతులచే కూడ ఇష్టమగు నడక నడవనిచో దానిని దండముతో కొట్టి అట్లు నడిపించు పద్ధతికి హననము యని పేరు. రెండవ కీళ్లెములో నాల్గు పర్యాయములు కలీకృతముచేసి ఆ అశ్వమను మరొక చోటునకు తీసుకొని పోయి దానిచే నిట్టూర్పులు విడ్పించినచో దానికి ఉచ్ఛ్వాసనము యని పేరు. తన ముఖమను బయటకు త్రిప్పుట అశ్వ స్వభావము దానిని ప్రయత్నపూర్వకముగ ఆ వైపునకే త్రిప్పునట్లునేసి అద్దెనియమంచి దానికి గతినేర్పినచో ముఖవ్యావర్తన మని పేరు. క్రమముగ మూడు గతులలో చాలనము నేర్పిన పిమ్మట మండలాది పంచదార లందు నడచుట నేర్పవలెను, పైకి ఎత్తిన ముఖమునుండి మోకాళ్ళవరకు ఆశ్వము శిథిలమైనపుడు దాని శిక్షణము ఇచ్చుటకై బుద్ధిమంతులు దానిని అధిరోహించి దాని అవయవములు తేలిక ఆగువరకు దానిని వరుగెత్తించవలెను. దాని మెడకోమలముగను, ముఖము తేలిక గను, శరీర సంధులన్నియు శిథిలములగును. ఆయివవుడు అది ఆరోహమునకు వశమగును. అట్టి అవస్థలో ఆ ఆశ్వమును సంగ్రహించవలెను. మొదట నేర్పిన గతిని విచువని ఆశ్వము మంచిది. అపుడు రెండు చేతులతో కళ్లెములాగి గుర్రము కంఠము పైకెత్తి ఒక్క పాదముతో భూమి పై నిల బడునట్లు చేయవలయును. నేలపై అనివున్న వెనుకటికాళ్లు ముందరి కాళ్లకు ఆశ్రయము ఆయినపుడు ఆ అశ్వమను ముష్టితో సంధాణము చేయవలయును. ఇట్లు లాగిన వెంటనే నిలబడక శరీరమును వి! వము చేయు గుర్రమును మండలాకార మున పరుగెత్తించి వశము చేసుకొనవలెను. మెడను ఊపు గుర్రమును కళ్ళెము లాగి నిలబెట్ట వలెను.
గోమయము, ఉప్పు, గోమూత్రము వీటితో క్వాథము చేసి దానిలో మట్టి కలిపి అశ్వశ రీరమున పూయవలయును. దాని వలన మక్షి ది పీడ కలుగదు, అలసట తొలగిపోవును. అశ్వారోహకుడు భద్రాది జాతికి చెందిన గుర్రములకు గంజి ఇవ్వవలెను దీనివలన సూక్ష్మ కీటక దంశనము ఉత్సాహ శూన్య శ్వము ఆకలి తగ్గును. అశ్వము ఎట్లు వశమగునో అంత శిక్షణమే ఇవ్వవలయును. ఎక్కువగా నడిపించిన అశ్వములు నశించును. పూర్తిగా నడిపించనిచో అవి సిద్ధముగాకుండ పోవును, వాటిముఖములను పైకి ఎత్తు నట్లు చేసి వాటి పై సవారీ చేయవలయును. స్థిరముష్టి కలవాడై గుర్రమును రెండు మాకాళ్ళతో అమిపట్టి ముందుకు నపిపించవలెను. గోమూత్రాకృతి వక్రతవేణి పద్మ మండలము, మాలికాయను చిహ్నము లన్న ఆశ్వము పంచోలూక ఖలికయని చెప్పబడును. అట్టి గుర్రములు కార్యమునందు అగర్వితములై వుండును. వీటికి సంక్షిప్తము, విక్షిప్తము, కుంచితము, అంచితము. పల్గితము, ఆవల్గికము యను ఆరు లక్షణములు చెప్పటడినవి, మార్గముపై నూరుధనుస్సుల దూరము పరుగెత్తిన పిమ్మట రుద్రజాతీయాశ్వము సుసాధ్యమగును. మందాశ్వము ఎనుబది ధనుస్సుల దూరము దండై క మానసము తొంబది ధనుస్సు దూరము నడిపించిన పిమ్మట సాధ్యమగును. మృగ జింమ్మము సంకర జాతికి చెందిన అశ్వము. దానిని ఎనుబదిలేక తొంబది ధనుస్సుల దూరము నడిపించివచో సాధ్యమగును శర్కర మదువు, లాజులు, తినుఅశ్వము బ్రాహ్మణజాతీయము. ఇదిపవిత్రము సుగంధయుక్తము అయివుండును. క్షత్రియాశ్వము తేజశ్శాలి యైయుండను. వైశ్యాశ్వము పినయబుద్ధి సంపన్నమై, శూద్రాశ్వము, అపవిత్రము, చంచలము, మందము, కురూపము, బుద్ధిహీనము, దష్టము అయివుండును కళ్ళెము పట్టుకొను గనే లాలాజలమును శ్రవించు గుర్రమునకు ఆ కళ్ళెము త్రామ యిప్పి దానిని జప ధారచే స్నావము చేయించవలయును. ఇపుడు శాలిహోత్రుడు చెప్పిన విధమున ఆశ్వలక్షణములను చెప్పెదను.
అగ్ని మహాపురాణముత ఆశ్వవాహనసార వర్ణనమను రెండువఁదయెనుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
