అగ్ని మహా పురాణము

Table of Contents

344 - అథః అర్థాలంకారాః

ఆగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. అర్థములను అలంకరించుట అర్ధాలంకారము. ఆది లేనిదే శబ్ద సౌందర్యము కూడ మనో హారముగా నుండదు. ఆర్థాలంకార హీన మగు వాక్కు నాథుడు లేని ఈ వంటిది. స్వరూపము సాదృశ్యము ఉత్ర్పేక్ష, అతిశయము, విభావనా, విరోధము, హేతువు, సమము అని అర్థాలంకారము ఎనిమిది విధములు. పదార్థముల స్వభావము నకు స్వరూప మని పేరు. నిజము ఆ గంతుక మని అది రెండు విధములు. పుట్టుకతో వచ్చినది నిజము, నిమిత్తమును బట్టి వచ్చినది ఆగంతుకము. ధర్మ సామ్యమునకు సాదృశ్యమని పేరు. అది ఉపమా, రూపకము. సహోక్తి ఆర్ధాంతర న్యాసము అని నాలుగు విధములు. భేదము, ఉపమానోపమేయములకు సామాన్య ధర్మ బంధము వున్నచో ఆది ఉపమా. ఏదియో కొంత సాదృశ్యమును ఆధారముగా తీసుకోని లోక యాత్ర నడుచు చున్నది. సమాస, అసమాస యని ఉపమా రెండు విధములు. ఉపమానము సమ సమైనచో ససమాస. అట్లు కానిచో అసమాస. ఉపమాద్యోతక పకములు గాని, ఉప మేయ వాచకములు గాని రెండును గాని లోపించగా ససమాస మూడు విధములగును. అసమాస కూడ మూడు విధము. విశేషణములతో యు క్షమైనపుడు ఉపమా పదునెనిమిది విధములగును. సాధారణ ధర్మమును చెప్పు ఉపమలో ఆధర్మమునకు వున్న ప్రాధాన్యాన్ని బట్టి ధర్మోపమా, వస్తు ధాన్యమును బట్టి వసూమా. ఉపనోపమేయముల ప్రసిద్ధిని బట్టి పరస్పరము సామ్యము చెప్పినచో ఆది పరస్పరోపమా, ప్రసిద్ధిని బట్టి పరస్పరము సామ్యము చెప్పినచో అది పరస్పరోపమా, ప్రసిద్ధికి విరుద్ధముగా ఉపమానోపమేయములలో వైషమ్యమున్న చో విపరీతోపమా. ఒక వస్తువుతో మాత్రమే సామ్యము చెప్పి ఇతరోప మానములను నిషేధించినచో నియమోపమా. ఉపమేయము యొక్క గుణాదులు ఉపమానాంతరము నందు గూడ అనువృత్తము లైనచో ఆనియమోపమా.

ఒకటికి మించిన ధర్మమును చెప్పినచో సముచ్చయోపమా, అనేక ధర్మములలో సామ్యమును ఉపమానము కంటే ఉపమేయము నందు వై లక్షణ్యమున్నట్లు చెప్పినచో ఆది వ్యతిరేకోపమా. అనేక ఉపమానమాలు చెప్పినచో బహూ పమా. ఆ ఉపమానములలో వేర్వేరు సాధారణ ధర్మమున్నచో మాలోపమా. ఉపమేయమున ఉపమాన వికారముగా చెప్పి పోల్చినచో విక్రియోపమా. ఉపమాన మునందు లోకత్రయమ నందును అసంభావ్యమగు ఒక వైశిష్ట్యమును ఆరోపిచికవి వర్ణించి నచో అది ఆద్భుతోపమా. ఉపమానము వారోపించి ఉపమేయము తదభిన్నమని చెప్పి తద్వారా భ్రమ కల్గినట్లు వర్ణించుట మోహోపమా. రెండు వస్తువుల మధ్య వాటి స్వరూపమును గుర్తించుటకు శక్యము గానిచో సంశయోపమా. మొదట సంశ యము కలిగి పిదప నిశ్చయము కలిగినచో నిశ్చయోపమా. ఒక వాకార్థమును మరొక వాక్యార్థమునకు ఉపమగా వర్ణించినచో వాక్యాల్డోపమా. ఉపమానమును బట్టి సాధారణీ, ఆతిశాయినీ అని ఉపమా రెండు విధములు. ఉపమేయమే ఉపమానమైనచో ఆది అన్యోన్యోపమా. ఈ విధముగా ఉత్తరోత్తరము నడచినచో గమనోపమా. ప్రశస్తమ, నింద, కల్పితము, సదృశ్, కించిత్సదృశి ఆనిమరల ఉపమలో ఐదుభేదము లుండును. గుణసామ్యముచే ఉపమేయ స్వరూపమునకు, ఉపమాన స్వరూపము నకు అభేదమును ప్రతిపాదించినచో రూపకాలంకారము లేదా భేదముతోరోహితమైనపుడు ఉపమయరూపకము. తుల్య ధర్మము లగు రెండు పదార్థములు కలిసి యున్నట్లు వర్ణించి సహోక్తి.

పూర్వ వర్ణి తమగు వస్తువును సమర్థించుటకై సాధర్మమును కాని వై ధర్మ్యమును గాని పురస్కరించుకొని మరి యొక అర్థమును ఉపన్యసించుట అర్థంతరవ్యాసము. సచేతన మగు పదార్థము లేదా అచేతన పదార్థము ఒక విధముగా నుండుటను, మరొక విధముగా ఊహించినచో ఉత్ప్రేక్షాలంకారమ. లోకాతీతముగా వర్ణించుట, అతిశయాలంకారము సంభ వము అసంభవము అని రెండు విధములు. గుణ, జాతి, క్రియాదుల లోపమును చెప్పుట ద్వారా ఒక వస్తువు యందలి విశేష మును వర్ణించినచో విశేషోక్తి. ప్రసిద్దమైన కారణమును నిరాకరించి మరియొక కారణమును కానీ, స్వాభావిక రూపమున కార్యోత్పత్తిని కొని ఊహించినచో విభావనాలంకారము. పరస్పర విరుద్ధములగు పదార్థములను కలిసి యున్నట్లు యుక్త పూర్వకముగా వర్ణించుట వీరోధాలంకారము. అభిలషితార్థ సాధక నిమిత్త వర్ణనము హేత్వలంకారము, కార కము జ్ఞాపకము యని ఇవి రెండు విధములు. కారక హేతువు కార్య జన్మమునకు పూర్వమునందును. తరువాతను వుండును. దీనికి పూర్వ శేషమన పేగు. ఈ భేదము లందే కార్య కారణ భావముచే గాని, నియామక మగు స్వభావముచే గాని, అవినాభావ దర్శన ముచే గాని, అవినాభావ నియమము వున్న చో అది జ్ఞాపక హేతువు. నదీ పూరాది దర్శనము జ్ఞాపకమునకు ఉదాహరము.

అగ్ని మహా వూణమున అర్థాలంకార వర్ణన మను మూడు వందల నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.