అగ్ని మహా పురాణము

Table of Contents

217 - పునర్గాయత్రీ నిర్వాణమ్

ఆగ్నిరువాచః-

అగ్ని దేవుడిట్లు చెప్పెను : వసిష్ఠా! మరొకవసిష్ఠుడు గాయత్రీజపపూర్వకముగ లింగమూర్తియగు శివుని స్తుతించి శివుని అనుగ్రహముచే నిర్వాణస్వరూపమగు పర బ్రహ్మను పొందెను. వసిష్ఠుడిట్లు స్తుతించెను- “కనకలింగమునకు నమస్కారము, వేదలింగమునకు నమస్కారము. పరమలింగమునకు నమస్కారము. ఆకాశలింగమునకు నమస్కారము. సహస్రలింగ - వహ్నిలింగ - పురాణలింగ .వేదలింగ శివునకు మాటిమాటికి నమస్కారము చేయుచున్నాను. పాతాలలింగ - బ్రహ్మలింగ - సప్త ద్వీపోర్ధ్వ లింగమునకు మాటిమాటికి నమస్కారము. సర్వాత్మలింగ - సర్వలోకలింగ - అవ్యక లింగ - బుద్దిలింగ - ఆహంకార లింగ - భూతలింగ - ఇంద్రియలింగ - తన్మాత్రలింగ - పురుషలింగ - భావలింగ రజోర్ధ్వలింగ - సత్త్వలింగ - ధవలింగ - త్రైగుణ్యలింగ ఆనాగతలింగ - తేజోలింగ - వా మూర్ధ్వలింగ - శృతిలింగ అథర్వలింగ - సమలింగ - యజ్ఞాంగలింగ – యజ్ఞలింగ-తత్త్వలింగ - దైవకానుగ తలింగ స్వరూపుడవగు నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను. ప్రభూ! నాకుపరమయోగమును ఉపదేశించుము; నాతోసమానుడైన పుత్రుని ఇమ్ము. నాకు ఆవినాశి యగు పర బ్రహ్మయొక్క ప్రాప్తి ని కలిగించుము. పరమశాంతినిమ్ము  నావంశము ఎన్నటికిని క్షీణము కాకుండుగాక! నా బుద్ది సర్వదా ధర్మముపై లగ్నమైయుండుగాక” అగ్ని పలికెను : పూర్వము వసిష్ఠుడు శ్రీ శైలముపై స్తుతించగా శంకరుడ ప్రసన్నుడై వసిష్ఠునకు వరములిచ్చి అచటనే అంతర్ధానము చెందెను.

అగ్ని మహాపురాణమున గాయత్రీనిర్వాణకథనమను రెండు వందల పదునేడవ అధ్యాయము సమాప్తము.