అగ్ని మహా పురాణము

Table of Contents

228 - అథ యుద్ధయాత్రా

 పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను : ఆక్రందరాజునా పార్ష్ణి గ్రహరాజును జయించెను. అని గ్రహించిన రాజు సైన్య మను యుద్ధమునకై తరలించవలెను. [ఆక్రంద - పార్ష్ణిగ్రాహాదులను గూర్చి 233 అధ్యాయమున చెప్పబడును.] ముందుగా సేన దాగుగా బలంగా ఉత్సాహంతో ఉన్నది. భృత్యులందరును చక్కగా పోషింపబడి ఉన్నారు. నావద్ద ఆధికమైన సేన ఉన్నది; నేను మూలర క్షణవిషయమున అన్ని విధములచే సమర్థుడను” ఆను విషయమును నిర్ధారణ చేసికొనవలెను పిదప సైనిక పరివృతుడై శిబిరములోనికి వెళ్ళవలెను. శత్రువు కష్టములలోనున్నపుడును, దైవ - మానుషబాధలలో చిక్కుకొని యున్న పుడును, అతని నగరవు పీడితమైయున్నపుడును యుద్ధయాత్ర చేయవలెను. భూకంపము ఏవై పున వచ్చినదో, కేతువు తన ప్రభావముచే ఏ ప్రక్కదూషితము చేసెనో ఆ వైపునుండి ఆ క్రమణము చేయవలెను. శత్రువును నశింపచేయవలెనని సేన ఉత్సాహముతో ఉన్నపుడును, శత్రువులపై యోధులకు కోపమున్నపుడును, శుభసూచకముగ అవయవములుఅదరుచున్న పుడును మంచి చిహ్నములు ఉత్తమమైన నిమిత్తములు, శకునములు కనబడుచున్నపుడును శత్రునగరముపై ఆక్రమణము చేయవలెను. వర్షాకాలమునందు యుద్ధయాత్ర చేయవలసివచ్చినపుడు కాలిబంటులు, ఏనుగులు అధికముగా ఉన్న సైన్యమును ముందుకు దుమక మని ఆజ్ఞాపించవలెమ, హేమంత శిశిర ర్తుపులందు రథములు, ఆక్వములు అధికముగా ఉన్న సైన్యమును తీసికొని వెళ్ళవలెను. వసంత - శరదారంభములందు చతురంగ సేనను తీసికొని వెళ్లవలెను. కాలిబంటులు ఎక్కువగానున్న సైన్యమే శత్రువులపై విజయము సాధించును. శరీరమునంద కుడిభాగమున ఏ అవయవమైన ఆదురుచున్నచో అది ఉత్త మము. ఎడమ అవయవము వీపు హృదయము ఆురుట మంచిది కాదు. ఈ విధముగ శరీరచిహ్నములు, కురుపులు బొబ్బలు, అవయవములు అదురుట మొదలగు వాటిచే శుభాశుభఫలములను బాగుగా తెలిసికొనవలెను. స్త్రీలకు ఫలముదీనికి విపరీతముగా ఉండును. వాళ్లకు శరీరము ఎడమ భాగము అదురుట మంచిది.

ఆగ్ని మహాపురాణమునందు యుద్ధయాత్రావర్ణనమను రెండువందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.