అగ్ని మహా పురాణము

Table of Contents

88 - అథ నిర్వాణదీక్షావిధిః.

మహేశ్వరుడు చెప్పెను. విశద్ధశాంతికళతో శాంత్యతీతకళను సంధానము చేయవలెను. దానియందు కూడ వెనుకటి వలెనే తత్వవర్ణాది భావన చేయవలెను. ఎట్లనగా సంధానసమయమునందు “ఓం హం హం హం హాం” అను మంత్ర ము నుచ్చరించవలెను. శాంత్యతీతకళలు శివ-శక్తులు రెండు తత్త్వములు. ఇంధకదేపక-రోచక- మోచక ఊర్ధ్వగామి వ్యోమరూప-అనాథ-ఆనుశితములను ఎనిమిది భువనములు. ఓంకారము పదము. ఈశానము మంత్రము. అకారము మొదలు విసర్గవరకును ఉన్నవి పదునారు అక్షరములు. నాద-హకారములు బీజములు. కుహూ, శంఖినులు రెండు నాడులు. దేవదత్త-ధనంజయములు రెండు ప్రాణవాయువులు. వాక్-శ్రోత్రములు రెండు ఇంద్రియములు, శబ్దము విషయము అదియే గుజము కూడ. ఐదవ దైన తురీయాతీతావస్థ అవస్థ. సదాశివుడు ఏకైక కారణము. శాంత్యతీతకళలో ఈ తత్త్వాదు లన్నియు ఉన్న వని భావన చేసి తొడనాదికము చేయవలెను. పడంత మగు మంత్రముచే కలాపాశతాడనము బోధనముచేసి, నమస్కారాంతమంత్రముతో శిష్యుని అంతఃకరణమునందు ప్రవేశము చేయవలెను. పిమ్మట ఫడంతమంత్రముతో జీవచైతన్య మును పాశ విముక్తము చేయవలెను. “వషట్' 'నమః' అను మంత్రములతో సంపుటిత మైన స్వాహాంతమంత్రము నుచ్చ రించి, అంకుశ ముద్రా పూరక ప్రాణాయామములతో పాశమును మస్తకసూత్రముతో ఆకర్షించి, దానిని కుంభక ప్రాణాయా మముతో గ్రహించి, రేచక ప్రాణాయామఉద్భవముద్రలతో హృదయమంత్రసంపుటితము చేసి, నమస్కారాంత మంత్రముతో దానిని అగ్నికుండములో స్థాపించవలెను. దాని పూజనాదికము నంతను నివృత్తికళకు చేసినట్లే చేయవలెను. సదాశివుని ఆవాహన-పూజన-తర్పణములు చేసి భక్తిపూర్వకముగ విజ్ఞాపన చేయవలెను. “భగవంతుడా! ఈ ముముక్షువునకు సత్పురుషులు చెప్పిన నీ అధికారమున దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదా ఈతనికి అనుకూలుడవుగ ఉండవలెను.”

మాతాపితరుల ఆవాహన-పూజన-తర్పణ సంవిధానములు చేసి, హృదయసంపుటిత మగు ఆత్మబీజముతో శిష్యుని వక్షస్థలమున తాడనము “ఓం హం హం హః హూం ఫట్” అను మంత్రముతో చేయవలెను. ఆ మంత్రముతోడనే శిష్యుని హృదయమునందు ప్రవేశించి అస్త్రమంత్రముతో చైతన్యమును పాశమునుండి విముక్తము చేయవలెను. పిదప జేష్టాంకుశ ముద్రతో సంపుటిత మైన ఆ స్వాహాంతమంత్రముతో దానిని ఆకర్షించి, గ్రహించి, నమోంతమంత్రముతో దానిని ఆత్మయందు కూర్చవలేను. “ఓం హాం హాం హాం హః హూం ఫట్” అనునది ఆకర్షణమంత్రము. “ఓం హం హాం హాం ఆత్మనే నమః” అనునది ఆత్మ నియోజన మంత్రము. వామా ఉద్భవముద్రతో వెనుక టివలెనే మాతాపితృసంయోగభావన చేసి, ఆ మంత్రముతోడనే జీవచైతన్యమును దేవీగర్భమునందుంచవలెను. పిమ్మట పూర్వోక్తవిధానానుసారము గర్భాధానాది సంస్కారము లన్ని యు చేయవలెను, పాశ బంధ శైథిల్యము కొరకై, ప్రాయశ్చిత్తముగా మూలమంత్రమును నూరు సార్లు జపించవలెను. మలశ క్షితిరోధానము కొరకును, పాశ వియోజనము కొరకును అస్త్రమంత్రముతో వెనుకటివలెనే ఐదేసి హోమములు చేయవలెను. కళకు సంబంధించిన, బీజముతో కూడిన ఆయుధమంత్రముతో ఏడు పర్యాయములు అభిమంత్రించిన ఖడ్గరూప మగు అస్త్రముతో పాశములను భేదించవలెను. “ఓం హః హాం శాన్యతీతకళాపాళాయ హుం ఫట్” అనునది మంత్రము. పిదప ఆ పాశములను వెనుక టివలె అస్త్రమంత్రముతో సలిపి, వర్తులా కారము చేసి, నేతితో నింపిన స్రువముల నుంచి, కళాస్త్రమంత్రముతో హోమము చేయవలెను. పాశాంకుర నివృత్తికొరకై ఐదు హోమములును, ప్రాయశ్చిత్తనిషేఢము కొరకు ఎనిమిది హోమములను చేసి హృదయమంత్రముతో సదాశివుని ఆవాహన - పూజాతర్పణములు చేసి, వెనుక చెప్పిన విధముగ ఆధికారసమర్పణము చేయవలెను. అందుకుమంత్రము. “ఓం హాం సదాశివ మనోబిన్దుం శుల్కం గృహాణ స్వాహా” అనునది. పిదప సదాశివునకు కూడ శివుని ఆజ్ఞను వినిపింపవలేను. సదాశివా! ఈ పశువునందలి పాపము లన్నియు దగ్గములై నవి. కావున ఈతనికి బంధనము కలిగించుటకై నీ విచట ఉండరాదు”.

మూలమంత్రముతో పూర్ణాహుతి ఇచ్చి సదాశివుని విసర్జించవలెను. శరత్కాలచంద్రదృశ, మై విశుద్ధ మైన శిష్యుని జీవాత్మను రౌదీసంహారముద్రతో తనలో సంయోజితము చేసికొనవలెను. శిష్యుని శరీరములో నున్న జీవాత్మను ఉద్భవ ముద్రతో ఉద్ధరించి, దాని పోషణము కొరకై, శిష్యుని తలపై అర్ఘ్యజలబిందు వొకటి ఉంచవలెను.  పిదప పరమభక్తి భావముతో క్షమార్పణము చెప్పుకొని, ఈ విధముగ పలుకుచు మాతాపితరుల విసర్జనము చేయవలెను. “శిష్యునకు దీక్ష ఇచ్చుటకై మిమ్ముల నిరువురిని కష్ట పెట్టితిని. అందులడు. నన్ను క్షమించి, మీ యిరువురును. తమ స్థానమునకు వెళ్ళడు”, అస్త్రమంత్రముచే అభిమంత్రించిన కర్తరితో, “ఓం హూం శిఖాయై హూం ఫట్” “ఓం అస్త్రాయ హూం ఫట్” అను ఛేదనమంత్రములతో, శిఖాస్త్రముతో, బోధనశక్తి స్వరూపిణి యగు, శిష్యుని నాలుగు అంగుళమల శిఖను ఛేదించవలెను. దానిని మృతపూర్ణ మగు ధ్రువమునం దుంచి ‘హుం ఫట్' అని అంతమునందు గల అస్త్రమంత్రముతో ఆగ్నిలో హోమము చేయవలెను. “ఓం ఓం హః అస్త్రాయ హూం ఫట్ అనునది మంత్రము. పిదప స్రుక్ స్రువములు - కడిగి, శిష్యునకు స్నానము చేయించి, తాను ఆచమనము చేసి, యోజనాస్థానము కొరకై అస్త్రమంత్రముతో తనను తాను తాడనము చేసికొన వలేను. పిమ్మట వియోజన - ఆకర్షణ - సంగ్రహణములు చేసి వెనుకటి వలె ద్వాదశాంతము (లలాటముపై భాగము) నుండి జీవచైతన్యమును తీసికొని తన హృదయకమలకర్ణికామధ్యమునం దుంచవలెను. సుక్కును నేతితో నింపి, దానిపై స్రువమును ఆధోముఖముగా నుంచి, శంఖతుల్యముద్రతో, నిత్యో క్ష విధి ప్రకారము హస్తమునందు గ్రహించవలెను. పిమ్మట నాదోచ్చారణానుసారము శిరస్సును, కంఠమును చాపి, దృష్టిని సమభావములో నుంచి, స్థిర - శాంత - పరభావసంపన్నుడై కలశ - మండల - అగ్ని - శిష్యులనుండియు, తననుండియు ఆరు విధము లగు ఆధ్వలను గ్రహించి, సుక్కు అగ్ర భాగమునందు, ప్రాణమయనాడిలోపల నుంచి, దానిని ఆ భావముతోడనే భావన చేయవలెను. ఈ విధముగ చింతించి క్రమముగ ఏడు విధములగు విషవలను ధ్యానించవలెను.

మొదటిది ప్రాణసంయోగ స్వరూపము. రెండవది హృదయాది క్రమమున ఉచ్చరింపబడిన మంత్రము. మూడవది సుషుమ్నానుగ తనాదరూపము. నాడీసంబద్ద మగు నాదము శ క్తిలో లీనమగుటకు ప్రశాంత విషువ మని పేరు. “శక్తిలో లీన మైన నాదము పునరుజ్జీవితమై పైకి సంచారము చేసి, సమతలో లయము అయినచో అది శక్తి యను విషువము, సంపూర్ణ వాదము శక్తిసీమను లంఘించి, ఉన్మనీలో లీనమైనచో ఆలవిఘవము, “ఆరవ దగు ఇది శక్యతీతము. ఏడవ విషువము తత్వసంజ్ఞకము”, ఇదియే యేజనాస్థానము. పూరక కుంభకములు చేసి, ముఖము కొంచెము తెరిచి, మెల్ల మెల్లగా మూల మంత్రము నుచ్చరించుచు శిష్యాత్మలయ భావనచేయవలెను. దానిక్రమము ఆడిషడధ్వప్రాణరూపమును విద్యుత్సదృశము అగు షడధ్వల ప్రాణరూపముగ పట్కారమునుచింతన చేయవలెను. అది నాభికి పైన జానెడు దూరమునందు ఉండును దాని పైన హృదయమునుండి నాలుగు అంగుళముల దూరమునందు ఆకారమును చింతన చేయవలెను. దాని పైన ఎనిమిది ఆంగుళ మల దూరమున విష్ణుపాచక మరుగు ఉకారము, దాని పైన నాలుగు అంగుళముల దూరమున తాజస్థానమున రుద్రవాచక కొరమీను ఉండును. లలాటమధ్యమున ఈశ్వరవాచక మగు బిందువు ఉండును. లలాటము పైన బ్రహ్మరంధ్రము వరకును వాదమయు డగు సదాశివు డుండును. శ క్తి కూడ అచటనే యుండును. ఈ తత్త్వముల నన్నింటిని క్రమముగ చింతన చేయుచు, త్యజించి చివరికి శక్తి తత్త్వమును కూడ త్యజించవలెను. అచటనే దివ్యపిపీలికాస్పర్శానుభవము పొంది లలాటము పైన పరమతత్త్వము, పరమానందస్వరూపము, భావశూన్యము, మనోతీతము, నిత్యము గుణోదయశాలి అగు శివతత్త్వమునందు శిష్యాత్మ విలీనమై నట్లు భావన చేయవలెను.

పరమశివునియందు యోనిస్థిరత్వముకొరకై “ఓం నమః శివాయ వౌషట్” అను మంత్ర ముచ్చరించుచు అగ్ని జ్వాలలో మృతధార విడచుచుండవలెను. పిదప విథిపూర్వకముగ పూర్ణాపత్రి ఇచ్చి గుణపాదనము చేయవలెను. పిదప విధిపూర్వకముగ పూర్ణాహుతి ఇచ్చి గుణపాదనము చేయవలెను. అందులకై “ఓం హం ఆత్మ నే సర్వజ్ఞో భవ స్వాహా ఇత్యాది మంత్రములను (మూలములో ఉన్నవి) పఠించుచు ఆగ్నిలో హోమము చేయవలెను. ఈ విధముగ షడ్గుణసంపన్న మగు ఆత్మను వరమశివునినుండి గ్రహించి, యథావిధిగా, శిష్యుని శరీరమునందు కూర్చినట్లు భావన చేయవలెను. తీవ్రము, మందము అయిన శ క్తిపాతముచే కలిగిన శ్రమ కాంతించుటకై శిష్యుని శిరముపై న్యాసపూర్వకముగ అమృతబిందువు ఉంచ వలెను. ఈశానకలశాదిరూపమున పూజింపబడిన శివస్వరూపకలశములకు నమస్కారము చేసి, దక్షిణమండలమునందు, శిష్యుని తనకు కుడి ప్రక్కన ఉత్తరాభిముఖునిగా కూర్చుండబెట్టి దేవేశ్వరు డైన ఈశ్వరుని ఈ విధముగా ప్రార్థించవలేను. “ప్రభూ! నా శరీరమునం దుండి నీవే ఈజీపుని అనుగ్రహించినావు. అందుచే దేవా! వీనికి దేపతా-అగ్ని-గురువులందు శక్తిని అధికము చేయుము.” ఈ విధముగ ఫ్రార్థించి శివునకు నమస్కరించిన పిదప గురుపు శిష్యునకు ఆదరపూర్వక ముగా “నీకు శుభమగుగాక “ ఆని ఆశీర్వదించవలెను. పిమ్మట శివునకు భక్తితో ఎనిమిది పుష్ఫములు సమర్పించి శివకల శములోని ఉదకముతో శిష్యునకు స్నానము చేయించి యజ్ఞ సమాప్తి చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు నిర్వాణదీక్షావర్ణన మను ఎనుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.