అగ్ని మహా పురాణము

Table of Contents

45 - అథపిణ్డికాది లక్షణమ్

హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా! ఇపుడు నేను పిండిక లక్షణము చెప్పెదను పిండిక పొడవు ప్రతిమతో సమానముగ నుండును. ఎత్తు మాత్రము ప్రతిమలో సగముండును. పిండికకు అరువది నాలుగు కోష్టకము లేర్పరచి, క్రింది రెండు పంక్తులు విడచి, దాని పైన ఉన్న కోష్టము నాలుగు వైపుల, రెండు పార్శ్వములందును. లోపలి నుండి తుడిచి చేయవలెను. అట్లే పై రెండు పంక్తులు విడచి దాని క్రిందనున్న కోమ్లమును లోపలినుండి తుడిచి వేయవలెను. ఈ విధముగ రెండు పార్శ్వములందును చేయవలెను. రెండు పార్శ్వముల మధ్యనున్న రెండు రెండు చతుష్కములనుగూడ తుడిచిశ్రీమదగ్ని మహాపురాణము వేయవలెను. పిమ్మట దానిని నాలుగు భాగములుగా విభజించి పై రెండు పంక్తులను మేఖలగా గ్రహించి, దాని ప్రమాణ ములో సగము ప్రమాణముండునట్లుగ దాని యందు గొయ్యి తవ్వవలేను. రెండు పార్శ్వ భాగములందును సమానముగ ఒక్కొక్క భాగము విడచి జైటపదమును నాలి (తూము) నిర్మించుటకై విడువవలెను. దానియందు తూమునిర్మింపవలెను. మూడు భాగములోని ఒక భాగమునకు ముందు నీరు ముందుకు పోవుట కి మార్గముండవలెను.

వివిధాకారముగల ఈ పిండికకు “భద్ర” అని పేరు. లక్ష్మిదేవి ప్రతిమ ప్రమాణము ఎనిమిది జానలుండవలెను. ఇతర దేవుల ప్రతిమలు కూడ ఇల్లే ఉండవలెను. రెండుకను బొమ్మలును నాసిక కంటే ఒక యవ ఆధికముగా ఉండవలెను. వాసిక వాటి కంటే ఒక యవ తక్కువ ఉండవలెను. ముఖ గోలకమ నేత్ర గోలకముకంటే పెద్దదిగా ఉండవలెను. ఆది ఎత్తుగాను, వంకర టింకరగాను ఉండకూడదు. నేత్రములు పెద్దవిగా మూడును పావుయవన ప్రమాణములో నుండ వలెను. ముఖము పొడవు ఒక కోణము నుండి మరియొక కోణమువరకు ఎంత ఉండునో సూత్రముతో కొలిచి కర్ణ పాశము అంత ఉండునట్లు చేయవలెను. దాని పొడవు పైన చెప్పిన సూత్రము - కంటే కొంచెము ఎక్కువ పొడవే ఉండవలెను. రెండు స్కంధములు కొంచెము వంగి ఒక కల తగ్గినట్లు చేయవలెను. కంఠము పొడవు ఒకటిన్నర కళల పొడవుండవలెను. వెడల్పు కూడ అంతలో ఉండవలెను. రెండు ఊరువుల విస్తారము కంఠము కంటే ఒక నేత్రము తక్కువ ఉండవలెను. మోకాళ్ల చిప్పలు, పిండలి, పాదములు, పీఠము, నితంబము, కటిభాగము మొదలగు వాటిని యథా యోగ్యమగ కల్పింప వలెను.

చేతి వేళ్లు పెద్దవిగా ఉండవలెను. పరస్పరావరుద్ధములు కాకూడదు. పెద్ద వ్రేలి కంటే చిన్న ప్రేళ్ళు ఏడవ వంతు తక్కువ ఉండవలెను. పిక్కలు, తొడలు, కటి-వీటి పొడవు క్రమముగ ఒక్కొక్క నేత్రను తక్కువ ఉండవలెను. శరీర మధ్య ప్రాంతము గుండ్రంగా ఉండవలెను. కుచములు దగ్గరగా బలిసి ఉండవలెను. స్తనములు జానెడు ఉండ వలేను. కటి ప్రదేశము వాటికంటే ఒకటిన్నర కలలు పెద్దదిగా ఉండవలెను. మిగిలిన చిహ్నములన్నియు వెనుకటివలెనే. లక్ష్మికి కుడిచేతిలో కమలము, ఎడమచేతిలో బిల్వఫలము ఉండవలెను. చామరము ధరించిన స్త్రీలు ఆమె పార్శ్వ లందు నిలిచి ఉండవలెను. పెద్ద ముక్కుగల గరుత్మంతుడు ఎదుట నిలిచి ఉండవలెను. ఇపుడు చక్రాంకిత (సాలగ్రామాది) మూర్తులను గూర్చి చెప్పెదను.

ఆగ్నిపురాణమునందు పిండికాది లక్షణమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.