అగ్ని మహా పురాణము
240 - అథ పునః షాడ్గుణ్యమ్
శ్రీ రామ ఉవాచః
శ్రీరాముడు చెప్పెను : రాజు ముఖ్యముగ ద్వాదశమండలములను గూర్చి ఆలోచించుచుండవలెను. విజిగీషువగు (జయింపనిచ్చగ) రాజునకు పురోభాగము నందు 1) అరి 2) మిత్రుడు 3) అరిమిత్రుడు 4) మిత్రమితుడు 5) ఆరిమిత్ర మిత్రుడు అను రాజులు (ఒకరితరువాత ఒకరు) ఉందురు. వెనుక భాగమున !) పార్ష్ణిగ్రాహుడు 2) ఆక్రందుడు, పార్ష్ణిగ్రాహాసారుడు 3) ఆక్రందాసారుడు అను రాజులు (ఒకరి వెనుక ఒకరు) ఉందురు. ఆవిజిగీషవుల రాజ్యసీమలతో కలియు రాజ్యసీమ కలవాడు మధ్యముడు. అరివిజిగీషవులు కలిసినచో మధ్యముడు కోశము, సైన్యాసాహాయ్యము చేసి వీరు రువుని అనుగ్రహింప సమర్థుడగును. కాని వీరిరువురును కలియకపోయినచో మధ్యమరాజు వీరిరువురిని వేరువేరుగాగాని క్రమమన గావి చంప సమర్థుడగును. వీరందరి మండలముల వెలుపలనున్న అధిక బలశాలియు ఆధిక సైన్య సంపన్నుడును అగు రాజు ఉదాసీనుడు. విజిగీషు - అరి - మధ్యములు కలిసినచో ఉదాసీనుడు వీరిపై అనుగ్రహము మాత్రము చూప గలుగును. వీరు కలియకపోయినచో వీరినందరిని పరిమార్చి వేయగలుగును.
లక్ష్మణా ! నీకిపుడు సంధి - విగ్రహ - యాన - ఆసనాదుల విషయమును చేప్పెదను. బలవంతుడగు రాజుతో యుద్దము వచ్చినపుడు తన పరిస్థితి శోచనీయముగ నున్నచో అపుడు సంధి చేసికొనుటయే మంచిది. కపాల - ఉపహార - సంతాన - సంగత - ఉపన్యాస - ప్రతీకార - సంయోగ - పురుషాంతర - అదృష్టనర - ఆదిష్ట - ఆత్మా మిష - ఉపగ్రహ - పరిశ్రయ - ఉచ్ఛిన్న - పరదూషణ - స్కంధోపగేయములని సంధిలో పదునారు భేదము లున్నవి. ఎవరితో సంధి చేసుకొనుచున్నారో అతడు సంధేయుడు. అభియోక్త అనభియో క్తఅని సుధేయుడు రెండు విధములు. ఆనభియో క్తతో (ఆక్రమణము చేయని వానితో) ఉపన్యాస - ప్రతీకార - సంయోగములను మూడు సంధులు చేసికొనవలెను. మిగిలినవి అభియోక్త (ఆక్రమణకారి)తో చేసికొనవలెను. కొందరి అభిప్రాయము ప్రకారము పరస్పరోపకారము, మైత్రము, సంబంధజము, ఉపహారము అని నాలుగు మాత్రమే సంధి భేదములు, బాలకుడు, వృద్ధుడు, చిరకాలరోగి, బంధుసోదరాది బహిష్కృతుడు, పిరికివాడు, పిరికిపందలైన సైనికులు గలవాడు, దురాశాపరులగు సేవకులు గలవాడు, అమాత్యాడిప్రకృతుల అనురాగము కోల్పోయినవాడు, అత్యంత విషయాసక్తుడు, ఆస్థిరచిత్తుడై అనేకుల ఎదుట మంత్రమును ప్రకటించువాడు, దేవతాబ్రాహ్మణనిందకుడు, దైవహతుడు, దైవమే సంపద్విపత్తులకు కారణమని నమ్మి పురుష ప్రయత్నము చేయనివాడు, దుర్భిక్షక్లేశములో నున్న వాడు, కారాగారమునందుంచబడిన లేదా శత్రువుచే చుట్టుముట్టబడిన సైన్యముకలవాడు, అయోగ్య ప్రదేశమునందున్న వాడు, చాలమంది శత్రువులు కలవాడు, యుద్ధమునకు తగిన సమయమున తన సేనను నియమించని వాడు, సత్యధర్మభ్రష్టుడు - ఈ ఇరువది రకముల రాజుతో సంధి చేసికొనగూడదు; విగ్రహము మాత్రమే చేయవలెను.
ఒకరికొకరు అపకారము చేసికొనుటచే మనుష్యులలో పరస్పరము కలహమేర్పడును. అభ్యుదయము కోరు రాజు శత్రుపీడితుడైనపుడు దేశకాలముల అనుకూలత్వమును, సైనిక శక్తిని చూచుకోని విగ్రహము ప్రారంభింపవలెను. సప్తాంగ రాజ్యము, స్త్రీలు, జనపదమునందలి స్థానవిశేషము, రాష్ట్రములోని ఒక భాగము, జ్ఞానప్రదులగు ఉపాధ్యాయాదులు, సేన - వీటిలో దేనినైన అపహరించుటచే విగ్రహము ఏర్పడును. ఈ కారణములేగాక, మదము, అహంకారము, జనపదపీడ, జనమును నశింపచేయుట, ధనమునకు విఘాతము కలిగించుట, శక్తులకు విఘాతము, ధర్మవిఘాతము, దైవము, మిత్రకార్యసాధనము, మాననీయుల ఆవమానము, బంధువర్గ వినాశము, ప్రాణులకు తానిచ్చిన ఆభయమును విచ్చేదిఁచుట, మండలదూషణము ఒకే ప్రయోజనమును ఇరువురు ఆపేక్షించుట ఈ ఇరువది కూడ విగ్రహాహేతువులు. కొందరు విగ్రహము, సాపత్నము (సవతి సోదరుల మధ్య ఉండునది), వాస్తుజము (భూసువర్ణాది హేతుకము), స్త్రీ హేతుకము, కటువచన జనిత క్రోధహేతుకము, అపరాధజనిత ప్రతిక్రియా బుద్దిచే ఏర్పడునది అని ఐదు విధములని చెప్పిరి. ఫలితము చాల తక్కువ ఉండునది, నిష్ఫలము, ఫలప్రాప్తి విషయమున సందేహమున్నది, వెంటనే దోషములను కలిగించునది, భవిష్యత్తులో కూడ నిష్ఫలమైనది, వర్తమాన భవిష్యత్తులందు రెండింటి యందును దోషజనకమైనది, ఎంత బలపరాక్రమములున్నవాడో తెలియని శత్రువుతో ఏర్పడినది, ఇతరులచే రెచ్చగొట్టబడినది, ఇతరుల స్వార్థ సిద్ది కొర కై గాని. ఏదైన ఒక సాధారణ స్త్రీని పొందుటకు గాని ఏర్పడినది, సుదీర్ఘ కాలము సాగునట్లు కనబడునది, శ్రేష్ఠులైన ద్విజులతో ఏర్పడినది. సుదీర్ఘ కాలము సాగునట్లు కనబడునది, శ్రేష్ఠులైన ద్విజులలో ఏర్పడినది, దేవతావరములను పొంది ఆకస్మాత్తుగా బలవంతుడైన వానితో ఏర్పడినది, అధిక బలశాలుగు మిత్రులు కలవానితో సంభంచినది, వర్తమానమునందు ఫలమునిచ్చి నను భవిష్యత్తునందు నిష్ఫలమైనది. భవిష్యత్తునందు ఫలప్రదమైనను వర్తమాన మున నిష్ఫలమైనది-- ఈ పదునారు విధములగు విగ్రహములలో ఎన్నడును చిక్కుకొనరాదు. వర్తమానమునందును భవిష్యత్తునందును గూడ పూర్ణఫలము నీయగలుగు విగ్రహమును మాత్రమే రాజు ఆవలంబింపవలెను.
తన సేన హృష్టపష్టమై ఉత్సాహముతో ఉన్నట్లును, శత్రుసేన ఇందుకు విపరీతముగా నున్నట్లును నమ్మకము ఏర్పడిన పిదప రాజు శత్రువును నిగ్రహించుటకై విగ్రహము నవంబింపవలెను. మిత్ర - ఆక్రంద - ఆక్రందాసారులకు తనపై దృఢభక్తి యుండి శత్రువు పరిస్థితి దీనికి భిన్నముగా నున్నపుడు విగ్రహము ప్రారంభింపవలెను. విగృహ్యగమ నము, సంధాయగమనము, సంభూయగమనము, ప్రాసంగిక గమనము, ఉపేక్షాపూర్వకగమనము అని యానము ఐదు విధములని నీతిజ్ఞులు చెప్పుదురు. శత్రువు, విజిగీషువు కూడ ఒకరినోకరు ఏమియు చేయజాలక పోపుటచే ఆక్రమణము చేయక కూర్చుండుట “ఆసనము”, యానము నందువలె దీనియందు కూడ విగృహ్యాసవము, సంధాయాసనము, సంభూ యాసనము, ప్రసంగాసనము, ఉపేక్షాసనము అని ఐదు భేదములున్నవి. బలవంతులగు ఇద్దరు శత్రువుల వద్దకు రహస్య ముగా “నేను నారాజ్యము కూడ నీకు చెందినవే” ఆని రహస్యముగా వార్త పంపి తాను దుర్గమునందు ఓదాగియుండుట “ద్వైదీభావము”, ఆ శత్రువు లిద్దరును కలిసి ఆక్రమణము చేసినచో వారిలో ఆధిక బలశాలిని శరణు పొందవలెను. వారిరువురును తనతో, ఎట్టిషరతుపైనను గూడ, సంధిచేసికొనుటకు నిరాకరించినచో వారిరువురికిని శత్రువైన మరొక రాజును గాని, అధిక బలశాలియగు రాజును గాని ఆశ్రయించవలెను. బలవంతుడై న శత్రువు ఆక్రమించగా ఆకష్టమునుండి తప్పించుకొను ఉపాయాంతర మేదియులేనపుడు కులీనుడును, సత్యవాది యు, సదాచారవంతుడును, శత్రువు కంటె ఆధిక బలవంతు డును అగు వేరొక రాజును ఆశ్రయించవలెను. ఇట్లు ఆశ్రయము కోరువారు ఆశ్రయదాత దర్శనము కొరకై వానిని ఆరా ధించవలెను. సర్వదా ఆతని అభిప్రాయమునకు అనుకూలముగ ప్రవర్తించవలెను. ఆతని కార్యములు చేయవలెను. సర్వదా ఆతని విషయమున ఆదరము చూపవలెను. ఇది ఆశ్రయించువాని కర్తవ్యము.
ఆగ్ని మహాపురాణము నందు షాఢ్గుణ్యకథనమను రెండువందల నలుబదవ అధ్యాయము సమాప్తము.
