అగ్ని మహా పురాణము

Table of Contents

46 - అథశాలగ్రామాది మూర్తిలక్షణమ్

హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా! సాలగ్రామాదులపై నుండు హరిమూర్తులను గూర్చి చెప్పెదను. ఇది భోగ మోక్షములనిచ్చునది. ద్వారమునందు రెండు చక్రములతో నల్లని సాలగ్రామము వాసుదేవుడు రెండు చట్రములున్న ఎఱ్ఱని శాల గ్రామము సంకర్షణుడు. చిన్న చక్రము, అనేక రంధ్రములును ఉన్న నీలవర్ణ సాలగ్రామము ప్రద్యుమ్నుడు కమల చిహ్నము, గోలాకారము, పచ్చని రంగు, మూడురేఖలు ఉన్నది అనిరుద్ధుడు నాభియందు ఉన్న తమై, పెద్ద రంధ్రములతో నల్లగా నుండునది. నారాయణుడు. కమల - చక్రచిహ్నములు, పృష్టభాగమున రంధ్రము, బిందువు ఉన్న శాలగ్రామము పరమేష్టి. స్థూలమైన చక్ర ము మధ్య గదవంటి రేఖ ఉన్న శ్యామవర్ణమగు శాలగ్రామము విష్ణువు. స్థూలచక్రము ఐదు బిందువులు ఉన్న కపిలవర్ణ కాలగ్రామము నృసింహుడు, శక్తి అను అస్త్రము గుర్తు, విషమము లైన రెండు చక్రములు, మూడు స్థూల రేఖలు ఉన్న ఇంద్రనీలమణి వంటి రంగుగల శాలగ్రామము వరాహము. ఎత్తైన పృష్ఠ భాగము, గోలాకారమైన సుడి ఉన్న శ్యామవర్ణ శాలగ్రామము కూర్మము. అంకుశ రేఖలు, బిందువులు ఉన్న నీల వర్ణ శాలగ్రామము హయగ్రీవుడు ఒక చక్రము, ఒక కమలము, పుచ్చాకార మైన రేఖలు ఉన్న, మణి వలె ప్రకాశించు శాల గ్రామము వైకుంఠుడు మూడు బిందువులతో, కంచు వలే తెల్లగానుండు, పెద్ద ఆకారముగల శాలగ్రామము మత్స్యము. వనమాల, ఐదురేఖలు గల గోలాకారమైన శాలగ్రామము శ్రీధరుడు. చాల చిన్నదై, బిందువులుండి, గోలాకారమైన నీల కాలగ్రామము వామనము కుడి ప్రక్క హర రేఖయు, ఎడమ ప్రక్క బిందువులు, ఉన్న శ్యామ వర్ణమగు శాలగ్రామము త్రివిక్రముడు. సర్ప శరీర చిహ్నము, అనేక మూర్తులు ఉండి, చాలరంగులతో ప్రకాశించు శాలగ్రామము అనంతుడు - ఆది శేషుడు, మధ్యభాగమున చక్రము, క్రింద సూక్ష్మబిందువు ఉన్న స్థూలమగు శాలగ్రామము దామోదరుడు ఒక చక్రశ్రీ మదగ్ని మహాపురాణము మున్న శాలగ్రామము సుదర్శనము, రెండు చక్రములున్నది. లక్ష్మీనారాయణుడు, మూడు చక్రములున్నది అచ్యుతుడు, లేదా త్రివిక్రముడు. నాలుగు చక్రములున్నది జనార్దనుడు ఐదు చక్రము లున్నది వాసుదేవుడు. ఆరు చక్రములున్నది ప్రద్యుమ్నుడు, ఏడు చక్రములున్నది సంకర్షణుడు ఎనిమిది చక్రములున్నది పురుషోత్తముడు. తొమ్మిది చక్రములున్నది నవవ్యూహము. పది చక్రములున్నది దశావతారమూర్తి పదకొండు చక్రములున్నది అనిరుద్ధుడు. పండ్రెండు చక్రము లున్నది ద్వాదశాత్మ. అంతకంటే అధిక చక్రములున్నది అనంతుడు.

అగ్ని మహాపురాణము నందు శాలగ్రామ మూర్తి వర్ణనమను నలుబది యారవ అధ్యాయము సంపూర్ణము.