అగ్ని మహా పురాణము

Table of Contents

368 - అథ నిత్య నైమిత్తికప్రాకృతప్రలయాః

అగ్ని రువాచః

అగ్ని పలికెను ప్రళయము నాలుగు విధముల. నిత్యము జరుగుచున్న ప్రాణుల మృత్యువు నిత్య ప్రళయము. ప్రాణులందరును పూర్తిగా నశించుట బ్రాహ్మలయము లేదా నైమిత్తిక లయము. చెయ్యి చతుర్యుగములు గడచిన పిమ్మట పచభూతములు ప్రకృతిలో లీనమైనపుడు అది ప్రాకృతలయము. జ్ఞానము వలన జీవాత్మ పరమాత్మలో లీనుడగుట ఆత్యంతిక లయము. కల్పాంతమున జరుగు నైమిత్తి కలయమును గూర్చి చెప్పెదను, చతుర్యుగ సహస్రాంతమున భూమి చాలా వరకు క్షీణమై పోవును. నూరు సంవత్సరములు భయంకరములైన అనావృష్టి ఏర్పడును. ప్రాణులఁదరువు నశింతురు. అపుడు జగత్పతియైన విష్ణువు సూర్యుని ఏడు కిరణముల ద్వారా భూపాతాళ - సముద్రాదులలో వున్న జల మును నశింపచేయును. పిదప ఆయన ప్రభావముచే ఆ జలమును పీల్చటచే పుష్టి చెందిన ఆ ఏడు రశ్ములు ఏడుగురు భాస్కరులుగా ఏర్పడి పాతాళ తల శీతమగు త్రైలోక్యము నంతను భస్మము చేయుము. అపుడు భూమి తాబేలు పైభాగము వలె కనబడును. ఆది శేషుని శ్వాసనుండి కాలాగ్ని రుదుడు ఆవిర్భవించి క్రిందనున్న పాతాళములను భస్మము చేయును. పిదప విష్ణువు భూమిని స్వర్గమును కాల్చివేయును. ఆ సమయమున త్రైలోక్యము ప్రజ్వలించుచున్న మంగలము వలె కన బడును. అపుడు తాపముతో బాధపడుచున్న భువర్లోక స్వర్గలోక వాసులు మహర్లోకమునకు వెళ్ళి అచట నుడి జనలోకము సకు వెళ్ళుదురు. ఇట్లు రుద్రరూపి జగత్తును కాల్చి వేయగ హరి యొక్క శ్వాసము నుండి మెరుపులతో గూడిన వివిధ రూపములు గల మేఘములావిర్భవించును. నూరు సంవత్సరములు వర్షించి ఆ అగ్నిని శమింప చేయును. ఆ ఆలము స పర్షి స్థానము వరకు చేరిన పిమ్మట, విష్ణు ముఖము నుండి బయలుదేరిన నిశ్వాసము వాయురూపమున వంద సంవత్సరములు వీచి ఆమేఘములను చెదర గొట్టును. పిదప ఆహరి హయువును త్రాగివేసి ఏకార్ణవమునందు ఆది శేషుని పై శయనించును. ఆ సమయమున సిద్ధులు, మహర్షులు, బ్రహ్మరూప ధారియగు ఆతనిని స్తుతింతురు. మధుసూదనుడు ఆత్మ మాయా రూప మగు దివ్య యోగ నీ దను అవలంబించి తన వాసు దేవ స్వరూపమును చింతించుచు ఒక కల్పము కొలము శయనించును. పిదపలేచి బ్రహ్మరూపియై మరల సృజించును. ఈ విధముగ బ్రహ్మ యొక్క రెండు పరార్దమాల ఆయుర్దాయము గడచిన పిమ్మట ఈ స్థూల ప్రపంచము ప్రకృతి యందు లీనమగును.

ఒకటి నించి పదిచొప్పున గుణించుచు పోగ పదునెనిమిదవ స్థాపము చేరునప్పటికి ఎంత సంఖ్య వచ్చునో ఆది పరార్ధము. దానికి రెట్టింపు కాలము గడచిన పిమ్మట ప్రాకృత ప్రళయము ఏర్పడును. వర్షములు లేకపోవుటచే అగ్ని ప్రజ్వలించి అంతయు భస్మమైపోవును. మహత్తత్వము మొదలు విశేషము వరకు ఉప కార్యములన్నియు నశించును. భగవంతుని ఇచ్చను అమసరించీ ఆప్రళయము రాగా జలము భూమిలో వున్న గoధాది గుణములన తనలో లీనము చేసు కొనును. ఆపుడు గంధమానమగు పృథివి నీటిలో లీనమైపోవును. పిదప రసమయమగు జలము మిగులును. రసము జలమున గుణము. ఆగ్ని ఆర సమును త్రాగి వేయగా జలము లీనమైపోవును. ఆగ్ని తత్త్వము ప్రజ్వలించును. పిమ్మట తేజస్సు యొక్క ప్రకాశ గుణమున వాయువు మింగి వేయును. ఈ విధముగా అగ్ని తత్త్వమా లీనమై పోగా గొప్ప వాయువు వీచును. వాయువు యొక్క గుణమగు స్పర్శను ఆకాశము మ్రింగి వేయగా, వాయువు నశించి ఆకాశ ము మాత్రము నిశ్శబ్దముగా మిగులును. రూతములకు కారణమగు అహంకారము ఆకాశ గుణ మగు శబ్దమును మ్రింగి వేయగ తేజసాహంకారము ఇంద్రియములను తనలో లయము చేసుకొనను దానిని మహత్తత్వము తనలోన లీనము చేసుకొనుము. ఈ విధముగా భూమి జలము నందు, జలము అగ్ని యందు, అగ్ని వాయువు నందు, వాయువు ఆకాశము నందు, ఆకాశము ఆహంకారము నందు, అహంకారము మహత్తత్వమునందు లీన మగువ. దానిని ప్రకృతి తనలో లీనము చేసుకొనును. “వ్యక్త, “అవ్య క్ష” అని ప్రకృతి రెండు విధములు. “వ్యక్త” అవ్యక్తములో లీన మగును. ఆవివాళియు, చద్ద స్వరూపుడు అగు ఏకైక పురుషుడు ఎవడున్నాడో అతడు కూడ పరమాత్మ అంశమే. చివరకు ప్రకృతియు పురుషుడును పరమాత్మ యందేలీన మగును. ఆ పరమాత్మ సత్స్వరూపము జ్ఞేయము, జ్ఞాన మయము, బుద్ద్యాదుల కంటే పరమ. ఆ పరమాత్మ యందు నామ, జాత్యాది కల్పనలు వుండవు.

ఆగ్ని మహా పురాణము నిత్య నైమిత్తిక ప్రాకృత - ప్రళయ వర్ణన మను మూడు వందల అరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.