అగ్ని మహా పురాణము

Table of Contents

336 - అథ శిక్షా నిరూపణమ్

అగ్ని రువాచః

అగ్నిదేవుడు పలికెను. ఇపుడు శిక్ష చెప్పెదను మొత్తము వర్ణములు ఆరువది మూడు, లేదా ఆరువది నాలుగు వీటిలో ఇరువది ఒక్క స్వరము . ఇరువది యైదు స్పర్శలు, ఎనిమిది యాదులు, నాలుగు యమములు, చెప్పబడినవి. అనుస్వార విసర్గలు, పరాశ్రితములగు జిహ్వమూలీయ ఉపద్మా నీయములు, దుస్పృష్ట లకారము, ఇవి ఆరువది మూడు వర్ణములు. ప్లుతలు కారము చేర్చినచో ఆరువది నాలుగు. అనుస్వారోచ్చారణము ఖే, ఆరా వలె వుండును. హ అనువది. జు కారాది పంచమాక్షర ములు, య, ర, ల, వ, లు వీటితో కలిసినపుడు ఉర స్యమగును. వీటితో సంయుక్తము కానిచో కంఠ్యము ఆత్మ బుద్ధితో పదార్ధములను ఆలోచించి, చెప్పవలెనను ఇచ్చచే మనస్సుతో కలియును, ఆ మనస్సు జఠరాగ్నిని కొట్టును జఠరాగ్ని వాయువును ప్రేరేపించును. ప్రాణవాయువు హృదయమునందు చరించుచు ప్రాతస్సవన కర్మకు సాదర మును, గాయత్రి ఛందస్సమాశ్రితమును అగు మంద్రస్వరమును పుట్టించును. పిదప ప్రాణ వాయువు కంఠమున తిరుగుచు మాధ్యందినయుతమగు మంతోప యోగియైవ మధ్యమస్వరమును పుట్టించును. పిదప ఆ వాయువు శిరోదేశ మను చేరి ఉచ్చ ధ్వనియుక్తమగు జగతీచ్చంద సమాశ్రితమైన సాయంసవవ కర్మ సాధనమైన స్వరమును పుట్టించును. పైకి వెళ్లిన ఆప్రాణవాయుపు మూర్ధసానమున ఆఘాతము చెంగి ముఖము నందలి కంఠాదిస్థానము నందు చేరి వర్ణములను పుట్టించును. స్వరము, కాలము, స్థానము ఆథ్యంతర ప్రయత్న ము, బాహ్య ప్రయత్నము వీటిని బట్టి వర్ణములలో ఐదు వి భాగములు వుండును. వక్షము, కంఠము, మూర్ధా, జివ్వమూలము. దంతములు, నాసిక, ఓష్ఠములు, కొలువు యని ఎనిమిది వర్లోచ్చారణ స్థానములు. ఊష్మ వర్ణములకు విసర్గాభావము, వివర్తనము, సంధ్య భావము శ కారాదేశము, షకారాదేశము, సకారాదేశము. రేఫాదేశము, జివ్వమూలీయత్వము, ఉపధ్మా నీగుత్వము, యని ఎనిమిది విధములైన గతులుండును. ఉకారము పరమగు నపుడు ఓ కార ప్రసంధానముయైనచో ఆడీ కారము స్వరాంతమని తెలియవలెను. దీనికి భిన్నముగ సంతి స్థలమవ ఏర్పడు ఓకారము ఊష్మ యొక్క గతి విశేషము. చెడ్డ గురువు మండి లభించిన వేదాధ్యయనము దగ్గమై నీరస ముగ నుండును. అక్షరములను ఇటులాగి అబులాగి అర్థము చెప్పినచో ఆది థక్షితము ఉత్తమ గురువు నుండి ఆధ్యయనము చేసినచో అదిశుభకరము. సుస్వరముతో మంచి వక్రముతో చేయబడిన వేదాధ్యయనము ప్రకాశ వంతముగ నుండును. వికృతమైన ఆహార ములేని వాడు లంబోష్టుడు కాని వాడు అవ్యకోచ్చారణ చేయనివాడు ముక్కుతో పలకనివాడు, గద్దద కంఠము లేనివాడు జిహ్వా బంధము లేనివాడు ఆట్టి మనుష్యుడే వర్ణములను సరిగా ఉచ్చరింప గలుగును. వర్ణములను అవ్య క్తముగా గాని పీడితములుగా గానీ ఉచ్చరించ కూడదు. వర్ష ప్రయోగము చక్కగా చేసినచో బ్రహ్మలోక మున పూజించబడును  ఉదాత్తము అనుదాత్తము స్వరిత ముయని స్వరము మూడు విధముల ఉచ్చారణ కాలమును బట్టి హ్రస్వము దీర్ఘము ప్లుతము యని మూడు విధములు. ఆ, హ. తారములు కంఠ్యములు, ఇ, చవర్గయ కారశకారములు తాలవ్యములు  ఉకార పవర్గణము, ఓష్ఠ్యములు ఋకార టవర్గ, రేఫ షకారములు మూర్ధన్యములు. ఐ కార తవర్గ లకార స వర్ణములు దంత్యములు కవర్గ జిహ్వా మూలీయము, వకార ము దంత్యోష్ఠ్యము ఏఐ కారములు కంఠతాలవ్యములు ఓఔకార ములు కంఠోష్ఠ్యజములు, ఏఐ ఓఔలలో, కంఠస్థానీయ మగు ఆకారము యొక్క ఆర్ధ మాత్ర వుండును. ఆయోగ వాలు తమ ఆశ్రయమునకు ఏస్థానమో ఆస్థానము కల్గియుండును. అచ్చులు అస్పృష్టములు యణ్ లు ఈషత్పష్టములు, ఆశల్లు ఆర్ధ స్పష్టములు మిగిలిన హల్లులు స్పృష్టములు. ఇమ్లు అనునాసికము. ఆరేపలు అనునాసికములు కావు. హ, రు, షలకు సం వార ఘోషనాద ప్రయత్నము, యణ్ జక్ లను ఈషన్నాద ప్రయత్నము ఖ, ఫ, మొదలగు నవినివారం ఘోష శ్వాస ప్రయత్న కములు చర్లు ఈశ చ్ఛ్వాసములు.

ఆగ్ని మహాపురాణమున శిక్షావర్ణనయను మూడువందల ముప్పదియారవ ఆధ్యాయము సమాప్తము.