అగ్ని మహా పురాణము
214 - అథ మంత్ర మాహాత్మ్య కథనమ్
అగ్ని రువాచః-
ఆగ్నిదేపుడు చెప్పెను : ఇపుడు నాడీచక్రమును గూర్చి చెప్పెదను దీనిని తెలుసుకొనుటచే శ్రీమహావిష్ణు జ్ఞానము కలుగును. నాభి క్రింద మూలాధారచక్రముండును. దానినుంచి అంకురమువలె నాగులు బయల్వెడలును. నాభిమధ్య యందు డెబ్బది రెండువేల నాడులున్నవి. చక్రాకారముననున్న ఈనాడులు శరీరమునకు క్రింద, పైన, ప్రక్కల అంతటను వ్యాపించి యున్నవి. వీటిలో -ఇడా, పింగళ, సుషుమ్నా, గాంధారీ, హస్తిజిహ్వా, పృథా, యశా, ఆలంబుషా, కుహూ, శంఖినీ ఆను వదినాడులు ప్రధానమైనవి. ఇవి ప్రాణవాయు ప్రసార ముచేయు పది ప్రధాననాడులు. ప్రాణ-ఆపాన-వ్యాన-ఉదాన- సమాన నాగ - కూర్మ - కృకర - దేవదత్త - ధనంజయములనునవి పది ప్రాణవాయువులు. వీటిలో ప్రాణవాయువు అన్నింటికి ఆధిపతి. రిక్త (శూన్య) త్వమును పూర్తిచేయుటకై ఈ ప్రాణము ఇతర ప్రాణవాయువులను ప్రేరేపించును; సకలప్రాణుల హృదయవేళ మునందుండి అపాన వాయువుద్వారాజరుగు మలమూత్ర త్యాగముచే ఏర్పడు రిక్తత్వమును నిత్యము పూడ్చును. జీవుని ఆశ్రయించి యున్న ఈ ప్రాణము శ్వాస - ఉచ్ఛ్వాస - కాసాదుల ద్వారా ప్రయాణము (గమనాగ మనములు) చేయునుగాన ‘ప్రాణ’ మని చెప్పబడుచున్నది. అపానవాయువు ఆహార మును, మూత్ర - శుక్లాదులను క్రిందికి తీసికొనిపోవును. ఇట్లు అపానయనము (తొలగించుట) చేయుటచే ‘ఆపాన’ మైనది. తిన్న ఆహారమును, త్రాగిన జలాదులను, వాసనచూసిన పదార్థములను రక్త - పిత్త - కఫ వాతములను సమావరూపమున సర్వాంగ ములందు ప్రసరింపచేయువది ‘సమానము’. ఉదానము ముఖమును, ఆధర ములను స్పందింపజేయును, నేత్రముల ఎరుపును అధికము చేయును; మర్మ స్థానములను ఉద్విగ్నము చేయును; అందుచే దీనికి ‘ఉదానము’ అని పేరు. వ్యానము ఆంగములను పీడించును. వ్యాధి ప్రకోపము కలిగించుమ. కంఠమును అవరుద్ధము చేయును. వ్యాపన శీలమగుటచే ఇది “వ్యానము”. నాగవాయువు త్రేణుపు, వాంతిమొదలగునవి చేయును. కూర్మవాయువుకంటి రెప్పల మూయుట తెరచుట చేయును. కృకరము భక్షణ మునందును, దేవదత్తము ఆవులింతలందును ఉండును. ధనంజయమునకు స్థానము ఘోషము. ఇది మృతశరీరమును కూడ విడువదు. ఈ పదింటితో జీవుడు ప్రయాణము చేయును. ఆందుచే దశ ప్రాణభేదముచే నాడిచక్రమునకు గూడ పది భేదములేర్పడు చున్నవి.
సూర్యగతిచే ఏర్పడు సంక్రాంతి - విషువ - దిన - రాత్రి ఆయన - ఆదిమాస - ఋణ - ఊనరాత్ర - ధనములను పదిదశలు శరీరములో కూడ ఏర్పడును. ఈ శరీరమునందు ఎక్కిళ్లు ఊనరాత్రము. ఆవులింత ఆధిమాసము. దగ్గు ఋణము; నిశ్వాసము ధనము. శరీరములో నున్న వామనాడి ఉత్తరాయణము. దక్షిణనాడి దక్షిణాయనము. ఆ రెండింటి మధ్య నాసికారంధ్రద్వయము నుండి బయల్వెడలు శ్వాసవాయువు విషువము. ఈ విషువవాయువు తన స్థానమునుండి చరించి రెండవస్థానమునకు పోవుట సంక్రాంతి. ద్విజశ్రేష్ఠా! శరీర మధ్యభాగమునందు సుషుమ్న, వామభాగమున ఇడ, దక్షిణ భాగమునపింగళ ఉన్నవి. ఊర్ధ్వగతిగల ప్రాణముదినము; ఆధోగతిగలది రాత్రి, ఒక్క ప్రాణవాయువే దశ వాయు రూపమున విభక్తమైనది. దేహములోపల ప్రాణవాయువు ఆయామము చెందుట “చంద్రగ్రహణము” ఆది దేహము పైభాగము వరకు వ్యాపించినచో సూర్యగ్రహణము.
సాధకుడు ఎంత శక్యమగునో ఆంతవాయువు లోనికి తీసికొనవలెను. ఇది దేహమును నింపు ‘పూరక’ ప్రాణాయామము. శ్వాస బైటికి పోకుండునట్లు శ్వాసనిశ్వాసలు ఆపివేసి పూర్ణ కుంభము వలెన్నుచో అది ‘కుంభక’ ప్రాణాయామము. పిదప మంత్రవేత్త పైకి ఒకే నాసారంధ్రముచే వాయువును విడచినచో ఆది ‘రేచక’ ప్రాణాయామము. శ్వాసోచ్ఛ్వాస క్రియనే శరీరములో నున్న శివరూపబ్రహ్మ యొక్క ఉచ్చారణము (సోహంహంస అనువిధమున) జరుగును. గాన తత్వవేత్తలు దీనిని జపమందురు. ఈ విధముగ తత్త్వవేత్త ఒకదినమునందు శ్వాసప్రశ్వాసల ద్వారా 21600 పర్యాయములు మాత్రజపము చేయును. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సంబంధించిన ‘అజపాగాయత్రి’. ఈ ఆజపాజపము చేయువానికి పునర్జన్మ లేదు. చంద్రాగ్ని సూర్యయుక్త మూలాధార స్థిత యగు కుండలినీ శక్తి హృదయ ప్రదేశమునందు అంకురా కారమున నుండును. సాత్విక పురుష శ్రేష్టుడగు యోగి సృష్టిక్రమను నవలంబించి, సృష్టి న్యాసము చేసి, బ్రహ్మరంధ్రము నందున్న శివునినుండి కుండలినీ ముఖమునందు అమృతము ప్రవహించునట్లు భావన చేయవలెను. శివునకు సకలము నిష్కలము అని రెండు రూపములున్నవి. సాకారుడగు శిపుడు సకలుడు, నిరాకారుడు నిష్కలుడు. వారు ‘హంసహంస’ అని జపము చేయుదురు. హంస అనగా సదాశివుడు, తిలలలోతైలము, పుష్పముల లో సుగంధము ఉన్న విధముగ జీవాత్మకు లోపలను వెలుపలను సదాశివుడు నివసించును. బ్రహ్మ హృదయమునందును, విష్ణువు కంఠమునందును, తొలమధ్యభాగమున రుద్రుడు, లలాటముక మహేశ్వరుడు, ప్రాణాగ్రము నందు సదాశివుడును ఉందురు. వీటి అన్నింటికి అంతమునందు పరాత్పర బ్రహ్మ ఉండును. సకల పరమాత్మ బ్రహ్మ - విష్ణు - రుద్ర మహేశ్వర - సదాశివరూపముననుండును. నిర్గుణుడు, నిష్కలుడు అగు పరమాత్మ ‘నిష్కలుడు’.
ఆవాహతనాదమును ప్రాసాదమువరకు లేవదీసి నిరంతర జపముచేయు యోగి ఆరు మాసములలోనే సిద్ధినిపొందును; సంశయము లేదు. గమనాగమన జ్ఞానముచే సమస్త పాపములును నశించి అణిమాదిసిద్దులు, గుణములు, ఐశ్వర్యము ఆరు మాసములలో లభించును. స్థూల, సూక్ష్మము పరము అను మూడు విధములగు ప్రాసాదమును వర్ణించితిని. ప్రాసాదమును హ్రస్వము, దీర్ఘము, ప్లుతమ అను మూడురూపమాలలో గుర్తించవలెను. హ్రస్వము పాపములమ దహించివేయును, దీర్ఘము మోక్షప్రదము. ప్లుతము తృప్తిప్రదము. దీని శిరస్సు పై బిందువు (అనుస్వారము) ఉండును. మారణకర్మల యందు హ్రస్వప్రాసాద మంత్రమునకు ఆద్యంతములందు ‘ఫట్’ చేర్చి జపము చేసిన మంచిది. ఆద్యంతములందు ‘నమః’ చేర్చి జపము చేసినచో అది ఆకర్షణధకము, మహాదేవుని దక్షిణామూర్తి సంబంధి మంత్రమును నిలబడి నాలుగులక్షలు జపించి, జపాంతమున పదివేల ఆజ్యహోమములు చేసినచో మంత్రసిద్ది కలుగును. పిదప దానితో వశీకరణోచ్చాటనాదులు చేయవచ్చును. పైనను, క్రిందను, మధ్యయందును శూన్యమేన త్రిశూన్య నిరామయమంత్రము తెలిసికొనిన ద్విజుడు తప్పక ముక్తిపొందును. ఐదు మంత్రముల కలయిక చే చాల పెద్దది, ముప్పదియేడు కలలతో కూడినది అయిన ప్రాసాదమంత్రము నేరుగ నివాడు ఆచార్యుడు కాజాలడు. ఓం కారము, గాయత్రి, రుద్రాది మంత్రములు తెలిసినవాడే గురువు.
అగ్ని మహాపురాణమునందు నాడీచక్ర కథనమను రెండువందల పదునాల్గవ అధ్యాయము సమాప్తము.
