అగ్ని మహా పురాణము

Table of Contents

149 - అథ లక్షహోమకోటిహోమః

ఈశ్వర ఉవాచః-

పరమేశ్వరుడు పలికెను : హోమము చేయుటచే యుద్దమునందు విజయము కలుగును; విఘ్నము నశించును. ముందుగా కృచ్చవ్రతము చేసి దేహమును శుద్దము చేసికొనవలెను, నూరు ప్రాణాయామములతో శరీరమును శుద్ధము చేసి కొని జలమునందు నిలిచి గాయత్రీజపము చేసి పదునారు ప్రాణాయామములు చేయవలెను. పూర్వాహ్లమునందు ఆగ్నిలో ఆహుతులు సమర్పించవలెను. భిక్షా ప్రాప్త మగు యవనిర్మితభోజ్యపదార్థములను, ఫలమూలములను, క్షీర మును, పేలాల పిండిని, మృతమును యజ్ఞకాలమున ఆహారముగా తీసికొనవచ్చును. పార్వతీ! లక్షహోమములు పూర్తి యగునంతవరకు ఒక పర్యాయమే భోజనము చేయవలెను. లక్షహోమములు పూర్ణాహుతి చేసిన పిమ్మట గోవులను, వస్త్రములను, సువర్ణ మును దక్షిణగా ఇవ్వవలేను. ఏ విధమైన ఉత్పాతములు కనబడినను ఐదుగురు లేదా పదిమంది ఋత్విక్కులతో పైన చేప్పిన యజ్ఞము చేయించవలెను. ఈ లోకములో దీని చే శాంతించని ఉత్పాత మేదియు లేదు. దీనిని మించిన మంగళకర మైనది మరేదియు లేదు. పూర్వోక్త విధానము ప్రకారము ఋత్విక్కులచే ఈ యజ్ఞము చేయించిన రాజు. ఎదుట శత్రువు రణ రంగమున నిలువజాలడు, ఆతని రాజ్యములో అతివృష్టి, అనావృష్టి, ఎలుక లబాధ, మిడతలజాధ, చిలుకలవాధ, భూత రాక్షసాదులు, యుద్ధమునందు సమ స్తశత్రువులు నశించును. కోటిహోమముల కొరకు ఇరువదిమంది గాని, వందమంది. గాని, వేయిమంది గాని, బ్రాహ్మణుల వరణము చేయవలెను. దీనిచే యజమానునకు, అభిష్టధనవై భవప్రాప్తి కలుగును. కోటిహోమాత్మక యజ్ఞము చేసిన బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని ఏది కోరిన ఆది పొందగలుగును. అతడు సశరీరముగ స్వర్గమునకు వెళ్లును. హోమ పూజాదులు గాయత్రీమంత్ర - గ్రహమంత్ర . కూష్మాండమంత్ర ఆగ్ని మంత్ర - ఐంద్రమంత్ర - వారుణ - వాయవ్య - యామ్య ఆగ్నేయ వైష్ణవ - శాక్త - శైవ - సూర్యమంత్రములు. వీటిలో చేయు పద్దతి చెప్పబడినది. అయుతహోమము చే అల్ప మైన సిద్ది కలుగును. లక్షహోమము సకలదుఃఖములను తొలగించును. కోటిహోమము సకలక్లేశములను నశింపచేయును, సకలపదార్ధములను ఇచ్చును. యవ - ధాన్య - తిల- క్షీర - ఘృత . కుశ - ప్రాసాతికా . కమల . తల . బిల్వ - ఆమదలములు - హోమమనకు తగిన పదార్ధములు. కోటి హోమమునకు ఎనిమిది హస్తముల లోతు ఆగ్ని కుండమును, లక్షహోమమునందు నాలుగు హస్తముల లోతు అగ్నికుండమును నిర్మింపవలెను. ఆయుత - లక్ష - కోటిహోమములందు ఆజ్యము ఉవయోగించవలెను.

అగ్ని మహాపురాణమునందు యుద్ధజయారవమున ఆయుతలక్షకోటిహోమ మమ నలుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.