అగ్ని మహా పురాణము
224 - అథ స్త్రీరక్షాది-కామశాస్త్రమ్.
పుష్కర ఉవాచః
పుష్కరుడు చెప్పెను : ఇపుడు అంతఃపుర మును గూర్చి చెప్పెదను. ధర్మార్థకామము లను మూడు పురుషార్థము లకు ‘త్రివర్గ’ మని పేరు. వీటిలో ఒకదానిని మరొక దానితో రక్షించుచు రాజు స్త్రీలతో ఈ త్రివర్గమును సేవించవలెను. త్రివర్గము ఒక మహా వృక్షము వంటిది. ధర్మము దాని వేళ్ళు, అర్థ మ శాఖలు, కామము ఫలము. ఆ వృక్షమును మూల సహితముగా రక్షించిన యడలనే రాజు ఫలమును పొందగలుగును. పరశురామా ! స్త్రీలు కామమునకు వశవర్తనులై యుందురు. వారికొరకై రత్నములను సంగ్రహించవలెను. సిషయసుఖములు కోరు రాజు స్త్రీలను సేవించవచ్చును గాని ఆతిగా చేయగూడదు. ఆహారనిద్రా-మైథునములు మూడింటి యందును అతిగా ప్రవర్తింపరాదు. అట్లు చేసినచో రోగము లుత్పన్నము లగును. తనపై అనురాగముగల స్త్రీలను మాత్రమే తన మంచము మీదకి రానియ్యవలెను. దురాచార వంతురాలు తన భర్తను గూర్చి సంభాషణమును గూడ రుచింపనిదియు, అతని శత్రులతో కలియునదియు, ఆతీగర్వవంతు రాలును, ముద్దు పెట్టుకొన్నపుడు ముఖమును తుడిచి వేయునదియు లేదా కడుగుకొను నదియ, భర్త ఇచ్చిన వస్తువులపై ఆదరము చూపనిదియు, భర్త కంటే ముందుగనే నిద్రించి ఆతడు లేచిన తరువాత లేచునదియు, స్పృశించగా శరీరమున కంపింపచేయునదియు, ప్రతి అవయవమునందును ఆవరోధము కల్పించునదియు, భర్త పలుకు ప్రియవాక్యములను సరిగా వినక పరాజ్ముఖురాలుగా ఉండునదియు, ఎదుటకు వచ్చి, ఏదైన వస్తువు ఇచ్చినపుడు దానిని చూడనిదియు, తన జఘనమును పూర్తిగా ఆచ్చాదించుటకును, భర్త స్పృశించుటకు వీలుకాకుండునట్లు చేయుటకును ప్రయత్నించునదియు, భర్తను చూడగానే ముఖము ముణుచుకొనునదియు, ఆతని మిత్రుల విషయమున వైముఖ్యము చూపునదియు, ఆతడేమే స్త్రీలను ప్రేమించుకో వారి విషయమున ఔదాసీన్యము చూపునదియు, శృంగారించుకొను సమయమునందు కూడ శృంగారించుకొననిదియు అగు శ్రీ విరక్తురాలని అర్థము. అట్టి స్త్రీని పరిత్యజించి ఆనురక్తురాలిని సేవించవలెను. అనురాగపతియైన శ్రీ భర్తను చూడగనే సంతోషముతో వికసితముఖి యగును. మరొక వైపు ముఖమున్నను నేత్రాంతములతో ఆతనిని చూచుచు.డును భర్త తనను చూచుచున్నపుడు తన చంచలదృష్టిని కొంచెము మరొక వైపు తిప్పుకొనును, కాని పూర్తిగా త్రిప్పుకొనదు. ఆప్పుడప్పుడు తన గుప్తాంగములను కూడి చూపుచుండును. తన శరీరములో ఆసుందర మైన అంశమేదైన ఉన్నచో దానిని ప్రయత్న పూర్వకముగ కప్పికొనును. భర్తను చూచుచు చంటిపిల్లవాని ఆంనము చేసికొని ముద్దు పెట్టుకొనును. సంభాషణలో పాల్గొనుచు సత్యమునే పలుకును. భర్త స్పర్శ కలగగనే ఆమే అవయవములపై రోమాంచము, స్వేదము కలుగుచుండును. అతి సులభములైన వస్తువులను మాత్రమే అడుగును. ఆతడేంత చిన్న వస్తువునిచ్చినను చాల సంతసించును. ఆతని పేరు వినగవే ఆనందపరవశురాలై చాల ఆవరించును. భర్తకు తన వ్రేళ్ళ, ఆనవాలు పడిన పండ్లు పంపు చుండును. ఆతని నుండి వచ్చిన వస్తువు అదరముతో గ్రహించి దానిని వక్షఃస్థలము నందుంచుకొనును. తన ఆలింగనముచే భర్త శరీరమునందు ఆమృతలేపము చేయుచున్నట్లుండును. భర్త నిద్రించిన పిమ్మట నిద్రించును. ఆతని కంటే ముందుగనే మేల్కొనును. ఆతని ఊరువులను స్పృశించి నిద్ర నుండి మేల్కొల్పును.
పరశురామా! పెరుగుమీగడలో కొంచెము కపిత్తచూర్ణము కలపగా తయారగు నేతివాసన చాల ఉత్తమమైనది. నెయ్యి, పెరుగు మొదలైనవాటితో యవలు, గోధుమలు మొదలైనవాటి పిండి కలుపగా ఉత్త మములై న ఖాద్యపదార్థములు తయారగును. ఇపుడు వివిధద్రవ్యముల గంధమును కలిగించు విధానము చెప్పెదను. శాచము, ఆచమనము, విరేచనము, భావన, పాకము, బోధనము, ధూపనమః, వాసనము అని ఎనిమిది విధములగు కర్మలు చెప్పబడినవి. కపిత్తము, బిల్వము, నేరేడు, మామిడి, కరవీరము-వీది పల్లవములచేత శుద్ధము చేసిన నీటితో ఏ వస్తువులైనను కడిగి, పవిత్రమగునట్లు చేసినచో దానికి ‘శాచనము’ అని పేరు ఈపల్లవ సులు లభించనిచో నీళ్ళతో కస్తూరి కలిపి వాటితో కడిగినచో శుద్ధియగును. నఖ-కూట - ఘన - జటామాంసీ - స్ప్ప క - శైలేయజ - జల - కుంకుమ - లాక్షా - చందన - అగరు - నీరద - సరం దేవదారు - కర్పూర - కాంతా - వాల-కందురుక - గుగ్గులు - శ్రీనివాస - కరాయలములను ఇరువదియొక యొక్క ద్రవ్యములు ధూపద్రవ్యములు. ఈ ఇరువది పదార్థము లో ఏవై నరెండు తీసికొని, వాటిలో కరాయసము కలిపి, వారిలో నఖము, తేలక ఒక పిండి, మజయచందన చూర్ణము చేర్చి తే కలుపవలెను. ఈ విధముగా ఇష్టానుసారము యథాస్త్రముగా కలిపి ద్రవ్యము లతో ధూపయోగములు తయారగును. త్వచా - నాడీ - ఫం - తై ల - కేసర - గ్రంథి పర్వ - శై.ను - తగర విష్ణుక్రాంలా టోల - కర్పూర - జటామాంసీ - మురా - కూటకములు స్నానోపయుక్త ద్రవ్యములు వీటిలో ఇష్ట మువచ్చిన మూడు ద్రవ్యములు తీసికొని కస్తూరికలిపి, ఇవన్ని యు కలిపిన జలముతో స్నానము చేసినచో కామవృద్ధికలుగును త్వచా - మురా - నలము ను సమానమైనపాళ్ళలో తీసికొని, వీటిలో సగము సుగంధదాల కలిపి, వీటితో స్నానము చేసినచో శరీరమునుండి కమలగంధమువంటి గంధము వచ్చును వీటితో తైలముకూడ పూసికొని స్నానము చేసినచో శరీర మురంగు కుంకుమవర్ణ సదృశముగ నుండును. పైన చెప్పిన ద్రవ్యములు సగముపాటు, తగరముకూడ కలిపినచో శరీర మునుండి చమేలిపువ్వు వాసన వంటివాసనవచ్చును. వాటిలో ద్వ్యామకమను ఓషధికూడ కలిపినచో మౌ సిరి ఇవ్వవాసన వచ్చును. నువ్వులనూనెలో మంజిష్ఠ తగ ర - చోల - త్వచా - వ్యా ఘరఖ - బ - గంధపతములను ఓషధులు కలపగా ముచిసువాసనగల తైలము తయారగును. తిలలను సుందరపుష్పముతో వాసితము చేసి వాటిని ఆడించిచేసిననూనే ఆ పుష్పములవలే సుగంధముగలదగును. ఏలకులు, లవంగాలు, కాకోలము, జాజికాయ, కర్పూరము - వీటిలో ఏదై న ఒకటి జోజపతితో కలిపి నమ నినచో ముఖము సుగంధమగును. కర్పూర - కేసర - కాంతా - కస్తూరీ - మేడపల - కబాబచీర - ఏలా - లవంగ - జా-సుపు - పగ - త్వక్పత్ర - త్రుటి - మోథా - లతా - కస్తూరీ - లవంగ కంటక - జాయఫల - జాయపత్ర - కటుకఫలములను ఒక్కొక్క డబ్బెత్తు చొప్పున కలిపి, చూర్ణముచేసి, దానిలో నాల్గవవంతు వాసితమైన ఖైరసారము కలిపి మామిడిర సముతో అందముగా మాత్రలుచేసి ముఖమునందుంచుకున్నచో ముఖరోగములన్నియు తొలగిపోవును. వేనుక చెప్పిన ఐదుపల్లవముల జలముతో పోక చెక్కను కడిగి, యథాశక్తి గా పైనచెప్పిన మాత్రలకుపయోగించు ద్రవ్యములతో వాసితము చేసినచో ఆస్ ముఖమును సుగంధయుక్త ము చేయును. కటకమును పొంతన క మును మూడు దినములు గో మూత్రమునందు తడిపి ఉంచినచో అది పోక చెక్కవలెనే ముఖమును సుగంధితము చేయును. త్వచారణ్యహర్రే లను సమానమే. ఏళ్ళలో గ్రహించి, దానిలో సము కర్పూరమ కలిపి నోటిలో ఉంచుకొనినచో లాంబూలంధము వచ్చును. ఈ విధముగా రాజు తన సుగంధాది గుణములచే స్త్రీలను వశము చేసుకొని సర్వదావారిని రక్షించవలెను. వారినెన్నడును విశ్వసింపరాదు ప్రధానము పుత్రుని తల్లిని ఎన్నడును. విశ్వసింపరాదు. రాత్రి అంతయు స్త్రీ గృహమున నిద్రింపరాదు. ఆమెచూపిన విశ్వాసము కృత్రిమము కావచ్చును.
అగ్నిహహాపురాణమునందు రాజధర్మకథనమను రెండువందల ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
