అగ్ని మహా పురాణము

Table of Contents

345 - అథ శబ్దార్థయోరలంకారాః

ఆగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. శబ్దాలంకారము ఒక చోట వుంచి హారము స్త్రీ యొక్క స్తనమును కంఠమును కూడ అలంకరించినట్లు శబ్దార్థములు రెండింటిని అలంకరించును. ప్రశస్తి కాంతి ఔచిత్యము సంక్షేపము, యావ దర్థత, అభి వ్యక్తి అని ఇది ఆరు విధములు. ఇతరుల మర్మమును ద్రవింప చేయునట్లు వుండు వాక్కౌశలము ప్రశస్తి. ప్రేమో క్తి స్తుతి అని ఇది రెండు విధముణ. వీటికే ప్రియో క్తి గుణ కీర్తవము అని నామాంతరములు. వాచ్య వాచకము చక్కగా కలిసి యుండుట కాంతి. ఓజో మాధుర్య యుక్త రచన లందు వస్తురీతి వృత్త్యనుసారముగా రసప్రయోగము కలుగునపుడు ఔచిత్యముండును. తక్కువ శబ్దములతో ఎక్కువ అర్థము చెప్పుట సంక్షేపము. శబ్దార్థముల ఆన్యూనానధికముగా వున్నచో దవదగ్ధత అని పేరు. ఆర్థ పాకఠ్యమునకు ఆభివ్యక్తి యని పేరు. శృతి ఆ క్షేపమా అని అది రెండు విధములు. శబ్ద ముచే ఆర్థ మును ప్రత్యక్షముగ బోధించుట శృతి. ఆది నైమిత్తిక ము పారిభాషికము అని రెండు విధము. పరిభాష యనగా సంకేతము గలది పారిభాషికీ. పారిభాషికికి ముఖ్య యనియు, నైమిత్తికికి ఔపచారికము అని పేరు. ఔప చారికము రెండు విధములు. అభిధేయార్థము చెప్పజాలని శబ్దము ఏదైన ఒక నిమి త్తముచే అముఖ్య మగు అర్థమును బోధించినచో ఆది ఔపచారికవృత్తి. నైమిత్తికమునందును కూడ ఈ భేదము లుండును. ఆది లక్షణాయోగముచే లాక్షణికి యనియు గుణ యోగముచే గౌణి యనియు చెప్పబడును. ఎచట అభిధీయార్థముతో సంబద్ధ మగు అన్యార్థము ప్రతీతమగునో అచ్చట లక్షణావృత్తి, అభిధేయముతో సంబంధము సామీప్యము, సమవాయము వైపరీత్యము క్రియా యోగము వీటిచే లక్షణా ఐదు విధములు. అనంతములగు గుణముల వివక్షనుబట్టి గౌడీ వృత్తి యందు కూడ అనంత భేదము లుండును. లోక వ్యవహారజు డగు కవి ప్రస్తుత వస్తువు పై అప్రస్తుత వస్తు ధర్మములను పూర్తిగా ఆరోపించినచో దానికి సమాధి యని పేరు. శ్రవణ మాత్రముచే తెలియని అర్థము బుద్ధి గోచరమైనచో అది ఆ వేషము. ఇది ధ్వనిచే వ్యజింప చేయబడును కాన ధ్వని యని పేరు. ధ్వని సంబంధముచే శబ్దార్థములు మరియొక అర్థమును వ్యంజింప చేయును. ఒక వస్తువు యందు ఉత్కర్షను సూచించుటకు చేయు నిషేధమునకు ఆ పము యని పేరు. అప్రకృత వస్తువును స్తుతించుట, ఆస్తుత స్తోత్రము ఒక వస్తు వును వర్ణించునపుడు సమాన విశేషణములు గల మరియొక అర్థము ప్రతీతమైనచో దీనిని ఆర్థ సంక్షేపమును బట్టి సమాసోక్తి అని అందురు. వాస్తవిక పదార్థములు కప్పిపుచ్చి అన్య పదార్థమును సూచించుట అపహ్నుతి. ఒక విషయమును ఋజువగా చెప్పక మరియొక విధముగా త్రిప్పి చెప్పుట పర్యాయోక్తి. వీటిలో ఒకటి ధ్వని యని చెప్పబడును. 

ఆగ్ని మహా పురాణమనే శబ్దార్థాలంకార నిరూపణ మను మూడు వందల నలుబది ఐదవ అధ్యాయము సమాప్తము.