అగ్ని మహా పురాణము

Table of Contents

124 - అథ యుద్ధజయార్జనే జ్యోతిఃశాస్త్రసారః.

అగ్ని రువాచః

దేవ్యువాచః

ఈశ్వర ఉవాచః

అగ్ని దేవుడు పలికెను : శంకరుడు పార్వతికి చెప్పిన ప్రకారము నే నిపుడు యుద్ధజయార్ణవప్రకరణసార మైన సమయమును, మంత్రమును, ఔషధములు మొదలగువాటిని వర్ణించి చెప్పెదను. పార్వతి ప్రశ్నించేను: దేవా! దేవతలు అసురులపై విజయము.. నెట్లు సాధించిరి? ఆ విషయమును. యుద్ధజయార్ణవోక్తశుభాకతవేకాదిజ్ఞానమును గూర్చి వర్ణింపుము. శంకరుడు చెప్పెను ! పరమాత్మేచ్ఛప్రకారము వదునై దుఅక్షరముల ఒక శక్తి ఆవిర్భవించినది, దాని నుండియే చరాచర జీవుల సృష్టి ఏర్పడినది. ఆ శక్తిని ఆరాధించుటచే మానవుడు అన్ని విషయములను తెలిసికొనగల్గును. ఇపుడు ఐదు మంత్రములతో ఏర్పడిన మంత్రపీఠమును వర్ణించెదను. ఆ మంత్రములు. అన్ని మంత్రముల జీవన మరణములం దున్నవి. ఋగ్యజుఃసామాథర్వవేదమంత్రములు ప్రథమమంత్రములు. సద్యోజాతమంత్రములు ద్వితీయ మంత్రములు. బ్రహ్మ విష్ణరుద్రులుతృతీయ మంత్రస్వరూపులు. ఈశ్వరుడు, సప్తశిఖలు గల అగ్ని, ఇంద్రాది దేవతలు వీరు చతుర్ధమంత్రస్వరూపులు, అ,ఇ,ఉ,ఏ,ఓ, అను ఐదు స్వరములు పంచమమంత్రస్వరూపులు. ఈ స్వరములకే మూలబ్రహ్మ అని కూడ పేరు. కజ్జలో వ్యాపించి యున్న ఆగ్ని ఆ కజ్ఞను అంటించకుండ పైకి కనబడ నట్లు శరీరమున మన్న శివశక్తిప్రతీతి జ్ఞానము లేకుండ కాజాలదు. పార్వతీ! ఓంకారస్వర విభూషిత మైన శక్తి మొదట ఆవిర్భమిచినది. తరవాత బిందువు ఏకారరూపమున పరిణత వైనది. పిదప ఓంకారమునందు శబ్ద మావిర్భవించినది. దానినుండి ఉకార మావిర్భవించినది. ఈ ఉకారము హృదయములో శబ్దము చేయుచు ఉండును. ఆర్ధచంద్రునినుండి మోక్షమార్గప్రదర్శక ముగ ఇకారము ఆవిర్భవించినది. పిదప భోగమోక్షముల నిచ్చు అవ్యక్త’ఆ’కారము ఆవిర్భవించినది. ఆ ఆకారము స్వరశక్తిమత్తు. ప్రవృత్తి నివృత్తి బోధకము. ‘ఆ’ కారము ప్రాణ (శ్వాస) రూపమున శరీరమునందు స్థిరముగా నుండును. దీనికే ‘ఇడ’ అని పేరు, ఇకారము ‘ప్రతిష్ఠ’ అను పేరుతో రసరూపమునను, పాలక స్వరూపమనను, ఉండును, దీనికే ‘పింగల’ అని పేరు. ‘ఈ’ ఆను స్వరమును కూరళ క్తియందును, హరబీజము (ఉకారము) శరీరములో అగ్ని రూపమున నుండును. ఇదియే సమానబోధిక విద్య. దీనిని ‘గాంధారి’ అందురు. దీనిలో దహనాత్మక శక్తి యున్నది. ‘ఏ’ కారము శరీరములో జలరూపమున నున్నది. దీనిలో శాంతిక్రియ యున్నది. ఓకారము శరీరములో వాయు రూపమున నున్నది. ఇది ఆపాన -వ్యావ-ఉదానాదిలించస్వరూపములను పొంది, స్పర్శ చేయుచు, గతి శీలమై యుండును.

పంచస్వరముల సంమిలితసూక్ష్మరూప మగు ఓంకారము “శాన్యతీతము” అను పేరుతో బోధితమై శబ్దగుణక మగు ఆకాశము రూపమున నుండును. ఈ విధముగ ఏర్పడిన ఐదు స్వరములకు క్రమముగా కుజ-బుధ-గురు-శుక్ర-కనులు. కకారాదివర్ణములు ఈ స్వరములకు క్రింద నుండును. ఇవే ప్రపంచమూలకారణములు. వీటివలననే అన్ని చరాచరపదార్థముల జ్ఞానము కలుగును. ఇపుడు విద్యాపీఠస్వరూపమును చేప్పెదను. దీనియందు ఓంకారము శివరూప ముగా చెప్పబడినది. సాక్షాత్తు ఉమసోమ (అమృత) రూపిణి. ఈమెనే వామా-జ్యేష్ఠ-రౌద్రీ నామములతో కూడ వ్యవహరింతురు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులే వరుసగ మూడు గుణములు, సృష్టి-స్థితి-సంగర కారణభూతులు, శరీరములోపల మూడు రత్న నాడు లున్నవి; వీటికి స్థూల-సూక్ష్మ-పర లని పేరు. ఇవి శ్వేతవర్ణములు. వీటి నుండి సర్వదా అమృతము స్రవించుచుండును. దానిచే ఎల్లప్పుడును ఆత్మ తడుపబడుచుండును. దీనిని ఈ విధముగ దివారాత్రులు ధ్యానించవలెను. దేవీ! ఆట్టి సాధకుని శరీరము ఆజర మగును. ఆతడు శివసాయుజ్యమును పొందును? మొదట అంగుష్ఠాదులందును. నేత్రములందును, దేహమునందును అంగన్యాసము చేసి, పిదప మృత్యుంజయార్చన చేసి యాత్ర చేయువాడు యుద్దారుణందు విజయవంతు డగును. ఆకాశము శూన్యము, నిరాధారము, శబ్దగుణకము. వాయువు నందు స్పర్శగుణ మున్నది. అది అడ్డముగా ప్రసరించుచు స్పృశించును. రూపమ (అగ్ని) ఊర్ధ్వగతి గలది. జలము అధోగతి గలది. గంధగుణము గల పృథివి అన్ని స్థానములను విడచి మద్యయందుండి, అన్నింటికిని , ఆధారముగా నుండును. శివుడు నాభిమూలమునందు కంద దుంప), రూపమున నున్నాడు. శక్తి సముదాయముతో గూడ సూర్య-చంద్ర-విష్ణువులును, పంచతన్మాత్రలతో దశ ప్రాణములును అచటనే ఉన్నవి. ఆ శివమూర్తి కాలాగ్ని వలె దేదీప్యమానమై సర్వదా ప్రకాశించుచుండును. అదే చరాచర జీవలోకమునకు ప్రాణము. ఆ మంత్రపీఠము నష్టమైనపుడు వాయురూపు డగు జీవుడు నశించి నట్లు తెలిసికొనవలెను.

అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున జ్యోతిశాస్త్రసార మను నూటఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.