అగ్ని మహా పురాణము

Table of Contents

265 - అథ దిక్పాలాది స్నానమ్

ఆగ్నిరువాచః

ఆగ్ని దేవుడు పలికెను. పరశురామ ఇపుడు సకల కార్యసిద్ధిని ఇచ్చు కాంతికర మగు స్నానమును గూర్చి చెప్పేదను వినుమా. గృహములకు, శ్రీమహావిష్ణువునకు నదీతీరమున స్నానము చేయించవలెను. జ్వరపీడాదులు కలుగు నపుడు, విహాయక గ్రహబాధ కలిగినపుడును దేవాలయమునందు స్నానము చేయించవలెను. విద్యకోరువాడు జలాశయము వందు కాని, ఇంటిలోకాని స్నానము చేయించవలెను. విజయమకోరువాడు తీర్థజలమున స్నానము చేయించవలెను. గర్భస్రావధితో బాధపడుతున్న స్త్రీకి పుష్కరిణిలో స్నానము చేయించవ రెను. పుట్టిన వెంటనే శిశువులు మరణించు స్త్రీకి ఆశోకవృక్ష సమీపమాన స్నానము చేయించవలేను. రజోదర్శనము కోరు స్త్రీలు పుషములతో నిండిన వనమునందును, పుత్రులను కోరు స్త్రీలు సముద్రమానందును, సౌభాగ్యమును గోరు స్త్రీలు, గృహమునందును స్నానము చేయవలెను. పైన చెప్పిన వారందరును విష్ణు ప్రతిమ సమీపమున స్నానము చేయవలెను. శ్రవణ, రేవతి, పుష్య నక్షత్రములందు అందరికిని స్నానము ఉత్తమము. కావ్య స్నానము చేయువారికి ఒక సప్తాహము ముందుగ నే ఉత్సాదనము విధింపబడినది. పునర్నవ, గోరోచనము, శతాంగ ము, గురుణి, బెరడు, మధూకము, రెండు విధములగు పసుపు, తగరము, నాగ కేసరమ, అంబరి మంజిష్ఠ, జటామాంసి, యాసకము కర్డమము ప్రియంగువు, తెల్ల ఆవాలు, కుష్ఠము, బల బ్రాహ్మి కుంకుమను, సత్తువులు కలిపిన పంచగవ్యములు వీటితో శరీరము నలుచుకొని, స్నానము చేయవలెను.

పిమ్మట తామపత్రము పై పద్మమండలము నిర్మించి దానికర్ణిక యందు, విష్ణువును పూజించవలెను. దానికుడి భాగమున బ్రహ్మను, ఎడమప్రక్క. శివుని హర్వాది దిగ్గళుమలందు ఆయుధ కరివారాది సహితులగు దిక్పాలకులను ఉంచి హర్వాడి దిశ లండను, ఆగ్నేయాది విదిశలందును, ఎనిమిది స్నానమండలములు నిర్మించవలేను. 'ఆమండలముల పై ఆయుధ సహితులగు విష్ణు, బ్రహ్మ, శివ, ఇంద్రాదులను పూజించి, వారి నుద్దేశించి హోమము చేయవలెను. ఒక్కొక్క దేవతకు నూటయెనిమిది ఆహుతులు సమిధలతోను తిలలతోను, మృతముతోను ఇవ్వవలెను. పిదప భద్ర, సుభద్ర, సిద్దార్థ, పుష్టివర్ధన ఆమోఘ చిత్రభాను, పర్జన్య, సుదర్శనమాలను యెనిమిదిక శల స్థాపించి వాటిపై, ఆశ్విని, రుద్ర. మరుద్గణ - విశ్వేదేవ దైత్య - వసుదుర్గా - మునులను ఇతర దేవతలను ఆవాహన చేసి “మీరందరును ప్రసన్నులై ఈకల శముల పై ఉండుడు అని ప్రార్థించవలెను. ఆకలశలలో, జయంతి, విజయ, జయ, శతావరి, శతపుష్ప, విష్ణు క్రాంత, ఆపరాజిత, జ్యోతిష్మతి, ఆతిబల చందన, ఆశీర, కేసర, కస్తూరి, కర్పూర, పాలక, పత్రక, త్వచ "జాతీ ఫల, లవంగములను, మృత్తి కను, పంచగవ్యములను వేయవలెను. పిమ్మట బ్రాహ్మణులు సాధ్యుడగు మనుష్యుని భద్ర పీఠముపై కూర్చుండ బెట్టి, బలపూర్వకముగా స్నానము చేయించవలెను. రాజ్యాభిషేక మంత్రములలో చెప్పబడిన దేవతలకు వేరు వేరుగా హోమములు చేయించవలెను. పిదప హర్ణాహుతి ఇచ్చి గురువుకు దక్షిణా ఇవ్వవలెను. పూర్వము బృహస్పతి ఇంద్రునకు ఆభి షేకము చేయించగ, ఆతడు దైత్యులను చంపెను. ఇంతవరకు విజయాదిక మును ఇచ్చు దిక్పాలస్నానవి ను చెప్పితిని.

అగ్ని మహాపురాణమున దిక్పాలాది స్నానమను రెండు వందల అరువది ఐదవ అధ్యాయము సమాప్తము.