అగ్ని మహా పురాణము
382 - అథ యమగీతా
అగ్ని రువాచః
యమ ఉవాచః
అగ్ని దేవుడు పలికెను. నచికేతునుకి చెప్పిన యమగీతను చెప్పెదను. ఇతి మోక్షార్థులగు పఠించువారికిని, విను వారికిని, భుక్తి ముక్తి ప్రదము. యముడు పలికెను. మానవుడు తాను ఆస్థిరు డైనను, అశాశ్వతు డైనను అతి మోహావిష్టుడే ఆసన, శయన, యానవస్త్ర గృహాదిక మను స్థిరముగ నుండవలెనని కోరుకొనును. భోగములయందాసక్తి లేకుండుట, సర్వదా ఆత్మను చూచుట ఇది మనమ్యులకు పరమ శ్రేయస్సు అని కపిలుడు చెప్పినాడు. సర్వత్ర సమముగా చూచుట, మమకారము, లేకుండుట, ఆసంగత్వము ఇది మనుష్యులకు పరమ శేయస్సు అని పంచ శిఖుడు చెప్పెను. గర్భవాసము మొదలు జన్మ బాల్యాది, వయస్సులకు సంబంధించి అవస్థలను తెలుసుకొనుట మనుష్యులకు పరమ శ్రీ శ్రేయస్సు. అని గంగా విష్ణువులు చెప్పిరి. ఆధ్యాత్మి కాది దుఃఖములకు ఆద్యంతాదులను తెలుసుకొని ప్రతి క్రియ చేయుట మానవులకు పరమశ్రేయస్సు అని జనకుడు బోధించెను. భేదము లేని తత్త్వము నందు భేదమును చూచుటను, శమింపచేయునది, ఉత్తమ శ్రేయస్సు అని బ్రహ్మ చెప్పెను. ఋగ్యజుస్సామవిహితమగు కర్మను కర్తవ్య బుద్దితో సంగములేక చేసిన శ్రేయస్కరము అని జైగీశవ్యుడు బోధించెను. సమస్త కార్యారంథములను పరిత్యజించుటయే సుఖసాధనము. ఆదియే మనుష్యులకు పరమ శ్రేయస్సు అని దేవలుడు బోధించెను. కామమును త్యజించినచో, విజ్ఞాన, సుఖ, పరమపద, ప్రాప్తి కలుగును. కామవంతులకు విజ్ఞానము కలుగదు. అనిసనకుడు బోధించెను.
ప్రవృత్తి నివృత్తి రూపమగు కర్మ చేయవలెను, కాని నైష్కర్మ్యమే పరమ్మశ్రేయస్సు ఇదియే హరిస్వరూపము. జ్ఞానియైన పురుషుడు పరమము, అవ్యయము, విష్ణు సంజ్ఞక ము అగు బ్రహ్మతో ఎన్నడును భేదమును పొందడు. తపస్సుచే జ్ఞానము విజ్ఞానము, ఆ సిక్యము సౌభాగ్యము, ఉత్తమ రూపము లభించును. మనస్సుతో కోరిదెల్లయు లభించును. విష్ణువుతో సమానమైన ధ్యేయము లేదు, ఉపవాసమును మించిన తపస్సు లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉత్తమ వస్తువులేదు. గంగా సమానమైన నదిలేదు. జగద్గురు లైవ, విష్ణువు తప్ప మరియెవ్వరును బంధువులులేదు, క్రింద, పైవ, మందు దేహేంద్రియ మనో ముఖము లందును, హరియేవున్నాడు అని స్మరించుచు ప్రాణము:ను త్యజించువాడు హరియే అగుమ, దేనినుండి సర్వము పుట్టినదో దేనియందే నిలచియున్నదో ఆట్టి, గ్రహింపశక్యముగా నిదియు, అనిర్దేశ్యము, సుప్రతిష్ఠితము అగునది పర బ్రహ్మ, విష్ణువు పరాపర స్వరూపములతో అందరి హృదయము లందునువున్నాడు. కొందరాతనని యజ్ఞోపుడు, యజ్ఞ పురుషుడు అని చెప్పుదురు. కొందరు విష్ణువనియు కొందరు శివుడనియు కొందరు బ్రహ్మ యనియు ఆ పరమేశ్వ రునే చెప్పెదరు. కొందరు ఇంద్రాది నామములతో, పేర్కొందురు. కొందరు సూర్యుడు, సోముడు, కాలపురుషుడు ఆని చెప్పుదురు. బ్రహ్మాది స్తంభ పర్యంతమగు జగత్తు విష్ణు రూపమని చెప్పుదురు. ఆ విష్ణువుయే పరబ్రహ్మ. ఆస్థానము చేరినవారు వునరావృత్తి పొందరు. సువర్ణావి మహాదానముల చేతను, పుణ్య తీర్థ స్నానములచేతను, ధ్యాన, వత, పూజా ధర్మ శతులచేతను, ఆస్థానమును పొందవలేమ. ఆత్మయే అధికుడని తెలుసుకొనవలెను. శరీరము రథము, బుద్ధి సారథి. మనస్సు క ళ్ళేము. ఇంద్రియములు అశ్వములు. విషయములు వాటిగ మ్యములు. ఆత్మేంద్రియ మవస్స మదాయ మునుపండితులు భోక్త ఆదురు. నిగ్రహింపబడని మనస్సు కలవా డై, విజ్ఞానమును సుపాడింపని వాడు. ఆ పరమ పదమును పొందిజాలడు. సంసారమునే పొందును. మనో నిగ్రహవంతుడే విజ్ఞానమును సంపాదించినవాడు. ఆ పరమ పదమును పొందును. మరల దానిమండి వెనుకకురాడు. విజ్ఞాన సార థియై మస్సు అన పగ్గము గలవరుడు మార్గ మును దాటి, ఆ పరచు విష్ణు పదమును చేరును. ఇంద్రియముల కంటే ఆరమలు పర ములు. వాటికంటే మనస్సు పరము, దానికంటే బుద్ధి పరము. బుద్ధికందే మహత్తు పరము. మహత్తుకంటే అవ్య క్షము పరము, దానికంటే పుర ముడు పరుడు. పురుషుని కంటే పగ మైనది యేదియు లేదు. పురుషుడే పరాకాష్ఠ. ఆతడే పరాగతి. సర్వభూతములందు గూఢమైవున్న ఆత్మ పైకి కనబడుట లేదు. కానీ సూక్ష్మదర్శులచే సూక్ష్మమగు బుద్ధితో చూడబడుచున్నది.
ఆగ్ని రువాచః
పండితుడు వాక్కును మనస్సు యందు నిలుపవలెను. దానిని జ్ఞానమునందు నిలుపవలెను. దానిని మహదాత్మ యందు నిలపవలెను. దానిని శాంతమగు ఆత్మయందు నిలపవలెను. బ్రహ్మాత్మల యోగమును యమాదులచే తెలుసుకొని మానవుడు బ్రహ్మ స్వరూపుడగును. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మ చర్యము, అపరిగ్రహము, అనునవి యమములు. శౌచము సంతోషము, తపస్సు స్వాధ్యాయము, ఈశ్వర పూజ ఈ ఐదునుని యమములు. పద్మాదికము ఆసవము. ప్రాణవాయువును జయించుట ప్రాణాయామము. ఇంద్రియ నిగ్రహము ప్రత్యాహారము. శుభము ఒక విషయ ముపై చిత్తమును నిలుపుట ధారణ. ఒకే విషయము పై మాటి మాటికి, ధారణ చేయుట ధ్యానము. నేనే బ్రహ్మను అనుస్థితిలో నుండుట సమాధి. మటము నశించగ నే ఘటాకాశము మహాకాశముతో అభిన్నమైనట్లు ముక్తుడగు జీవుడు బ్రహ్మతో ఐక్యమును పొందును. సద్ర్బహ్మ స్వరూపుడగును జీవుడు ఆజ్ఞాన వశముచే తాను బ్రహ్మ భిన్ను డనని అనుకొనుచున్నాడు. అజ్ఞానము దాని కార్వములు తొలగి పోయిన వెంటనే ఆతడు అజరామరుడు ఆగును. అగ్ని దేవుడు పలికెను. వశిష్ణా ! పఠితలకు భుక్తి ముక్తి ప్రదమగు యమ గీతను చెప్పితిని. వేదాంత జ్ఞానముచే, సర్వత్ర బ్రహ్మ బుద్ధి కలుగ టయే ఆత్యంతిక ప్రళయము.
అగ్ని మహాపురాణమున యమగీత అను మూడు వందల ఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.
